పుష్ప మేకర్స్ కొత్త సినిమాకు చిక్కులు.. ఆ టైటిల్ నాదే అంటున్న యంగ్ హీరో

Best Web Hosting Provider In India 2024

పుష్ప మేకర్స్ కొత్త సినిమాకు చిక్కులు.. ఆ టైటిల్ నాదే అంటున్న యంగ్ హీరో

 

ప్రదీప్ రంగనాథ్ హీరోగా డ్యూడ్ సినిమా అనౌన్స్ అయింది. ఈ చిత్రం ఇప్పుడు ఇబ్బందుల్లో పడింది. టైటిల్‍పై చిక్కులు వచ్చాయి. అది తన టైటిల్ అని ఓ యంగ్ హీరో వెల్లడించారు.

 
పుష్ప మేకర్స్ కొత్త సినిమాకు చిక్కులు.. ఆ టైటిల్ నాదే అంటున్న యంగ్ హీరో
 

డ్రాగన్ చిత్రంతో తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ ఈ ఏడాది భారీ బ్లాక్‍బస్టర్ కొట్టారు. డైరెక్టర్ నుంచి హీరోగా మారిన ఇతడికి తెలుగులోనూ మంచి క్రేజ్ వచ్చింది. ఈ క్రమంలో ప్రదీప్‍తో ఓ మూవీని అనౌన్స్ చేసింది తెలుగు ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్. పుష్ప 2తో గతేడాది భారీ సక్సెస్ కొట్టింది ఆ బ్యానర్. గుడ్ బ్యాడ్ అగ్లీతో తమిళంలోనూ ఎంట్రీ ఇచ్చింది. ప్రదీప్ రంగనాథన్‍తో మూవీతో తమిళంలో రెండో ప్రాజెక్ట్ చేస్తుంది మైత్రీ మూవీ మేకర్స్. ఈ సినిమాకు ‘డ్యూడ్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తాజాగా మూవీ టీమ్ ప్రకటించింది. దీంతో చిక్కులు ఏర్పడ్డాయి.

 

ఆ టైటిల్ నాదే.. ఏడాది క్రితమే రిజిస్టర్ చేశాం

డ్యూడ్ సినిమా టైటిల్ తమదేనని, దీన్ని సంవత్సరం కిందటే రిజిస్టర్ చేశామని యంగ్ హీరో, దర్శకుడు తేజ్ చెప్పారు. ప్రదీప్ – మైత్రీ కాంబినేషన్ చిత్రానికి ఆ టైటిల్ చూసి ఆవేదన కలిగిందని అన్నారు. తాము సంవత్సరంగా డ్యూడ్ సినిమాకు ప్రమోషన్లను చేస్తున్నామని తెలిపారు.

ఆ ఉద్దేశం లేదు

డ్యూడ్ టైటిల్ తాము రిజిస్టర్ చేసుకున్నామని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకు ఇప్పటికే చెప్పామని తేజ్ తెలిపారు. సానుకూలంగా స్పందన వస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. మైత్రీ లాంటి పెద్ద ప్రొడక్షన్ హౌస్‍లో ఘర్షణ పెట్టుకోవాలనే ఉద్దేశం తనకు లేదని తేజ్ అన్నారు. మరి ఈ అంశం ఎలా సెటిల్ అవుతుందో చూడాలి.

హీరోగా నటిస్తున్న తేజ్.. డ్యూడ్ మూవీకి డైరెక్షన్, స్క్రీన్ ప్లే కూడా చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని పోస్టర్స్ కూడా వచ్చాయి. తెలుగు, కన్నడ, మలయాళంలో ఈ మూవీని తీసుకొచ్చేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేసింది. త్వరలోనే చివరి షెడ్యూల్ మొదలవుతుందని, సెప్టెంబర్ నెలలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో రంగనాయన రఘు, రాఘవేంద్ర రాజ్ కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. పుల్‍బాల్ బ్యాక్‍డ్రాప్‍లో ఈ చిత్రం ఉండనుంది.

 

ప్రదీప్ ‘డ్యూడ్’ గురించి..

ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’ సినిమాకు కీర్తి స్వరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో ప్రదీప్‍కు జోడీగా ప్రేమలు బ్యూటీ మమితా బైజు నటిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ ఏడాది అక్టోబర్‌లో ఈ రొమాంటిక్ కామెడీ మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. తమిళంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే, ఇంతలోనే టైటిల్‍పై చిక్కులు వచ్చాయి. మరి ఏం జరుగుతుందో వేచిచూడాలి.

 
 

Best Web Hosting Provider In India 2024