చికెన్ సీక్ కబాబ్ రెసిపీ.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది

Best Web Hosting Provider In India 2024

చికెన్ సీక్ కబాబ్ రెసిపీ.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది

Haritha Chappa HT Telugu

చికెన్ ప్రియులకు సీక్ కబాబ్ వంటకాలు ఎంతో నచ్చుతాయి. ఇవి టేస్టీగా ఉంటాయి. చికెన్ తో సీక్ కబాబ్‌లు చేస్తే రుచిగా ఉంటాయి. రెసిపీ ఇక్కడ ఇచ్చాము.

చికెన్ సీక్ కబాబ్ రెసిపీ (Youtube)

చికెన్ సీఖ్ కబాబ్ అనేది దక్షిణాసియాలో ప్రాచుర్యం పొందిన ఒక రకమైన కబాబ్. దీనిని గొర్రె మాంసం, చికెన్ తో తయారు చేస్తారు. ఇక్కడ మేము సీఖ్ కబాబ్‌లు రెసిపీ చికెన్ తో ఎలా చేయాలో ఇచ్చాము.

సీఖ్ కబాబ్ లు మెత్తగా, జ్యూసీగా ఉంటాయి. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కారం, గరం మసాలా వంటి వివిధ మసాలా దినుసులు దానిపై వేయాలి. అలాగే, నిమ్మరసం, కొత్తిమీర, పుదీనా ఆకులు చాలా రుచిగా ఉంటాయి.

శాకాహార సీఖ్ కబాబ్ లు భారతదేశంలో ప్రసిద్ధి చెందాయి. వీటిని శెనగపిండి, గుజ్జరి, బంగాళాదుంపలు, కాలీఫ్లవర్, పచ్చి బఠానీలతో తయారుచేస్తారు.

చికెన్ సీక్ కబాబ్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

చికెన్ కీమా – అర కిలో

ఉల్లిపాయ – రెండు

పచ్చిమిర్చి – మూడు

అల్లం వెల్లుల్లి పేస్ట్ – రెండు స్పూన్లు

కొత్తిమీర తరుగు – పావు కప్పు

పుదీనా ఆకుల తరుగు – పావు కప్పు

జీలకర్ర – ఒక స్పూను

ధనియాల పొడి – ఒక స్పూను

గరం మసాలా – ఒక స్పూను

పసుపు – అర స్పూను

గుడ్డు – ఒకటి

ఉప్పు – రుచికి సరిపడా

కారం – ఒక స్పూను

చికెన్ సీక్ కబాబ్ రెసిపీ

  1. చికెన్ కీమాను శుభ్రంగా కడిగి పక్కడ పెట్టుకోవాలి.
  2. ఒక పెద్ద గిన్నెలో ఆ మాంసాన్ని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి.

3. కొత్తిమీర తరుగు, పుదీనా ఆకులు, జీలకర్ర, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, కారం పొడి మొదలైనవి.

4. పదార్థాలన్నీ కలిసే వరకు బాగా కలపాలి. అందులో ఒక గుడ్డు కొట్టి వేసి కలపాలి.

5. గిన్నెను కవర్ చేసి ఈ మిశ్రమాన్ని కనీసం 30 నిమిషాల పాటు ఫ్రిజ్ లో మ్యారినేట్ చేయాలి.

6. ఇప్పుడు చికెన్ మిశ్రమాన్ని తీసి చిన్న ముద్దను తీసి కబాబ్ ఆకారంలో ఒత్తుకోవాలి.

7. దాన్ని పుల్లకు గుచ్చుకోవాలి. దాన్ని ఎయిర్ ఫ్రైయర్ లో, ఓవెన్ లో ఉడికించాలి.

8. లేదా కళాయిలో నూనె వేయాలి. అందులో ఈ పుల్లలను ఉంచి కాల్చాలి.

9. కబాబ్ లు గోధుమ రంగులోకి వచ్చే వరకు ఉడికించాలి. అంతే టేస్టీ చికెన్ సీక్ కబాబ్ రెసిపీ అయినట్టే.

వండిన తర్వాత సీక్ కబాబ్ లను స్కేవర్ల నుంచి తీసి వేడివేడిగా సర్వ్ చేయాలి. వీటితో పాటు పుదీనా చట్నీ, పెరుగు సాస్ లేదా సైడ్ సలాడ్ కలిపి తింటే అతిథులు ఆనందిస్తారు.

సువాసన, తేమ ఎక్కువ కావాలంటే కరిగించిన వెన్న, చిటికెడు గరం మసాలా మిశ్రమంతో కబాబ్ లను బ్రష్ చేసుకోవాలి. ఈ సింపుల్ చిట్కా కబాబ్ ల రుచి, రూపాన్ని పెంచుతుంది.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి https://www.linkedin.com/in/haritha-ch-288a581a8/
Source / Credits

Best Web Hosting Provider In India 2024