



Best Web Hosting Provider In India 2024

చెమటలు కారుతున్నాయని బరువు తగ్గిపోతామనుకోవద్దు! వేసవిలో మీరు చేసే ఈ తప్పుల కారణంగా బరువు పెరగడం ఖాయం
వేసవి వచ్చిందంటే చెమటలు పట్టడం సహజం. చాలామంది ఈ చెమటలను చూసి బరువు తగ్గిపోతున్నామని అనుకుంటారు. కానీ, చెమటలు పడుతున్నా కూడా.. మీరు వేసవిలో చేసే కొన్ని సాధారణ తప్పుల కారణంగా బరువు త్వరగా పెరిగిపోతారు. అవేంటో తెలుసుకుని జాగ్రత్తపడండి!
వేసవిలో వాతావరణానికి తట్టుకోవడం కాస్త కష్టమే. బయటకు వెళ్లామంటే చాలు. ఒంటినిండా చెమటలు పట్టడం మామూలే. అద్దంలో చూసుకుంటే మొహం కాస్త వాడిపోయినట్లు ఉండి బరువు తగ్గినట్టు అనిపించొచ్చు కూడా. కానీ, కేవలం చెమట పట్టడం వల్ల బరువు తగ్గిపోతామా..? ముమ్మాటికీ కాదు. ఇంకా వేసవిలో మనం చేసే కొన్ని చిన్నచిన్న పొరపాట్ల వల్ల బరువు పెరుగుతాం కూడా. వేడిని తట్టుకోవడానికి చేసే కొన్ని పనులు తెలియకుండానే మన బరువును పెంచుతాయట. ఆశ్చర్యంగా ఉందా? అయితే, ఆ తప్పులేంటో తెలుసుకుని, ఈ వేసవిలో బరువు పెరగకుండా జాగ్రత్తపడండి.
జ్యూస్‌లు, పానీయాలు
వేసవిలో విపరీతమైన వేడి కారణంగా మనలో చాలా మంది చల్లని జ్యూస్‌లు, పానీయాలను సర్వసాధారణంగానే తీసుకుంటుంటాం. ఇవి కేవలం దాహం తీర్చి చల్లదనాన్ని అందిస్తాయనుకోకండి.. మీ శరీర బరువును వేగంగా పెంచగలిగే శక్తి వీటికుంటుంది. వీటిని తాగడం వల్ల మీరు తీసుకునే చక్కెర పరిమాణం పెరుగుతుంది. ఆరోగ్యకరమైన పానీయాలు తయారు చేసుకున్నా వాటిలో తేనె, బెల్లం లేదా కృత్రిమ తీపి పదార్థాలు కలిపితే అవి గ్లూకోజ్ స్థాయిలను పెంచుతాయి. దీని వల్ల బరువు పెరగడం ఖాయం.
1. సోడా పానీయాలు
చాలా మంది చల్లని పానీయాలను ఇష్టపడతారు మెరుగైన రుచి కోసం వాటిలో సోడా కలుపుకుంటారు. కానీ ఈ సోడా కేలరీలు, చక్కెరతో నిండి ఉంటుంది. డైట్ సోడా తీసుకున్నా కూడా బరువు పెరిగే ప్రమాదం లేకపోలేదు. ప్రతిరోజూ ఇలాంటి పానీయాలు తాగితే వేసవి పూర్తయ్యే లోపు మీ బరువు పెరుగుదల చూసి మీరే షాకవుతారు.
2. ఏసి గదిలో ఉండటం
వేడి, చెమట నుంచి తప్పించుకోవడానికి శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి వేసవిలో ఎక్కువ మంది రోజంతా ఎసిలోనే ఉంటారు. ఇలా చేయడం వల్ల కూడా శరీర బరువు పెరుగుుతుందట. అవును ఎయిర్ కండిషన్ వల్ల బరువు పెరుగుతుందని అనేక పరిశోధనల్లో తేలింది. కాబట్టి మీరు రోజంతా ఎసిలో కూర్చుని తినడం వంటివి చేస్తుంటే వెంటనే ఆ అలవాటు మార్చుకోండి. ఇది మీ జీవక్రియ వ్యవస్థను బలహీనపరుస్తుంది, బరువును పెంచుతుంది.
3. రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం
వేసవిలో పగటి సమయం ఎక్కువ. చాలా మంది సూర్యాస్తమయం తర్వాత బయటకు వెళ్లి నడుస్తారు లేదా తిరుగుతారు. దీని వల్ల రాత్రి 9-10 గంటల ప్రాంతంలో లేదా ఆ తర్వాత భోజనం చేస్తారు. ఆలస్యంగా చేసే ఆరోగ్యకరమైన భోజనం కూడా బరువు పెరగడానికి కారణమవుతుంది. ఎందుకంటే దానిని సరిగ్గా జీర్ణం చేసుకోవడానికి శరీరానికి కావలసిన సమయం ఉండదు.
4. ఉప్పు, చక్కెర వినియోగం పెరగడం
శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి చాలా మంది వేసవిలో తరచుగా గ్లూకోజ్, ఓఆర్ఎస్ వంటి ద్రావణాలను తాగుతారు. దీని వల్ల శరీరంలో సోడియం, గ్లూకోజ్ రెండూ ఎక్కువ అవుతాయి. ఇవి శరీర బరువు పెరుగదలకు కారణమవుతాయి.
5. వ్యాయామం తగ్గించడం
వేసవిలో చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే.. చెమట పడితే బరువు తగ్గుతుంది అనుకోవడం. ఇలా అనుకునే కంటే వేసవిలో కొద్దిగా శారీరక శ్రమ చేసినా చెమట పడుతుంది. దీంతో వ్యాయామం తగ్గిస్తారు. దీని వల్ల బరువు పెరుగుతుంది.