




Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి సూపర్ హిట్ తమిళ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో 8.2 రేటింగ్.. నాలుగు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్
ఓటీటీలోకి ఇప్పుడో సూపర్ హిట్ తమిళ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ ఏడాది జనవరి 14న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. నాలుగు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. ఈ మూవీకి ఐఎండీబీలో 8.2 రేటింగ్ ఉంది.
తమిళ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ నేసిప్పాయా (Nesippaya) ఈ ఏడాది పొంగల్ సందర్భంగా థియేటర్లలో రిలీజైంది. అయితే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ చాలా ఆలస్యమైంది. మొత్తానికి మరో వారం రోజుల్లోనే ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ కు రాబోతోంది. ఈ సినిమా విశేషాలేంటో ఒకసారి చూద్దాం.
నేసిప్పాయా ఓటీటీ రిలీజ్ డేట్
తమిళ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ నేసిప్పాయా. అంటే తెలుగులో ప్రేమిస్తావా అని అర్థం. ఈ సినిమా ఈ ఏడాది జనవరి 14న రిలీజైంది. ఇప్పుడీ మూవీ మే 16 నుంచి సన్ నెక్ట్స్ (Sun NXT) ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. “నేసిప్పాయా? మే 16 నుంచి మొదలు.
నేసిప్పాయా మే 16 నుంచి సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్” అనే క్యాప్షన్ తో మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని వెల్లడించింది. ఐఎండీబీలో 8.2 రేటింగ్ ఉన్న ఈ సినిమా నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి రానుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
నేసిప్పాయా మూవీ గురించి..
నేసిప్పాయా మూవీని విష్ణువర్దన్ డైరెక్ట్ చేశాడు. ఆకాశ్ మురళీ, అదితి శంకర్ లీడ్ రోల్స్ లో నటించారు. అర్జున్, దియా అనే పాత్రల్లో వీళ్లు కనిపించారు. ఇదొక రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. అర్జున్, దియా కాలేజీ రోజుల్లో ప్రేమించుకుంటారు. కానీ వాళ్ల ప్రేమ ఎక్కువ కాలం నిలవదు. దియాకు పోర్చుగల్ లో ఓ జాబ్ ఆఫర్ వస్తుంది. ఆమెతోపాటు వెళ్లడానికి అర్జున్ సిద్ధమైనా దియా వారిస్తుంది.
నీ కెరీర్ పై దృష్టి సారించమని చెబుతుంది. ఆమె వెళ్లేలోపే ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అర్జున్ భావించడంతో దియా కోపంతో అతనికి బ్రేకప్ చెప్పి వెళ్లిపోతుంది. ఏడేళ్ల తర్వాత దియా ఓ హత్య కేసులో ఇరుక్కుందని అర్జున్ తెలుసుకుంటాడు. విషయం తెలియగానే అతడు పోర్చుగల్ వెళ్లి దియాకు సాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? దియా ఈ కేసు నుంచి బయటపడుతుందా? మళ్లీ అర్జున్ తో కలుస్తుందా అన్నది ఈ మూవీ స్టోరీ.
థియేటర్లలో సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐఎండీబీలో ఏకంగా 8.2 రేటింగ్ కూడా సొంతం చేసుకుంది. ప్రేక్షకులకు బాగా నచ్చిన ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మే 16 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.
సంబంధిత కథనం