గుండె నిండా గుడి గంట‌లు టుడే ఎపిసోడ్‌: భ‌ర్త‌ను ఛీ కొట్టిన మీనా – భార్య కోసం బాలు త్యాగం – క్రిమిన‌ల్‌గా ముద్ర‌

Best Web Hosting Provider In India 2024

గుండె నిండా గుడి గంట‌లు టుడే ఎపిసోడ్‌: భ‌ర్త‌ను ఛీ కొట్టిన మీనా – భార్య కోసం బాలు త్యాగం – క్రిమిన‌ల్‌గా ముద్ర‌

 

గుండె నిండా గుడి గంట‌లు మే 8 ఎపిసోడ్‌లో బాలు తాగేసి వ‌చ్చి త‌న చేయి విర‌గ్గొట్టాడ‌ని అబ‌ద్ధం చెబుతాడు శివ‌. త‌మ్ముడి మాట‌లు నిజ‌మ‌ని న‌మ్మి బాలును నిల‌దీస్తుంది మీనా. శివ చ‌దువును నాశ‌నం చేశార‌ని, క‌ష్ట‌మ‌స్తే ఆదుకునే దిక్కులేద‌ని మా త‌మ్ముడిని కొట్టార‌ంటూ బాలును నానా మాట‌లు అంటుంది.

 
గుండె నిండా గుడి గంట‌లు మే 8 ఎపిసోడ్‌
 

 

శివ చేయి విరిగింద‌ని ఆప‌రేష‌న్ చేయాల‌ని డాక్ట‌ర్లు అన్నార‌ని మీనాతో చెబుతుంది సుతి. 30 వేలు ఖ‌ర్చ‌వుతుంద‌ని, వెంట‌నే క‌ట్ట‌మ‌ని అంటున్నార‌ని కంగారు ప‌డుతుంది. ఇప్ప‌టికిప్పుడు అంత డ‌బ్బు ఎక్క‌డి నుంచి తీసుకురావాలో తెలియ‌డం లేద‌ని పార్వ‌తి క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. త‌న ద‌గ్గ‌ర ఉన్న ఆరు వేలు త‌ల్లికి ఇస్తుంది మీనా. ఇంకా ప‌న్నెండు వేలు త‌క్కువ కావ‌డంతో బాలుకు ఫోన్ చేస్తుంది మీనా.

 

తిట్ట‌డానికే ఫోన్‌…

మీనా ఫోన్ చేస్తుంటే బాలు క‌ట్ చేస్తుంటాడు. ఏదైనా అర్జెంట్ కావ‌చ్చున‌ని, ఒక‌సారి మాట్లాడ‌మ‌ని రాజేష్ అంటాడు. ఏం అర్జెంట్ లేద‌ని, త‌మ్ముడిని చూడ‌టానికి హాస్పిట‌ల్‌కు వెళ్ల‌లేద‌ని తిట్ట‌డానికే మీనా ఫోన్ చేసి ఉంటుంద‌ని బాలు అంటాడు. బాలు ఫోన్ లిఫ్ట్ చేయ‌క‌పోవ‌డంతో డ‌బ్బుల కోసం తెలిసిన వాళ్ల‌ను అంద‌రిని అడుగుతారు పార్వ‌తి, మీనా. కానీ ఎవ‌రు డ‌బ్బు సాయం చేయ‌డానికి ముందుకురారు.

డాక్ట‌ర్‌ను బ‌తిలిలాడిన కార్తీక్‌…

ఆప‌రేష‌న్ చేయ‌డానికి 30 వేలు క‌ట్టాల‌ని అన్నార‌ట‌….మా ద‌గ్గ‌ర 18 వేలు ఉన్నాయ‌ని, మిగిలిన డ‌బ్బులు రెండు, మూడు రోజులు క‌ట్టేస్తామ‌ని, ఆప‌రేష‌న్ చేయ‌మ‌ని డాక్ట‌ర్‌ను బ‌తిమిలాడుతుంది మీనా. డాక్ట‌ర్ అందుకు ఒప్పుకుంటాడు.

శివ చేయి విరిగింది…

శివ చేయి ఎలా విరిగింది? త‌న‌కు ఏదైనా స‌మ‌స్య‌లు ఉన్నాయా అని మీనాను అడుగుతాడు డాక్ట‌ర్‌. అలాంటివేం లేవ‌ని, శివ బుద్దిగా చ‌దువుకుంటున్నాడ‌ని మీనా అంటుంది.అది బైక్‌పై నుంచి కింద‌ప‌డితే త‌గిలిన దెబ్బ కాద‌ని డాక్ట‌ర్ అంటాడు. ఎముక విర‌గ‌డం చూస్తుంటే ఎత్తు నుంచి కింద‌ప‌డి ఉండాలి లేదంటే ఎవ‌రైనా బ‌లంగా కొట్టి ఉండాల‌ని డాక్ట‌ర్ అంటాడు. శివ అబ‌ద్ధం చెబుతున్నాడ‌ని మీనాతో డాక్ట‌ర్ చెబుతాడు. ఎవ‌రితోనే శివ గొడ‌వ ప‌డ్డాడ‌ని, వాళ్లే శివ చేయిని బ‌లంగా విరిచేసి ఉంటార‌ని డాక్ట‌ర్ అన‌గానే మీనా షాక‌వుతుంది.

 

బైక్‌పై నుంచి ప‌డ్డా…

శివ‌కు డాక్ట‌ర్ ఆప‌రేష‌న్ చేస్తాడు. పెద్ద ప్ర‌మాదం త‌ప్ప‌ద‌ని పార్వ‌తి ఆనందంతో క‌న్నీళ్లుపెట్టుకుంటుంది. నీకు ఈ దెబ్బ ఎలా త‌గిలింద‌ని శివ‌ను అడుగుతుంది మీనా. ఫ్రెండ్ బైక్ పై నుంచి ప‌డ్డాన‌ని శివ అబ‌ద్ధం ఆడుతాడు. ఆ ఫ్రెండ్‌తో నేన మాట్లాడుతాన‌ని మీనా అంటుంది. ఇప్పుడే మీ ఫ్రెండ్‌ను ఇక్క‌డికి ర‌మ్మ‌ని చెప్ప‌మ‌ని శివ‌తో అంటుంది మీనా. అది అంటూ శివ త‌డ‌బ‌డిపోతాడు.

ఫైనాన్స్ కంపెనీలో…

శివ అబ‌ద్ధం చెబుతున్నాడ‌ని, వీడిని ఎవ‌రో కొట్టారు…డాక్ట‌ర్ అంతా నాకు చెప్పార‌ని మీనా అంటుంది. అవును గొడ‌వ‌లోనే నా చేయి విరిగింద‌ని నిజం బ‌య‌ట‌పెడ‌తాడు శివ‌. గుణ ఫైనాన్స్ కంపెనీలోనే ప‌నిచేస్తున్న‌ట్లు చెబుతాడు. గుణ చాలా మారిపోయాడ‌ని, ఫైనాన్స్ కంపెనీ పెట్టుకున్నాడ‌ని శివ అంటాడు. గుణ ద‌గ్గ‌రే బాలు బావ ఫ్రెండ్ గుణ ఫైనాన్స్ తీసుకున్నాడ‌ని, చాలా నెల‌లుగా వ‌డ్డీ క‌ట్ట‌లేద‌ని శివ చెబుతాడు.

వ‌డ్డీ డ‌బ్బులు అడిగితే..

వ‌డ్డీ డ‌బ్బులు అడిగితే రాజేష్ గొడ‌వ‌కు దిగాడ‌ని, అప్పుడే అక్క‌డికి వ‌చ్చిన బాలు…త‌న ఫ్రెండ్‌కు స‌పోర్ట్ చేస్తూ న‌న్ను కొట్టాడ‌ని అబ‌ద్ధం చెబుతాడు. కాలితో త‌న్ని కింద‌ప‌డేసి చేయిప‌ట్టుకొని విరిచేశాడ‌ని అంటాడు. న‌న్ను వ‌ద‌ల‌మ‌ని ఎంత బ‌తిమిలాడిన విన‌లేద‌ని అంటాడు.

 

మీనా షాక్‌…

శివ మాట‌లు నిజ‌మ‌ని పార్వ‌తి న‌మ్ముతుంది. ఇదంతా అల్లుడిగారి ప‌నా అని అంటుంది. తాగేసి కొట్టాడ‌ని శివ అబ‌ద్ధం ఆడుతాడు. శివ మాట‌ల‌తో మీనా షాక‌వుతుంది. బాలు అందుకే ఇక్క‌డికి రాలేద‌ని సుమిత్ర అంటుంది.

ఇదేనా మార్పు…

మ‌రొక‌రు అయితే కాల‌ర్ ప‌ట్టుకొని అడిగేదానిని..కానీ అల్లుడు కాబ‌ట్టి ఏం అడ‌గాలి అని పార్వ‌తి నింద‌లు వేస్తుంది. సొంత కొడుకులా అనుకున్నాన‌ని, కానీ శివ‌ను ప‌రాయివాడిలా కొట్టాడ‌ని, ఇంత జ‌రిగిన ఈ విష‌యం నీ ద‌గ్గ‌ర చెప్ప‌కుండా దాచాడ‌ని మీనాతో కోపంగా అంటుంది పార్వ‌తి.

బావ ముందులా లేడ‌ని, చాలా మారిపోయాడ‌ని అన్నావు…ఇదేనా మార్పు… ఆయ‌న మార‌రు నాకు న‌మ్మ‌కం లేద‌ని సుమిత్ర అంటాడు. తాగిన మ‌త్తులో అలా చేసి ఉంటాడ‌ని శివ మీనాను న‌మ్మిస్తాడు. నీ భ‌ర్త గురించి ఏదైనా త‌ప్పుగా మాట్లాడి ఉంటే క్ష‌మించ‌మ‌ని మీనాతో అంటుంది పార్వ‌తి.

తాగేసి నిద్ర‌పోయిన బాలు…

శివ మాట‌లు నిజ‌మ‌ని న‌మ్మిన మీనా ఆవేశంగా బాలు ద‌గ్గ‌ర‌కు వ‌స్తుంది. బాలు తాగేసి కారులో నిద్ర‌పోయి క‌నిపిస్తాడు. బాలును మీనా చూడ‌కుండా క‌వ‌ర్ చేస్తాడు రాజేష్‌. శివ చేయిని బాలు ఎందుకు విర‌గొట్టాడ‌ని రాజేష్‌ను అడుగుతుంది మీనా. గొడ‌వ మీదైతే బాలు ఎందుకు జోక్యం చేసుకున్నాడ‌ని అడుగుతుంది.

 

గొడ‌వ జ‌రుగుతుంద‌ని ముందే చెబితే…ఈ రోజు శివ హాస్పిట‌ల్‌లో చేరాల్సిన ప‌రిస్థితి వ‌చ్చేది కాద‌ని మీనా అంటుంది.

అంత నేరం ఏం చేశాడు…

మీనా గొడ‌వ‌కు బాలు మేల్కొంటాడు. ఏం కొంప‌లు మునిగిపోయాన‌ని అరుస్తున్నావ‌ని బాలు అంటాడు. ఏం అడ‌గాల‌ని వ‌చ్చావో సూటిగా అడ‌గ‌మ‌ని అంటాడు. మా త‌మ్ముడు చేయి ఎందుకు విర‌గొట్టార‌ని బాలును నిల‌దీస్తుంది మీనా. ఇది చెప్పినొడు ఎందుకు విర‌గొట్టానో చెప్ప‌లేదా బాలు అంటాడు. వాడు చేసిందానికి నేను కొట్టింది చాలా త‌క్కువ అని బాలు అంటాడు. అంత నేరం శివ ఏం చేశాడో చెప్ప‌మ‌ని మీనా నిల‌దీస్తుంది. అది నీకు అన‌వ‌స‌రం ఈ ప‌నికిమాలిన పంచాయితీలు ఆపేసి ఇంటికి వెళ్ల‌మ‌ని కోప్ప‌డుతాడు.

మందు వాస‌న‌…

బాలు ద‌గ్గ‌ర మందు వాస‌న రావ‌డం మీనా గ‌మ‌నిస్తుంది. పొద్దున పూట కూడా తాగ‌డం మొద‌లుపెట్టారా? ఇలాగే తాగేసి శివ‌ను కొట్టారా? చిన్న‌పిల్లాడు అన్న‌ది మ‌ర్చిపోయారా అని బాలును అడుగుతుంది మీనా. శివ త‌ప్పు చేసి ఉంటే నాతో చెప్పాలి, మా అమ్మ‌తో చెప్పాలి అని నిల‌దీస్తుంది. అంత‌లా వాడిపై కోపం ఎందుకు వ‌చ్చిందో నాకు ఇప్పుడు కార‌ణం తెలిసి తీరాల‌ని అంటుంది.

లాగిపెట్టి ఒక్క‌టి పీకాను…

బాలుతో మీనా గొడ‌వ ప‌డ‌టం చూసి రాజేష్ జ‌రిగింది చెప్ప‌బోతాడు. కానీ బాలు అత‌డిని ఆపేస్తాడు. నాకే ఒళ్లు మండి కొట్టాను. లాగిపెట్టి ఒక్క‌టి పీకాను. కింద‌ప‌డ్డాడు. చేయి విరుగుతుంద‌ని నేను అనుకోలేద‌ని బాలు అంటాడు. అంత తేలిగ్గా ఎలా చెబుతున్నారు. కాస్త కూడా జాలి క‌ల‌గ‌డం లేదా అని మీనా అంటుంది.

 

మీరు మారిపోయార‌నుకున్నా…

మీరు మారిపోయార‌ని అనుకున్నాన‌ని మీనా అంటుంది. శివ చ‌దువును నాశ‌నం చేశార‌ని, ఇన్నేళ్ల మా అమ్మ క‌ష్టం బూడిద‌లో పోశార‌ని బాలును నానా మాట‌లు అంటుంది. శివ‌ను కొట్టేట‌ప్పుడు మీకు నా మొహం గుర్తురాలేదా అని మీనా అంటుంది. మీలో ఇంత రాక్ష‌స‌త్వం దాగి ఉంద‌ని అనుకోలేద‌ని కోపంగా బాలుతో అంటుంది మీనా. ఛీ అంటూ మీకు మ‌నఃసాక్షి అన్న‌దే లేదా…మా బ‌తుకుల‌తో ఆడుకుంటే ఆడిగే దిగ్గ‌న్న‌ది లేద‌నే క‌దా…న‌న్ను కూడా కొట్ట‌మ‌ని మీనా అంటుంది. ఇంకా క‌సి తీర‌క‌పోతే చంపేయండి అని అంటుంది. మీపై నాకు ఉన్న న‌మ్మ‌క‌మే ముక్క‌లైపోయింద‌ని అంటుంది.

భ‌రోసా పోయింది…

క‌ష్ట‌మ‌స్తే మా కుటుంబానికి అండ‌గా ఉంటార‌నే భ‌రోసా పోయింద‌ని, మాకు ఏ దిక్కులేద‌ని, మా నాన్న‌తో పాటే మా ధైర్యం మొత్తం పోయింద‌ని క‌న్నీళ్ల‌తో అక్క‌డి నుంచి వెళ్లిపోతుంది. దొంగ‌త‌నం చేసిన వాడు త‌ప్పు అంత నీపై నెట్టి త‌ప్పించుకున్నాడు. ఆ నిజాన్ని దాచి నువ్వెందుకు మీనా దృష్టిలో చెడ్డ‌వాడివ‌వుతాని బాలుతో రాజేష్ అంటాడు.

బాలు బాధ‌…

గొడ‌వ‌లు ప‌డే రోజుల్లో కూడా మీనా న‌న్ను ఇంత‌గా అస‌హ్యించుకోలేద‌ని, ఇన్ని మాట‌లు అన‌లేద‌ని బాలు బాధ‌ప‌డ‌తాడు. శివ దొంగ‌త‌నం చేశాడ‌ని బ‌య‌ట‌ప‌డితే మా అమ్మ మీనాను ప్ర‌శాంతంగా బ‌త‌క‌నివ్వ‌ద‌ని, వాళ్ల కుటుంబం మ‌న‌శ్శాంతిగా ఉండ‌ద‌ని బాలు అంటాడు.

 

క్రిమిన‌ల్ కేసు…

శివ‌ను ఎందుకు కొట్టావో చెప్ప‌మ‌ని బాలును అడుగుతాడు స‌త్యం. మీనా కాబ‌ట్టే ఊరుకుంద‌ని ఇంకొక‌రు అయితే పోలీస్ కేసు పెట్టేవారు. ఇది క్రిమిన‌ల్ కేసు అని శృతి అంటుంది. నేను క్రిమిన‌ల్ అయితే మీరు ఈ ఇంట్లోనే ఉండ‌ర‌ని బాలు అంటాడు. శివ‌ను వెన‌కేసుకొని వ‌స్తాడు ర‌వి. వాడు చేసిన ప‌నికి అని బాలు కోప్ప‌డుతాడు. అక్క‌డితో నేటి గుండె నిండా గుడి గంట‌లు సీరియ‌ల్ ముగిసింది.

 

Best Web Hosting Provider In India 2024