నిద్రలేమితో బాధపడుతున్నారా? 4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ ట్రై చేయండి, క్షణాల్లో నిద్రలోకి జారుకుంటారు!

Best Web Hosting Provider In India 2024

నిద్రలేమితో బాధపడుతున్నారా? 4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ ట్రై చేయండి, క్షణాల్లో నిద్రలోకి జారుకుంటారు!

Ramya Sri Marka HT Telugu

నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఈ 4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ ట్రై చేయండి. కొద్ది క్షణాల్లోనే మిమ్మల్ని నిద్రమత్తులోకి తీసుకెళుతుంది. ఈ సులభమైన పద్ధతిని ఎలా అనుసరించాలో ఇక్కడ తెలుసుకోండి.

నిద్ర పట్టడం కోసం బ్రీతింగ్ టెక్నిక్ ట్రై చేస్తున్న యువతి

ఆలోచించి చూస్తే, డబ్బు సంపాదించాక మనం చేసే పని బెడ్ రూం సరిచేసుకోవడం. లేదా బెడ్ రూంను లగ్జరీగా మార్చుకోవడం. ఎందుకంటే, పగలంతా ఎంత పని చేసినా, ఎలాంటి ఫెసిలిటీస్ అనుభవించినా రాత్రి నిద్ర అనేది ప్రశాంతంగా ఉండాలని తపన పడుతుంటారు. ఆహారం, నీరుతో పాటు నిద్రకు కూడా అంతే ప్రాముఖ్యతను ఇస్తారు. ప్రతి ఒక్కరూ సుఖంగా నిద్రపోవాలని, అలసట తీరి, ఉత్సాహంగా ఉండాలని కోరుకుంటారు.

అయితే, ఇటీవలి కాలంలో ఇదే నిద్ర కరువై సమస్యలకు గురవుతున్నారు చాలా మంది. నిద్రలేమితో బాధపడుతూ నరాల సమస్య, ఊబకాయం, రక్తపోటు, డయాబెటిస్ వంటి సమస్యలకు గురవుతున్నారు. మీలోనూ ఈ సమస్య ఉంటే, లేదా మీకు తెలిసిన వారెవరైనా ఇదే సమస్యతో బాధపడుతుంటే, పరిష్కారం కోసం 4-7-8 బ్రీతింగ్ టెక్నిక్‌ను ఫాలో అవ్వొచ్చు. రాత్రిళ్ళు నిద్రరాక ఇబ్బందిపడే వారికి ఈ పద్ధతి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పద్ధతి ఏంటి? దీనిని ఎలా అనుసరించాలో తెలుసుకుందాం.

4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ అంటే ఏంటి?

మెడిటేషన్‌తో పాటు కాస్త యోగాను కలిపి ఈ శ్వాస పద్ధతిని అనుసరిస్తే, త్వరగా నిద్రలోకి జారుకుంటాం. 4-7-8 బ్రీతింగ్ టెక్నిక్, మిమ్మల్ని ఆందోళన నుంచి దూరం చేసి, మత్తులోకి జారుకునేందుకు ప్రోత్సహించడం ద్వారా త్వరగా నిద్రలోకి జారుకునేందుకు సహాయపడుతుంది. ఈ పద్ధతిలో 4 సెకన్ల పాటు ముక్కు ద్వారా గాలి పీల్చుకోవడం, 7 సెకన్ల పాటు గాలిని బిగపట్టడం, 8 సెకన్ల పాటు నోటి ద్వారా గాలిని వదులుకోవడం వంటివి చేయాలి. అవి ఎప్పుడు, ఎలా చేయాలో తెలుసుకోవాలని ఉంటే, ఇక్కడ చూసేయండి.

ఈ పద్ధతిని ఎలా అనుసరించాలి

స్టేజ్ 1 – కంఫర్ట్‌గా అనిపించే పొజిషన్‌లో కూర్చోండి లేదా పడుకోండి.

స్టేజ్ 2 – మీ నాలుక కొనను మీ పై దవడకు తాకించండి.

స్టేజ్ 3 – 4 సెకన్ల పాటు ముక్కు ద్వారా నెమ్మదిగా గాలి పీల్చుకోండి.

స్టేజ్ 4 – 7 సెకన్ల పాటు గాలిని బిగపట్టండి.

స్టేజ్ 5 – 8 సెకన్ల పాటు నోటి ద్వారా నెమ్మదిగా గాలిని వదులుకోండి.

స్టేజ్ 6 – ఈ చక్రాన్ని కనీసం నాలుగు సార్లు రిపీట్ చేయండి.

బ్రీతింగ్ టెక్నిక్ ఫాలో అవడం కలిగే ప్రయోజనాలు

ఈ బ్రీతింగ్ టెక్నిక్‌ను అనుసరించడం వలన నాడీ వ్యవస్థ శాంతించి, ఆందోళన తగ్గుతుంది. దీనివలన నిద్రలేమి సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ పద్ధతిని అనుసరించడం వలన త్వరగా సడలింపు, మంచి నిద్ర లభిస్తుంది. అంతేకాకుండా, ఇది మొత్తం నిద్ర నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది.

గుర్తుంచుకోవలసిన విషయాలు:

  • వ్యాయామం పూర్తి అయ్యేంత వరకూ నాలుక కొన మీ పై దవడ వెనుక భాగంలో ఆనించి ఉండాలి.
  • ఊపిరి వదిలేటప్పుడు “హుష్” అనే శబ్దం చేస్తూ ఉండాలి. ఇది మీ ఊపిరిని పూర్తిగా బయటకు వదలడానికి సహాయపడుతుంది.
  • మీకు సౌకర్యంగా ఉండే భంగిమలో కూర్చోండి లేదా పడుకోండి. మీ శరీరం రిలాక్స్‌గా ఉండాలి.
  • ఈ టెక్నిక్ ఫాలో వర్కౌట్ అవడానికి కొన్నిసార్లు ఎక్కువ సమయం పట్టొచ్చు. దీన్ని రెగ్యూలర్‌గా ప్రాక్టీస్ చేయడం చాలా ముఖ్యం.

వైద్య సలహా ఎప్పుడు తీసుకోవాలి:

నిద్రలేమి ఒక దీర్ఘకాలిక సమస్యగా ఉంటే, వైద్య నిపుణుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. నిద్రలేమికి అంతర్లీన ఆరోగ్య సమస్యలు కూడా కారణం కావొచ్చు.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024