




Best Web Hosting Provider In India 2024

ఒకే రోజు థియేటర్లకు వచ్చిన ఆ మూడు సూపర్ హిట్లు.. ఒకే ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
థియేటర్లలో ఒకే రోజు రిలీజైన మూడు సినిమాలు ఒకే ఓటీటీలోకి రాబోతున్నాయి. ఇందులో ఒక్కోటి తెలుగు, హిందీ, తమిళ్ మూవీ కావడం విశేషం. మరి ఈ మూడు సినిమాలు ఏంటీ? వీటిని డిజిటల్ హక్కులను ఏ ఓటీటీ దక్కించుకుందో చూసేయడి.
ఒకే రోజు మూడు పెద్ద సినిమాలతో మే నెల గ్రాండ్ గా మొదలైంది. మే డే స్పెషల్ గా ఈ నెల ఒకటో తేదీన మూడు పెద్ద సినిమాలు థియేటర్లకు వచ్చాయి. తెలుగు నుంచి హిట్ 3, తమిళ్ నుంచి రెట్రో, హిందీ నుంచి రైడ్ 2.. థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. ఈ మూడు సినిమాలకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. కలెక్షన్లు కుమ్మేశాయి ఈ మూడు సినిమాలు. ఇప్పుడీ మూడు చిత్రాలు కూడా ఒకే ఓటీటీలోకి రాబోతున్నాయి.
కలెక్షన్లలో కేక
నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ‘హిట్ 3’ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. నాని కెరీర్ లోనే రికార్డు కలెక్షన్లు వసూలు చేస్తోంది. ఇప్పటికే రూ.100 కోట్లు దాటేసింది. ఇక తమిళ్ స్టార్ సూర్య ‘రెట్రో’ కూడా మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులో వసూళ్లు అంతంతమాత్రంగానే ఉన్నా తమిళనాడు లో మాత్రం కలెక్షన్లలో అదరగొట్టింది. ఇప్పటివరకూ రూ.80 కోట్లకు పైగా రాబట్టింది. ఇక అజయ్ దేవగణ్ సూపర్ హిట్ మూవీ ‘రైడ్ 2’ కూడా బాలీవుడ్ లో దుమ్మురేపుతోంది. ఈ మూవీ కూడా రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది.
అదే ఓటీటీలోకి
నాని ‘హిట్ 3’, సూర్య ‘రెట్రో’, అజయ్ దేవగణ్ ‘రైడ్ 2’ సినిమాలు ఒకే ఓటీటీలోకి రాబోతున్నాయి. ఈ మూడు సినిమాల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ మూడు సినిమాలు నెట్‌ఫ్లిక్స్‌లోనే రాబోతున్నాయి. మూడు భాషల్లో హిట్ గా నిలిచిన ఈ మూవీస్ ను నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేసేందుకు సిద్దమవుతోంది.
ఎప్పటి నుంచి?
సాధారణంగా కొత్త సినిమాలు నాలుగు నుంచి ఎనిమిది వారాల్లోపు ఓటీటీకి వస్తున్నాయి. ఇప్పుడు హిట్ 3, రెట్రో, రైడ్ 2 కూడా ఇదే బాటలో సాగే అవకాశముంది. పైగా ఈ మూడు సినిమాల డిజిటల్ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. కాబట్టి ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ సరైన డేట్లు ఫిక్స్ చేసి ఈ మూవీస్ ను డిజిటల్ స్ట్రీమ్ చేసే ఛాన్స్ ఉంది.
నాలుగు వారాల నుంచి ఎనిమిది వారాలు అంటే మే నెల చివరి నుంచి జూన్ రెండు, మూడు వారాల్లోపు ఈ మూడు సినిమాలు ఓటీటీలోకి వచ్చే అవకాశముంది. మరి ఈ మూడు సినిమాలను ఒకే సారి ఓటీటీలోకి తీసుకొస్తారా? లేదా వారానికి ఒకటి చొప్పున డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తారా? అన్నది వేచి చూడాలి.
సంబంధిత కథనం