ఓటీటీల్లో ఈవారం రానున్న టాప్-5 సినిమాలు.. ఓ తెలుగు మూవీ డైరెక్ట్ స్ట్రీమింగ్.. మలయాళ బ్లాక్‍బస్టర్ కూడా..

Best Web Hosting Provider In India 2024

ఓటీటీల్లో ఈవారం రానున్న టాప్-5 సినిమాలు.. ఓ తెలుగు మూవీ డైరెక్ట్ స్ట్రీమింగ్.. మలయాళ బ్లాక్‍బస్టర్ కూడా..

ఓటీటీల్లోకి ఈవారం కొన్ని ఇంట్రెస్టింగ్ చిత్రాలు రానున్నాయి. ఓ సినిమా నేరుగా స్ట్రీమింగ్‍కే ఎంట్రీ ఇస్తోంది. మంచి క్రేజ్ ఉన్న ఓ మలయాళ చిత్రం కూడా అందుబాటులోకి రానుంది.

 
ఓటీటీల్లో ఈవారం రానున్న టాప్-5 సినిమాలు.. ఓ తెలుగు మూవీ డైరెక్ట్ స్ట్రీమింగ్.. మలయాళ బ్లాక్‍బస్టర్ కూడా..
 

గతవారం ఓదెల 2, రాబిన్‍హుడ్, జాక్, గుడ్‍ బ్యాడ్ అగ్లీ ఇలా పాపులర్ చిత్రాలు ఓటీటీల్లోకి వచ్చాయి. ప్రస్తుతం మే మూడో వారం (మే 12-18)లోనూ కొన్ని సినిమాలు స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాయి. వాటిలో కొన్ని ఆసక్తికరంగా ఉన్నాయి. సుమంత్ నటించిన ఈ చిత్రం డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు రానుంది. బాసిల్ జోసెఫ్ నటించిన బ్లాక్‍బస్టర్ తెలుగులోనూ అడుగుపెట్టనుంది. ఈ వారం ఓటీటీల్లో టాప్-5 చిత్రాలు ఇవే.

 

అనగనగా

అక్కినేని సుమంత్ ప్రధాన పాత్ర పోషించిన అనగనగా చిత్రం మే 15వ తేదీన ఈటీవీ విన్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. థియేటర్లలో కాకుండా డైరెక్ట్ ఓటీటీలోకే ఈ చిత్రం వస్తోంది. ఈ మూవీలో ఉపాధ్యాయుడిగా సుమంత్ నటించారు. ఆయనకు జోడీగా కాజల్ చౌదరి చేశారు. మాస్టర్ విహర్ష్, అవసరాల శ్రీనివాస్ కీలకపాత్రలు పోషించారు. ఇంటర్నేషనల్ స్కూళ్లలో విద్యా వ్యవస్థపై సెటైరికల్‍గా ఈ చిత్రం ఉండనుంది. ఈ మూవీకి సన్నీ సంజయ్ దర్శకత్వం వహించారు. అనగనగా మూవీని మే 15 నుంచి ఈటీవీ విన్‍లో చూడొచ్చు.

మరణమాస్

మలయాళ డార్క్ కామెడీ మూవీ మరణమాస్ చిత్రం మే 15వ తేదీన సోనీలివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. బాసిల్ జోసెఫ్ హీరోగా నటించిన ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీలోనూ అడుగుపెడుతుంది. అయితే, మే 14న సాయంత్రమే సోనీలివ్‍లో ఈ మూవీ స్ట్రీమింగ్ షురూ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మరణమాస్ చిత్రానికి శివప్రసాద్ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో బాసిల్‍తో పాటు రాజేశ్ మాధవన్, సిజు సన్నీ, బాబు ఆంటోనీ కీరోల్స్ చేశారు. ఈ మూవీకి జేకే సంగీతం అందించారు. ఈ వారం సోనీలివ్‍లో మరణమాస్ చిత్రాన్ని మిస్ అవొద్దు.

 

ఉల్ఫ్ మ్యాన్

హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ చిత్రం ఉల్ఫ్ మ్యాన్ మే 17వ తేదీన జియో హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఈ చిత్రంలో క్రిస్టఫర్ అబాట్, జులియా గార్నర్, మటిల్డా ఫిర్త్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ ఈ ఏడాది జనవరి 17న థియేటర్లలో రిలీజైంది. ఇప్పటికే కొన్ని ఓటీటీల్లో రెంటల్ పద్ధతిలో వచ్చింది. అయితే, మే 17న హాట్‍స్టార్ ఓటీటీలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇవ్వనుంది.

సెసిప్పయ

తమిళ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం నెసిప్పయ మే 16వ తేదీన సన్‍నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్‍‍కు రానుంది. డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ ఈ చిత్రంలో హీరోయిన్‍గా నటించారు. ఆకాశ్ మురళీ హీరోగా పాత్ర పోషించారు. ఈ సినిమా ఈ ఏడాది జనవరి 14న థియేటర్లలో విడుదలైంది. సుమారు నాలుగు నెలలకు సన్ నెక్స్ట్ ఓటీటీలోకి నెసిప్పయ వస్తోంది.

అర్జున్ సన్నాఫ్ వైజయంతి

అర్జున్ నన్నాఫ్ వైజయంతి సినిమా ఈవారంలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍కు వస్తుందనే రూమర్లు ఉన్నాయి. అయితే, డేట్‍పై ఇంకా ప్రకటన రాలేదు. నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ సినిమా థియేటర్లలో ఏప్రిల్ 18న విడుదలైంది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి ముఖ్యమైన పాత్ర పోషించారు.

 
 

Best Web Hosting Provider In India 2024