





Best Web Hosting Provider In India 2024

జీ తెలుగులో 3 రోజుల పండుగ.. వరుసగా 4 స్పెషల్స్‌తో ట్రిపుల్ బొనాంజాకు మించి.. ఒకేరోజు రెండు!
జీ తెలుగు టీవీ ఛానెల్లో వరుసగా మూడు రోజుల పండుగ జరనుంది. ఏకంగా 4 స్పెషల్స్‌తో అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ఇవ్వనుంది జీ తెలుగు. నితిన్, శ్రీలీల రొమాంటిక్ కామెడీ యాక్షన్ మూవీ రాబిన్‌హుడ్ టీవీ ప్రీమియర్‌తోపాటు మరో 3 స్పెషల్స్ ఉన్నాయి. ఇలా ట్రిపుల్ బొనాంజకు మించి జీ తెలుగు వినోదం అందించనుంది.
తెలుగు ప్రేక్షకులకు ఇరవై నాలుగు గంటలు నాన్‌స్టాప్ వినోదం అందించే జీ తెలుగు ఈ వారం మరిన్ని ప్రత్యేక కార్యక్రమాలతో అలరించేందుకు సిద్ధమైంది. థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న సూపర్ హిట్ తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా ‘రాబిన్‌హుడ్’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా అందిస్తోంది.
మాతృ దినోత్సవం సందర్భంగా
అలాగే, చిన్నపిల్లల్లోని నటనా ప్రతిభను వెలికితీస్తూ అశేష ప్రేక్షకాదరణతో కొనసాగుతున్న డ్రామా జూనియర్స్ 8 ఈ వారం మాతృ దినోత్సవం ప్రత్యేక ఎపిసోడ్‌తో అలరించేందుకు సిద్ధమైంది. ప్రారంభం నుంచి జీ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న జీ తెలుగు సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ ఈ వారం ఫినాలేకి చేరుకుంది.
సరికొత్త సీరియల్ ప్రారంభం
అంతేకాకుండా కుటుంబ కథతో పవన్ సాయి, అక్షిత, భావన ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న సరికొత్త సీరియల్ ఘరానా మొగుడు ప్రారంభం కానుంది. యాక్షన్ ఎంటర్టైనర్ రాబిన్‌హుడ్ ఈ శనివారం (మే 10) సాయంత్రం 6 గంటలకు, అదే రోజు రాత్రి 9 గంటలకు డ్రామా జూనియర్స్ 8 మాతృ దినోత్సవ ప్రత్యేక ఎపిసోడ్ ప్రసారం కానున్నాయి.
సోమవారం నుంచి
ఆ తర్వాత సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ గ్రాండ్ ఫినాలే ఆదివారం (మే 11) రాత్రి 9 గంటలకు ప్రసారం అవనుంది. ఇక జీ తెలుగులో సరికొత్త సీరియల్ ఘరానా మొగుడు మే 12న (సోమవారం) ప్రారంభం కానుంది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు జీ తెలుగులో ఘరానా మొగుడు సీరియల్ టీవీ ప్రీమియర్ కానుంది.
3 రోజులు నాలుగు స్పెషల్స్
ఇలా వరుసగా మూడు రోజులు నాలుగు స్పెషల్స్‌తో జీ తెలుగులో పండుగ జరగనుంది. ఇది ట్రిపుల్ బొనాంజాకు మించి ఎంటర్టైన్మెంట్ కానుంది. ఇక ఒకేరోజు రాబిన్‌హుడ్ సినిమా, డ్రామా జూనియర్స్ సీజన్ 8 టెలీకాస్ట్ కానున్నాయి.
రాబిన్‌హుడ్ కథ
ఇక రాబిన్‌హుడ్ సినిమా కథ ఒక అనాథ అయిన రామ్ (నితిన్) పాత్ర చుట్టూ తిరుగుతుంది. అతను ఆకలితో బాధపడుతున్న తోటి అనాథల దుస్థితిని చూసి సంపన్నుల నుంచి డబ్బు దొంగిలించి అవసరమైన వాళ్లకి పంచిపెడతాడు. విలన్ వాసుదేవ్ (దేవదత్త నాగే) తన అక్రమ మాదకద్రవ్యాల వ్యాపారాన్ని అంతర్జాతీయంగా విస్తరించాలని ప్లాన్ చేస్తాడు.
వాసుదేవ్ కుమార్తె రీనా వాసుదేవ్ (శ్రీలీల) రుద్రకొండకు వెళ్తుంది. రామ్, వాసుదేవ్ కలిసినప్పుడు ఏం జరుగుతుంది? వాళ్లిద్దరి మధ్య సంబంధం ఏంటనేది తెలుసుకోవాలంటే జీ తెలుగు వేదికగా ప్రసారం కానున్న రాబిన్‌హుడ్ సినిమా చూడాల్సిందే.
రాబిన్‌హుడ్ నటీనటులు
వెంకీ కుడుముల దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ రాబిన్‌హుడ్ సినిమాలో నితిన్, శ్రీలీల, దేవదత్త నాగే, సిజ్జు, డేవిడ్ వార్నర్ ముఖ్యపాత్రలు పోషించారు. జీవీ ప్రకాష్ కుమార్ రాబిన్‌హుడ్ సినిమాకు సంగీతం అందించారు.
సంబంధిత కథనం