Best Web Hosting Provider In India 2024

స్ట్రీమింగ్కు వచ్చిన ఒక్క రోజులోనే ట్రెండింగ్‌లో దూసుకొచ్చిన తెలుగు సినిమా.. ఓటీటీలో ఫస్ట్ ప్లేస్‌లో..
రాబిన్‌హుడ్ సినిమాకు ఓటీటీలో మంచి ప్రారంభం దక్కింది. స్ట్రీమింగ్కు వచ్చిన ఒక్క రోజులోనే ఈ మూవీ ట్రెండింగ్‌లో ఫస్ట్ ప్లేస్‌కు దూసుకొచ్చింది. ఈ మూవీని ఎక్కడ చూడొచ్చంటే..
రాబిన్‌హుడ్ సినిమా థియేట్రికల్ రన్లో ప్లాఫ్ అయినా.. ఓటీటీలో సూపర్ ఆరంభం అందుకుంది. నితిన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన ఈ హీస్ట్ యాక్షన్ కామెడీ మూవీ మార్చి 28న థియేటర్లలో విడుదలైంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకొని కమర్షియల్ డిజాస్టర్‌గా నిలిచింది. అయితే, రాబిన్‌హుడ్ ఓటీటీలో మాత్రం అదరగొడుతోంది.
ఒక్క రోజులోనే టాప్ ప్లేస్‌కు..
రాబిన్‌హుడ్ సినిమా శనివారం మే 10వ తేదీన జీ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు వచ్చింది. ప్రస్తుతానికి తెలుగులో ఒక్కటే ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ స్ట్రీమింగ్కు వచ్చిన ఒక్క రోజులోనే జీ5 ఓటీటీలో ఇండియా ట్రెండింగ్‌లో టాప్ ప్లేస్‌కు ఎగబాకింది. ప్రస్తుతం ఫస్ట్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది.
థియేట్రికల్ రన్లో రాబిన్‌హుడ్ నిరాశపరచటంతో ఓటీటీలో ఎలా పర్ఫార్మ్ చేస్తుందోననే ఆసక్తి ఏర్పడింది. అయితే, ఈ మూవీకి స్ట్రీమింగ్‌లో మంచి ఆరంభమే దక్కింది. ఒక్క రోజులోనే ట్రెండింగ్‌లో టాప్ ప్లేస్‌కు వచ్చింది. మరిన్ని రోజు జోరు చూపే అవకాశం ఉంది. కాగా, ఈ సినిమా ఓటీటీకి వచ్చిన మే 10 సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు టీవీలోనూ ప్రసారమైంది.
దోచుకొని పంచేసే..
రాబిన్‌హుడ్ సినిమాలో రామ్ అనే దొంగ క్యారెక్టర్ చేశారు నితిన్. ధనవంతుల వద్ద డబ్బు దోచుకొని అనాథలకు సాయం చేసే పాత్ర పోషించారు. ఈ చిత్రంలో నితిన్‌కు జోడీగా శ్రీలీల హీరోయిన్గా నటించారు. దేవ్‌దత్ నాగే విలన్‌గా చేశారు. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, రాజేంద్ర ప్రసాద్, షైన్ టామ్ చాకో, బ్రహ్మాజీ, ఆడుకాలం నరేన్ కీలకపాత్రలు పోషించారు. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ చిత్రంలో క్యామియో రోల్ చేశారు. అదిదా సర్ప్రైజ్ స్పెషల్ పాటలో కేతిక శర్మ స్టెప్లు వేశారు.
రిపీట్ కాని భీష్మ మ్యాజిక్
నితిన్ – డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్లో 2020లో వచ్చిన భీష్మ సూపర్ హిట్ అయింది. వీరి కాంబో రిపీట్ అవటంతో రాబిన్హుడ్పై చాలా అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. భీష్మ మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయారనే కామెంట్లు వచ్చాయి. రాబిన్‌హుడ్ మూవీ దాదాపు రూ.50కోట్ల బడ్జెట్‌తో రూపొందగా.. రూ.15కోట్ల కలెక్షన్ల మార్క్ కూడా చేరలేకపోయింది. రాబిన్‌హుడ్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా.. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ ఇచ్చారు.
రాబిన్‌హుడ్ స్టోరీలైన్
రామ్ అలియాజ్ రాబిన్‌హుడ్ (నితిన్).. ధనవంతుల వద్ద దోచుకుంటూ ఉంటాడు. ఆ డబ్బును అనాథలకు, అవసరాలు ఉన్న వారికి పంచేస్తుంటాడు. అయితే, ఓ పోలీస్ ఆఫీసర్ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తుండటంతో రామ్ బ్రేక్ తీసుకుంటాడు. సెక్యూరిటీ ఏజెంట్ అవుతాడు. నీరా (శ్రీలీల)ను జాగ్రత్తగా చూసుకునే పని నితిన్‌కు వస్తుంది. రుద్రకొండ గ్రామానికి నీరా వెళ్లాల్సి వస్తుంది. అయితే, నీరా చంపేందుకు, కిడ్నాప్ చేసేందుకు ఓ ప్రమాదకమైన గ్యాంగ్ ప్లాన్ చేస్తుంది. నీరాను చంపేందుకు ఎవరు.. ఎందుకు ప్లాన్ చేశారు? రీనాను రామ్ ఎలా కాపాడాడు? ఎవరి మిషన్ ఏంటి? అనేది రాబిన్‌హుడ్ సినిమాలో ఉంటాయి.