





Best Web Hosting Provider In India 2024

ఇక్కడిచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లో ఒక పెద్ద మిస్టేక్ ఉంది అది మీరు కేవలం 10 సెకన్లలోనే కనిపెట్టాలి
మీకు మీరు తెలివైన వారిగా భావించుకుంటే సరిపోదు. అది నిరూపణ చేయాలంటే ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఛాలెంజ్‌ను పూర్తి చేయండి. ఈ చిత్రం ఇక్కడిచ్చిన చిత్రం చాలా సింపుల్ గా కనిపిస్తోంది. కానీ అందులో ఒక పెద్ద మిస్టేక్ దాగి ఉంది. దాన్ని కనిపెట్టి చెప్పండి.
తెలివికి పరీక్ష పెట్టే చిత్రాలే ఆప్టికల్ ఇల్యుషన్లు. ఇవి కంటి ముందే కనిపిస్తూ గందరగోళానికి గురిచేస్తాయి. మీ మనస్సును, కళ్ళను పదునుగా ఉన్నాయో లేవో పరీక్షించుకోవాలంటే ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలను సాధించేందుకు ప్రయత్నించండి.
కొంతమంది తమను తాము చాలా తెలివైన వారిగా చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి వారికే ఇలాంటి ఆర్టికల్ ఇల్యూష్లు అసలైన ఛాలెంజ్ విసురుతాయి. ఇక్కడ మేము ఇచ్చిన చిత్రంలో ఒక పెద్ద తప్పు జరిగింది. అదేంటో మీరు కనిపెట్టి కేవలం పది నిమిషాల్లో చెప్పాలి. అలా చెబితే మీరు చాలా తెలివైన వారే అని అర్థం. ముందుగా మీరు ఆ చిత్రాన్ని నిశితంగా పరిశీలించండి. ఆ తప్పు ఇట్టే దొరికిపోతుంది.
ఇక్కడ ఇచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లో ఒక అమ్మాయి తన పెంపుడు కుక్కతో బయటికి వెళుతుంది. వాన కూడా పడుతోంది. చెట్లు, ఇల్లు అన్ని ఉన్నాయి. అయితే ఆ చిత్రంలో ప్రకృతి విరుద్ధంగా వింతగా కూడా ఒక తప్పు జరిగింది. అదేంటో కనుక్కొని చెబితే మీరు ఎంతో తెలివైన వారిని అర్థం. మీకు ఎక్కువ సమయం ఇస్తే ఎవరైనా చెప్పేస్తారు. కాబట్టి మీకు మేమిచ్చే సమయం కేవలం 10 సెకండ్లు. ఈ 10 సెకండ్లలోనే మీరు ఆప్టికల్ ఇల్యూషన్లోని తప్పును కనిపెట్టాలి.
జవాబు ఇదిగో
ఆప్టికల్ ఇల్యూషన్లో దాగి ఉన్న తప్పును 10 సెకనులోనే కనిపెట్టిన వారు నిజంగా తెలివైనవారు. అలాంటివారు ఏ సమస్యనైనా కూడా సులభంగా పరిష్కరించేందుకు ప్రయత్నించవచ్చు. ఇక తప్పు కనిపెట్టలేని వారి కోసం మేమే ఇక్కడ జవాబును ఇస్తున్నాము. తన పెంపుడు కుక్కతో ఒక పాప నడుచుకుంటూ వెళ్తోంది. ఆమె వెనక ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు పైన చూడండి. ఒక కొమ్మపై ఒక పక్షి కూర్చునే ఉంది. దాని వెనుక ఒక కొమ్మపై తాబేలు కూర్చొని ఉంది. తాబేలు ఎప్పుడూ కూడా చెట్టు ఎక్కలేదు. అవి ఎప్పుడు నేలపైనా లేదా నీటిలోనే ఉంటాయి. తాబేలు చెట్టు ఎక్కడం అనేది ప్రకృతి విరుద్ధం. అదే ఈ ఆప్టికల్ విషయంలో జరిగిన అతిపెద్ద తప్పు.
ఆప్టికల్ ఇల్యూషన్లు సింపుల్ గా కనిపించవచ్చు. కానీ అవి మీ మెదడుకు, కళ్ళకు చేసే మేలు ఎంతో. మీ మెదడు, మనసు, కళ్ళు సమన్వయంతో పనిచేయాలంటే ఇలాంటి ఆర్టికల్ ఇల్యూషన్లను అప్పుడప్పుడు సాధించేందుకు ప్రయత్నించండి. మీ ఏకాగ్రత లోపాలను, దృష్టి లోపాలను కూడా ఇది సవరిస్తుంది. ఏదైనా విషయంపై ఏకాగ్రతను నిలపగలిగితే మీరు సగం విజయం సాధించినట్టే. కానీ ఏకాగ్రత లోపం వల్లే విద్యార్థులు ఎంతోమంది నష్టపోతున్నారు. ఆ లోపం లేకుండా చేసుకోవాలంటే మీరు ఈ ఆప్టికల్ ఇల్యూషన్లను సాధిస్తూ ఉండాలి. ఇలాంటి ఆప్టికల్ ఇల్యుషన్లు ఇంటర్నెట్లో ఎన్నో ఉన్నాయి. రోజూ ఒకటి సాధించటం అలవాటు చేసుకుంటే కొన్ని రోజులకే మీరు పదునుగా ఆలోచించడం మొదలు పెడతారు.
టాపిక్