




Best Web Hosting Provider In India 2024

బ్రహ్మముడి మే 9 ఎపిసోడ్: రాజ్‌కు తప్పిన ప్రమాదం- తప్పుదోవ పట్టించిన యామిని- కావ్య ప్లాన్ ఫెయిల్- ఒక్కటైన యామిని రుద్రాణి
బ్రహ్మముడి సీరియల్ మే 9 ఎపిసోడ్: రాజ్‌కు తన గతాన్ని గుర్తు చేస్తుంటారు కల్యాణ్, అప్పు. కానీ, అది విని రాజ్ స్పృహ కోల్పోతాడు. హాస్పిటల్‌కు రాజ్‌ను తీసుకెళ్తే.. స్ట్రెస్ ఎందుకుపెట్టారు. కాస్తాలో కోమాలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు బాగానే ఉందని డాక్టర్ చెబుతాడు. రాజ్‌ను యామిని తప్పుదోవ పట్టిస్తుంది.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో రాజ్ కావ్య లవ్ స్టోరీని కల్యాణ్, అప్పు చెబుతుంటారు. అది విని తనకు జరిగినట్లే గుర్తు చేసుకుంటాడు రాజ్. మరోవైపు యామిని, రుద్రాణి, రాహుల్ పవర్ పోగొట్టేందుకు మెయిన్ స్విచ్ కోసం వెతుకుతుంటారు. ఇద్దరు ఒకేసారి పవర్ ఆఫ్ చేసేందుకు చూస్తారు. ఒకరినొకరు చూసుకుని షాక్ అవుతారు. ముగ్గురికి కావాల్సింది ఒక్కటే అని అనుకుంటారు.
ఒక్కటైన యామిని రుద్రాణి
శత్రువుకు శత్రువు మిత్రువు అవుతారు అని రుద్రాణి అంటుంది. దాంతో యామిని, రుద్రాణి, రాహుల్ కలిసిపోతారు. మాటలు తర్వాత ముందు పవర్ ఆఫ్ చేయండి అని యామిని అంటుంది. చివరి వరకు మేమిద్దరం పెళ్లి చేసుకోకూడదనే అనుకున్నాం కానీ.. అని కల్యాణ్ చెబుతుంటే పవర్ ఆఫ్ అయిపోతుంది. పవర్ ఆఫ్ చేసి యామిని, రుద్రాణి సంతోషిస్తారు.
ఇప్పుడు వాళ్లు అనుకుంది ఎలా సాధిస్తారో నేను చూస్తాను అని యామిని అంటే.. మేము కూడా చూస్తాం అని రుద్రాణి, రాహుల్ అంటారు. మరోవైపు మేనేజర్ని పిలిచి బ్యాకప్ చూడండి అని చెబుతాడు రాజ్. కావ్య దగ్గరికి వెళ్లి పవర్ తెల్లారే వరకు పవర్ రాదు. ఆ పవర్ పోగొట్టింది నేనే కాబట్టి అని యామిని చెబుతుంది. రాజ్ కథను తన తమ్ముడి కథలా చెప్పి రాజ్ గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేశావ్ చూడు. నీ తెలివితేటలను మెచ్చుకోకతప్పదు. కానీ, నువ్ చేసినతప్పు ఏంటంటే నన్ను తక్కువ అంచనా వేయడం అని యామిని అంటుంది.
నేను ఉండగా నువ్ ఏధి సాధించలేవు అని యామిని అంటుంది. ఈ చీకటి చీల్చుకుంటూ ఆయనకు గతం గుర్తుకు వస్తుంది. వెలుగు దానంతట అదే వస్తుందని కావ్య అంటుంది. తెల్లారేవరకు ఇలాంటి పగటి కలలు కంటూ ఉండు. నేను ఇప్పుడే బావను తీసుకెళ్లిపోతాను అని యామిని అంటుంది. రాజ్ దగ్గరికి వెళ్దామని యామిని అంటే రాజ్ రాడు. నాకు అది తెలిసిన కథలా అనిపిస్తుంది అని రాజ్ అంటాడు.
భ్రమ మాత్రమే
అది ఒక ఇల్యూజనేషన్ మాత్రమే. నిజం కాదు అని చేయి పట్టి రాజ్‌ను యామిని తీసుకెళ్తుంటుంది. కానీ, రాజ్ ఆపి ఒక్క నిమిషం ఉండు అని కల్యాణ్, అప్పు దగ్గరికి వెళ్తాడు. పవర్ పోయిందని మన పార్టీ అర్థాంతరంగా ఆగిపోతుందని ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. కల్యాణ్ లవ్ స్టోరీ నేను పూర్తిగా వినాలనుకుంటున్నాను. అందరూ మొబైల్ ఫోన్స్‌లో ఉన్న లైట్‌ను ఆన్ చేయండి, టార్చ్ లైట్ ఉంటే అది కూడా ఆన్ చేయండి. అది చాలు మన ఆనందాన్ని దగ్గర చేసుకోడానికి అని రాజ్ అంటాడు.
దాంతో అంతా మొబైల్స్ లైట్స్ ఆన్ చేస్తారు. అలా యామిని, రుద్రాణిలకు పెద్ద ట్విస్ట్ ఇస్తాడు రాజ్. రుద్రాణి, రాహుల్, యామిని షాక్ అవుతారు. శత్రువులుగా ఉన్న మీరు భార్యాభర్తలుగా ఎలా అయ్యారు అని టోనీ వాకర్ అడుగుతారు. ఈ కథ నాకు తెలుసుకోవాలని ఉంది. చెప్పు కల్యాణ్. ఇది నా కథలా ఉంది అని రాజ్ మనసులో అనుకుంటాడు. మా ఇంటి పరువు, వాళ్ల పరువు కాపాడుకోడానికి మా ఇద్దరిని తిరిగి పెళ్లి పీటలపై కూర్చోబెట్టారు అని కల్యాణ్ చెబుతాడు.
ఇష్టం లేకుండానే తన మెడలో మూడు ముళ్లు వేశాను అని కల్యాణ్ అంటాడు. కోడలిగా అడుగుపెట్టినప్పటి నుంచే నన్ను శత్రువులా చూడటం మొదలు పెట్టాడు. అందరూ ఉన్న ఎవరు లేనట్టు స్టోర్ రూమ్‌లో ఒక్కదాన్నే పడుకునేదాన్ని అని అప్పు చెబుతాడు. ఆ తర్వాత జరిగిందంతా చెబుతారు. విగ్రహాలు ఎత్తుకెళ్లడం, రాజ్ కాపాడటం చెబుతారు. అప్పుడు రాజ్‌కు గతం గుర్తుకు వచ్చినట్లు తల పట్టుకుంటాడు.
హీరోలా ఉందిగా
ఇంత ప్లాన్ చేస్తే మొత్తం చెడగొట్టాడు కదరా ఆ రాజ్ అని రుద్రాణి అంటుంది. తన కథను తనే వింటూ మురిసిపోతున్నాడు. హీరోలా ఉంది కదా అని రాహుల్ అంటాడు. ఇంతలో రాజ్ పరిస్థితి చూసి కావ్య స్టేజీ ఎక్కుతుంది. ఏమైంది అండి, ఎందుకు తల పట్టుకున్నారు. స్ట్రెస్ తీసుకోకండి అని కావ్య అంటుంది. నువ్వు.. నువ్వు అంటూ రాజ్ స్టేజీపైన స్పృహ తప్పి కిందపడిపోతాడు.
అది చూసి యామిని షాక్ అవుతుంది. కొంపదీసి రాజ్ చస్తాడా ఏంటీ అని రుద్రాణి అంటుంది. బావ అంటూ స్టేజీ మీదకు యామిని వస్తే.. ఏయ్.. తను నా మొగుడు. నువ్ తాకితే ఒప్పుకోను. ఆయన్ను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. నువ్వు వెళ్లు అని యామినికి గట్టి వార్నింగ్ ఇస్తుంది కావ్య. దాంతో యామిని ఆగిపోతుంది. రాజ్‌ను కారులో హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. కావ్య ఏడుస్తూ ఉంటుంది. రాజ్‌ను చెక్ చేస్తాడు డాక్టర్.
నేను తప్పు చేసేశాను. చాలా పెద్ద తప్పు చేసేశా. మీ అందరి మాటలు విని ఆయన ప్రాణాలతో ఆడుకున్న. చివరికి ఇక్కడి వరకు తీసుకొచ్చా అని కావ్య ఏడుస్తుంది. నీ మీద ఎందుకు నిందలు వేసుకుంటావ్. మేము చెప్పినందుకే ఇలా చేశావ్ కదా అని కల్యాణ్, అప్పు అంటారు. మీరు చెప్పారు. నాకు ఉండాలి కదా. తొందరపడి నిర్ణయం తీసుకున్నా. ఆయనకు ఏమవుతుందో తలుచుకుంటూనే భయంగా ఉందని కావ్య అంటుంది.
అజాగ్రత్తగా ఉంటారేంటీ
ఇంతలో డాక్టర్ వచ్చి ఆయనెందుకు అంత స్ట్రెస్ తీసుకున్నారు అని అడుగుతాడు. దాంతో జరిగింది చెబుతుంది కావ్య. మీరింత అజాగ్రత్తగా ఉంటారేంటీ. తన గతాన్ని గుర్తు చేయడానికి ఎలాంటి ప్రయత్నం చేయకండి. నాచురల్‌గా గుర్తుకురావాలి అని. బీపీ చాలా పెరిగిపోయింది. కొంచెం అయితే కోమాలోకి వెళ్లిపోయారు. తన పరిస్థితి తెలిసి అజాగ్రత్తగా ఉంటే ఎలా. ఇప్పుడు నార్మల్‌గా ఉన్నారు. ఇంకోసారి ఇలా చేయకండి. అది ఆయన ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్ చెబుతాడు చెప్పి వెళ్లిపోతాడు.
దాంతో మౌనంగా వెళ్లి కూర్చుంటుంది కావ్య. అప్పు ఓదారుస్తుంది. ఇంతలో యామిని వచ్చి క్లాప్స్ కొడుతుంది. చాలా అద్భుతంగా జరిగింది కదా మీ ప్రయత్నం. చివరికి రాజ్‌ను తీసుకొచ్చి ఇలా ఐసీయూలో పడేశావ్. ఇప్పుడు నీకు అర్థమైందా నీకు ఏది చాతకాదని, ఎప్పటికైనా రాజ్ నా సొంతం. మళ్లీ లోపలికి వెళ్లగలవా. నిజం చెప్పగలవా. నిజం చెబితే ప్రాణాలతో ఉంటాడా అని యామిని అంటుంది.
నిస్సహాయస్థితిలో కావ్య
అవకాశం దొరికింది కదా అని వాగకు అని అప్పు అంటుంది. ఇప్పుడు ఏం చేయని నిస్సహాయస్థితిలో ఉన్నారు. ఇప్పుడు రామ్‌కు ఎదురుపడలేరు. రామ్ నాతో మాత్రమే ఉండాలి, బతకాలి. నేను ఒక్కదాన్నే తెలిసినదాన్ని. మీరు వెళ్తే మాట్లాడేంత లేదు కదా అంతలా దిగజారిపోయారు కదా. మీరు చేసిన ప్రయత్నం వల్ల. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయకండే అని యామిని చెప్పి వెళ్లిపోతుంది.
రాజ్ దగ్గర యామిని కూర్చొంటుంది. రాజ్ స్పృహలోకి వస్తాడు. ఇప్పుడెలా ఉందని యామిని అంటే.. బాగానే ఉందని రాజ్ అంటాడు. అది చూసి కావ్య సంతోషిస్తుంది. కళావతి గారు ఎక్కడ అని రాజ్ అడుగుతాడు. దాంతో యామిని షాక్ అవుతుంది.
నీకోసం నేను పరితపిస్తుంటే నువ్ సంబంధం లేని వ్యక్తి కోసం ఆరాటపడుతున్నావ్. తనకెందుకు వస్తుంది. అక్కడ పార్టీ కోసం పిలిచింది. ఆ అవసరం తీరిపోయింది అని రాజ్‌ను పక్కదోవ పట్టిస్తుంది యామిని. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్