Best Web Hosting Provider In India 2024

గుడ్‍న్యూస్ చెప్పేసిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.. తల్లిదండ్రులు కానున్న స్టార్ కపుల్
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి గుడ్‍న్యూస్ చెప్పేశారు. వారిద్దరూ త్వరలో తల్లిదండ్రులు కానున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించారు.
మెగా కుటుంబంలో మరో సంబరం నెలకొంది. టాలీవుడ్ యంగ్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి త్వరలో తొలిసారి తల్లిదండ్రులు కానున్నారు. లావణ్య ప్రస్తుతం గర్భవతిగా ఉన్నారు. ఈ విషయాన్ని వరుణ్ తేజ్ నేడు (మే 6) సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
బ్యూటిఫుల్ రోల్ త్వరలో..
తాను, లావణ్య ఒకరి చేతిలో చేయి వేసుకొని.. బుజ్జి బూట్లలను వేళ్లతో పట్టుకున్న ఫొటోను వరుణ్ తేజ్ నేడు ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు. లవ్ సింబల్స్ కూడా పెట్టారు. జీవితంలో అత్యంత అందమైన పాత్ర త్వరలో వచ్చేస్తోంది అని క్యాప్షన్ రాశారు. తల్లిదండ్రులం కాబోతున్నామని చెప్పేశారు. “లైఫ్‍లో అత్యంత బ్యూటిఫుల్ రోల్.. త్వరలో” అని వరుణ్ రాసుకొచ్చారు. స్టార్ కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం 2023 నవంబర్ 1వ తేదీన జరిగింది.
ఆరేళ్ల ప్రేమ, ఘనంగా పెళ్లి
2017లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా మిస్టర్ సినిమా చేశారు. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. అప్పటి నుంచి లవ్‌లో ఉన్నా చాలా కాలం వీరి విషయం బయటికి రాలేదు. 2018లో అంతరిక్షం సినిమాలోనూ వరుణ్, లావణ్య కలిసి నటించారు. వీరి ప్రేమ మరింత గాఢంగా మారింది.
ఎట్టకేలకు సుమారు ఆరేళ్ల ప్రేమ తర్వాత 2023 జూన్‍లో వరుణ్, లావణ్య నిశ్చితార్థం జరిగింది. ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో వైభవంగా ఈ వేడుక జరిగింది. 2023 నవంబర్ 1వ తేదీన ఇటలీలోని టస్కానీలో వీరిద్దరి పెళ్లి గ్రాండ్‍గా జరిగింది. వివాహ బంధంతో ఈ లవ్ కపుల్ భార్యాభర్తలు అయ్యారు. తాము తల్లిదండ్రులం కానున్నామని 2025లో ఇప్పుడు ప్రకటించారు.
సినిమాలు ఇలా..
వరుణ్ తేజ్ ప్రస్తుతం రెండేళ్లలో వరుసగా మూడు డిజాస్టర్లు ఎదురయ్యాయి. చాలా అంచనాలతో వచ్చిన గత సినిమా మట్కా బోల్తా కొట్టేసింది. ప్రస్తుతం డైరక్టర్ మేర్లపాక గాంధీతో ఓ ఇండో-కొరియన్ హారర్ కామెడీ సినిమా చేస్తున్నారు వరుణ్. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‍మెంట్స్ బ్యానర్లు ఈ మూవీని ప్రొడ్యూజ్ చేస్తున్నాయి. థమన్ మ్యాజిక్ ఇస్తున్నారు. ఈ మూవీలో సత్య కూడా ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు.
సతీ లీలావతి అనే సినిమా లావణ్య త్రిపాఠి ఓకే చెప్పారు. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలైంది. ప్రెగ్నెసీతో వల్ల ప్రస్తుతం బ్రేక్ తీసుకున్నారు లావణ్య.