ఫ్యాన్స్ కోహ్లి కంటే పెద్ద జోకర్స్.. సింగర్ కాంట్రవర్సీ కామెంట్లు.. బ్లాక్ చేసిన విరాట్.. ఏమైందంటే?

Best Web Hosting Provider In India 2024

ఫ్యాన్స్ కోహ్లి కంటే పెద్ద జోకర్స్.. సింగర్ కాంట్రవర్సీ కామెంట్లు.. బ్లాక్ చేసిన విరాట్.. ఏమైందంటే?

 

విరాట్ కోహ్లి ఫ్యాన్స్ పై బాలీవుడ్ సింగర్ రాహుల్ వైద్య చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కోహ్లి, అవనీత్ కౌర్ ఘటన మధ్యలోకి వెళ్లిన రాహుల్ మరో కాంట్రవర్సీకి దారితీశాడు.

 
కోహ్లి ఫ్యాన్స్ పై రాహుల్ వైద్య కాంట్రవర్సీ కామెంట్లు
 

 

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ హాట్ బ్యూటీ అవనీత్ కౌర్ మధ్యలోకి వెళ్లిన సింగర్ రాహుల్ వైద్య కాంట్రవర్సీ కామెంట్లు చేశాడు. ఇన్‌స్టాగ్రామ్ లో అవనీత్ కౌర్ ఫ్యాన్ పేజీలో ఓ పోస్టుకు కోహ్లి లైక్ కొట్టడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇది పొరపాటున జరిగిందని కోహ్లి క్లారిటీ ఇచ్చాడు. అయితే దీనిపై కోహ్లీ ట్రోల్ చేసేలా రాహుల్ స్పందించాడు. ఇప్పుడు కోహ్లి ఫ్యాన్స్ ను జోకర్స్ అని పిలిచాడు.

 

అకౌంట్ బ్లాక్

బాలీవుడ్ బోల్డ్ భామ అవనీత్‌ కౌర్ ఫ్యాన్ పేజీలో కోహ్లి అఫీషియల్ అకౌంట్ నుంచి లైక్ కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై రకరకాల ఊహగానాలు వచ్చాయి. అయితే ఇది అల్గారిథం పొరపాటు కారణంగా జరిగి ఉండొచ్చని, దీని వెనుక ఎలాంటి ఉద్దేశం లేదని కోహ్లి వివరణ ఇచ్చాడు. అయితే దీనిపై రాహుల్ వైద్య వెటకారంగా మాట్లాడాడు. కోహ్లీని ట్రోల్ చేసేలా పోస్టు పెట్టాడు. దీంతో రాహుల్ వైద్యను కోహ్లి బ్లాక్ చేశాడు. ఈ విషయాన్ని కూడా రాహుల్ వెల్లడించాడు.

కోహ్లీపై జోక్

ఫస్ట్ రాహుల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక వీడియోను షేర్ చేస్తూ “నేను చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే, నేను కాకుండా ఇప్పటి నుంచి చాలా ఫొటోలను అల్గారిథమ్ లైక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఏ అమ్మాయి అయినా దయచేసి దాని గురించి పబ్లిసిటీ స్టంట్ చేయకండి. ఎందుకంటే ఇది నా తప్పు కాదు. ఇది ఇన్‌స్టాగ్రామ్ తప్పు, సరేనా?” అని పేర్కొన్నాడు. కోహ్లి అల్గారిథమ్ పొరపాటు అని చెప్పడంతో ఎగతాళి చేసేలా రాహుల్ ఈ పోస్టు పెట్టాడు.

 

మరోసారి ట్రోల్

మరో స్టోరీ..లో “విరాట్ కోహ్లి నన్ను బ్లాక్ చేశారు. అది కూడా ఇన్‌స్టాగ్రామ్ లోపమే అని నేను అనుకుంటున్నా. విరాట్ నన్ను బ్లాక్ చేయలేదు. ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథమ్ విరాట్ కోహ్లీతో ‘ఒక పని చెయ్యి. నేను నీ తరపున రాహుల్ వైద్యను బ్లాక్ చేస్తా’ అని చెప్పి ఉంటుంది’’ అని మళ్లీ కోహ్లీని ట్రోల్ చేసేలా రాహుల్ స్టోరీ పోస్టు చేశాడు. దీనిపై విరాట్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. అంతటితో ఆగని రాహుల్ విరాట్ ఫ్యాన్స్ ను జోకర్లు అంటూ పిలిచాడు.

కాంట్రవర్సీ పోస్టు

రాహుల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో.. “విరాట్ కోహ్లి అభిమానులు విరాట్ కంటే పెద్ద జోకర్లు!” అని రాశాడు. “ఇప్పుడు మీరు నన్ను దూషిస్తున్నారు. అది సరే కానీ మీరు నా భార్యను, నా సోదరిని దూషిస్తున్నారు. వారికి దీనితో సంబంధం లేదు! కాబట్టి నేను చెప్పింది నిజమే. అందుకే విరాట్ కోహ్లి అభిమానులు జోకర్లు! 2 కౌడీల (విలువలేని) జోకర్లు” అని కాంట్రవర్సీ కామెంట్లు చేశాడు రాహుల్. తన భార్య, నటి దిశా పర్మార్‌ను, సోదరి శృతి వైద్యను దూషించారని రాహుల్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో తెలిపాడు.

రాహుల్ వైద్య ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్
రాహుల్ వైద్య ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్
 
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024