




Best Web Hosting Provider In India 2024

ములుగు జిల్లాలో మందుపాతర పేలి ముగ్గురు గ్రౌహౌండ్స్ జవాన్ల మృతి.. వాడేజు-పేరూరు అడవుల్లో విషాదం
తెలంగాణలో మావోయిస్టుల మందుపాతరకు ముగ్గురు గ్రేహౌండ్స్ జవాన్లు బలయ్యారు. ఓ వైపు కర్రెగుట్టల్లో సీఆర్పిఎఫ్ బలగాలు పెద్దఎత్తున మావోయిస్టులపై విరుచుకు పడుతున్న వేళ, తెలంగాణలో మందు పాతర పేలి ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది.
తెలంగాణలో మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో ముగ్గురు గ్రేహౌండ్స్ పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ములుగు జిల్లా వాజేడు- పేరూరు అడవుల్లో ఈ ఘటన జరిగింది.
ఆపరేషన్ కగార్ పేరిట చత్తీస్గడ్-తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతున్న వేళ తెలంగాణ పోలీసులను టార్గెట్ చేసి మావోయిస్టులు ల్యాండ్ మైన్ పేల్చారు. ఈ ఘటనలో ముగ్గురు గ్రేహౌండ్స్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
ములుగు జిల్లాలో తెల్లవారుజామున కూంబింగ్ చేస్తున్న పోలీసులు లక్ష్యంగా ల్యాండ్ మైన్ను పేల్చారు. మందుపాతర పేల్చిన తర్వాత గాయపడిన పోలీసులు లక్ష్యంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు సిబ్బంది ప్రాణాలు కోల్పోగా మరికొందరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మందుపాతర పేలి ముగ్గురు గ్రేహౌండ్స్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పరిధిలోని వీరభద్రాపురం, తడపాల గుట్టలపై మావోయిస్టుల కోసం గాలిస్తున్న గ్రేహౌండ్స్ ప్రమాదానికి గురయ్యారు.
గత నెల 21 నుంచి కర్రెగుట్టల్లో జరుగుతున్న ఆపరేషన్లో బుధవారం పెద్ద ఎత్తున మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో తెలంగాణ గ్రేహౌండ్స్ రొటీన్ కూంబింగ్ చేపట్టాయి.
బలగాల కోసం మాటు వేసిన మావోయిస్టులు తెల్ల వారు జామున కూంబింగ్ కోసం వచ్చిన వారు లక్ష్యంగా మందుపాతరలు పేల్చారు. ఈ పేలుడుతో ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
సంబంధిత కథనం
టాపిక్