




Best Web Hosting Provider In India 2024
తిలక్ వర్మకు విజయ్ దేవరకొండ ఛాలెంజ్..పికిల్ బాల్ కోర్టులో ఫైట్..ఎవరు గెలిచారంటే? వీడియో వైరల్
స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఓ వైపు.. ముంబయి ఇండియన్స్ యంగ్ ప్లేయర్ తిలక్ వర్మ మరోవైపు. వీళ్లిద్దరి మధ్య పికిల్ బాల్ గేమ్. తనను ఓడించాలని విజయ్ ఛాలెంజ్ చేశారు. మరి చివరకు ఎవరు గెలిచారంటే? విజయ్, తిలక్ పికిల్ బాల్ గేమ్ వీడియో వైరల్ అవుతోంది.
ఓ వైపు సినిమా షూటింగ్ లో బిజీగా ఉండే విజయ్ దేవరకొండ.. మరోవైపు ఐపీఎల్ 2025లో మ్యాచ్ లతో తీరిక లేకుండా ఉన్న తిలక్ వర్మ. కానీ ఈ ఇద్దరూ కలిశారు. సరదాగా పికిల్ బాల్ గేమ్ ఆడారు. ఈ ఇద్దరు హైదరాబాదీలు నువ్వానేనా అన్నట్లుగా పికిల్ బాల్ గేమ్ లో పోటీపడ్డారు. చివరకు రౌడీ హీరో విజయ్ గెలిచారు.
విజయ్ ఛాలెంజ్
విజయ్ దేవరకొండ, తిలక్ వర్మ ఆడిన పికిల్ గేమ్ వీడియోను ముంబయి ఇండియన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది. విజయ్, తిలక్ విక్టరీ కోసం చెమటోడ్చడం ఈ వీడియోలో కనిపించింది. సరదాగా మొదలైన పోరు ఆ తర్వాత రసవత్తరంగా మారింది. తిలక్ గెలిస్తే తాను ముంబయి ఇండియన్స్ జెర్సీ ఇప్పుడే వేసుకుంటానని విజయ్ ఛాలెంజ్ చేశారు.
హీరోదే విక్టరీ
ఉత్కంఠగా సాగిన పికిల్ బాల్ పోరులో చివరకు విజయ్ దేవరకొండ గెలిచారు. బెస్ట్ ఆఫ్ త్రీ గేమ్స్ మ్యాచ్ ను 2-1తో గెలుచుకున్నారు. ఈ వీడియోలో బ్యాక్ గ్రౌండ్ లో విజయ్ లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’ ఫస్ట్ సాంగ్ ‘హృదయం లోపల’ ప్లే అయింది. ఫన్నీ సెటైర్లు వేసుకుంటూ సాగిన ఈ గేమ్ వీడియో ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. ఈ వీడియోకు రష్మిక మంధాన లైక్ కొట్టడం విశేషం.
కొత్త మూవీతో
అర్జున్ రెడ్డి మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండకు ఇటీవల సరైన హిట్ పడలేదు. ముఖ్యంగా ‘లైగర్’ డిజాస్టర్ తర్వాత ‘ఖుషీ’, ‘ది ఫ్యామిలీ స్టార్’ సినిమాలు కూడా అనుకున్న స్థాయిలో ఆడలేకపోయాయి. కల్కి మూవీలో అర్జునుడి రోల్ ప్లే చేసిన విజయ్.. ఇప్పుడు ‘కింగ్ డమ్’ మూవీతో థియేటర్లకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.
‘కింగ్ డమ్’ స్పై థ్రిల్లర్ మూవీకి గౌతమ్ తన్నూరి డైరెక్టర్. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ సినిమాస్ కలిసి ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. విజయ్ సరసన భాగ్యశ్రీ ఫీమేల్ లీడ్ రోల్ చేస్తోంది. సుమారు రూ.110 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ మే 30న రిలీజ్ కానుంది. మరోవైపు ఐపీఎల్ 2025లో తిలక్ వర్మ టీమ్ ముంబయి ఇండియన్స్ దూసుకెళ్తోంది. ఆ టీమ్ వరుసగా ఆరు మ్యాచ్ ల్లో గెలిచింది.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link