





Best Web Hosting Provider In India 2024

తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు, పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు- రేపటి వాతావరణం ఇలా
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకపక్క తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నా…ఉష్ణోగ్రతలు గరిష్టంగానే నమోదు అవుతున్నాయి. ఏపీ, తెలంగాణలో రేపటి వాతావరణం ఇలా ఉండనుంది.
వాతావరణ శాఖ ఏపీకి వర్ష సూచన చేసింది. గురువారం రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు,40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అలాగే రేపు ఉష్ణోగ్రతలు 40°C – 42°C మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉందని, ఎల్లుండి నుంచి ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
బుధవారం సాయంత్రం 6 గంటల నాటికి అంబేడ్కర్ కోనసీమ జిల్లా మధ్యకొంపలులో 86 మి.మీ, రామచంద్రపురంలో 73.5 మిమీ, కొత్తపేటలో 64.5 మి.మీ అధికవర్షపాతం, వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురంలో 40.7°C గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపారు. ఈదురుగాలులు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణ వెదర్ అప్డేట్స్
రానున్న మూడు రోజులు తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 °C తక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది.
రేపటి వాతావరణం
రేపు రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన వర్షాలు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
ఎల్లుండి వెదర్ రిపోర్ట్
ఎల్లుండి తెలంగాణలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
తేలికపాటి వర్షాలు
ఈ నెల 10, 11, 12 తేదీల్లో కూడా తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
సంబంధిత కథనం
టాపిక్