





Best Web Hosting Provider In India 2024

శవమే ఈ సినిమాలో హీరో – ఓటీటీలో తెలుగులోకి వస్తున్న కోలీవుడ్ కామెడీ థ్రిల్లర్ మూవీ – ట్విస్ట్‌లు మామూలుగా ఉండవు!
ప్రభుదేవా, మడోన్నా సెబాస్టియన్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ మూవీ జాలీ ఓ జింఖానా సేమ్ టైటిల్‌తో తెలుగులోకి వస్తుంది. కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ మే 15 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. తమిళంలో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ తెలుగులో మాత్రం డైరెక్ట్‌గా ఓటీటీలోకి వస్తోంది.
ప్రభుదేవా హీరోగా నటించిన తమిళ కామెడీ థ్రిల్లర్ మూవీ జాలీ ఓ జింఖానా తెలుగులోకి వస్తోంది. ఈ కామెడీ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ డేట్‌తో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్ కన్ఫామ్ అయ్యాయి. ఆహా ఓటీటీలో మే 15 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. జాలీ ఓ జింఖానా ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఆహా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నది. తమిళంలో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ తెలుగులో మాత్రం డైరెక్ట్‌గా ఓటీటీలోకి వస్తోంది.
మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్…
జాలీ ఓ జింఖానా మూవీకి శక్తి చిదంబరం దర్శకత్వం వహించాడు. ఈ కామెడీ థ్రిల్లర్ మూవీలో ప్రేమమ్ ఫేమ్ మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్‌గా నటించింది. అభిరామి, యోగిబాబు కీలక పాత్రల్లో కనిపించారు. విజయ్ బీస్ట్ మూవీలోని జాలీ ఓ జింఖానా అనే పాట నుంచి స్ఫూర్తి పొందుతూ ఈ మూవీకి టైటిల్‌ను ఫిక్స్ చేశారు. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నా కామెడీ అనుకున్న స్థాయిలో వర్కవుట్ కాకపోవడంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.
హీరో చనిపోతే…
అనుకోని పరిస్థితుల్లో హీరో చనిపోతాడు…అతడిని బతికున్నట్లుగా నమ్మించడానికి ఓ ఫ్యామిలీ ఏం చేసింది అనే పాయింట్‌తో దర్శకుడు శక్తి చిదంబరం ఈ మూవీని తెరకెక్కించాడు. ఈ సినిమాకు అశ్విన్ వినాయగమూర్తి మ్యూజిక్ అందించాడు.
తల్లీకూతుళ్ల కష్టాలు…
తంగసామి తన కూతురు చెల్లమ్మ, (అభిరామి) మనవరాళ్లు భవానీ, యజానీ, శివానీ(మడోన్నా సెబాస్టియన్) తో కలిసి హోటల్ నడుపుతుంటాడు. అనుకోకుండా లోకల్ ఎమ్మెల్యేతో చెల్లమ్మ గొడవపడుతుంది. తంగసామిని ఆ ఎమ్మెల్యే మనుషులు కొట్టడంతో హాస్పిటల్ పాలవుతాడు. తంగసామికి ఆపరేషన్ చేయాలని, అందుకు ఇరవై ఐదు లక్షలు కావాలని డాక్టర్లు అంటారు. సడెన్‌గా వారి బ్యాంకు అకౌంట్‌లో ఆపరేషన్‌కు అవసరమైన డబ్బు డిపాజిట్ అవుతుంది. ఆ డబ్బుతో తంగసామిని బతికించుకుంటారు చెల్లమ్మ, ఆమె కూతుళ్లు.
ఆ డబ్బు కోసం కొందరు లోకల్ రౌడీలు చెల్లెమ్మతో పాటు ఆమె కూతుళ్ల వెంటపడుతుంటాడు. ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి లాయర్ పూన్‌గండ్రన్ సాయం తీసుకోవాలని అనుకుంటారు తల్లీకూతుళ్లు. అతడిని కలవడానికి వెళ్లేసరికి పూన్‌గండ్రన్ శవమై కనిపిస్తాడు. అతడి శవాన్ని అడ్డుపెట్టుకొని తమకు ఎదురైన సమస్యల నుంచి చెల్లెమ్మ, ఆమె కూతుళ్లు ఎలా గట్టెక్కారు. చనిపోయిన పూన్‌గండ్రన్‌ను బతికిన్నట్లుగా నమ్మించడానికి వాళ్లు ఏం చేశారు? అన్నదే ఈ మూవీ కథ.
తెలుగులో సినిమాలు…వెబ్‌సిరీస్…
మలయాళం మూవీ ప్రేమమ్‌లో ముగ్గురు కథానాయికల్లో ఒకరిగా కనిపించింది మడోన్నా సెబాస్టియన్. ప్రేమమ్ తెలుగు వెర్షన్‌లో సేమ్ రోల్‌లో కనిపించింది. ఈ రీమేక్‌తోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మడోన్నా సెబాస్టియన్ ఆ తర్వాత నాని శ్యామ్‌సింగరాయ్‌లోనూ నటించింది.
తెలుగులో యాంగర్ టేల్స్ వెబ్‌సిరీస్‌లోనూ ప్రధాన పాత్రలో కనిపించింది. మలయాళంలో ప్రేమమ్ తర్వాత బ్రదర్స్ డే, పద్మిని, వైరస్, తమిళంలో దళపతి విజయ్ లియో, కావన్, పా పాండి తో పాటు మరికొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా కనిపించింది.
సంబంధిత కథనం