పాకిస్థాన్ బిచ్చగాళ్లను పంపించిన సౌదీ అరేబియా.. పాక్‌కు ఘోరమైన బిరుదు!

Best Web Hosting Provider In India 2024


పాకిస్థాన్ బిచ్చగాళ్లను పంపించిన సౌదీ అరేబియా.. పాక్‌కు ఘోరమైన బిరుదు!

Anand Sai HT Telugu

పాకిస్థాన్ నుంచి వెళ్లిన బిచ్చగాళ్లతో ఇతర దేశాల్లో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ విషయంపై గతంలోనూ చర్చ జరిగింది. తాజాగా సౌదీ అరేబియా పాక్‌కు చెందిన యాచకులను తిప్పి పంపింది.

ప్రతీకాత్మక చిత్రం

త ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు సౌదీ అరేబియా నుంచి 5,033 మంది పాకిస్థానీ యాచకులను బహిష్కరించారు. ఈ విషయాన్ని హోంమంత్రి మోసిన్ నఖ్వీ పాక్ పార్లమెంటులో వెల్లడించారు. సౌదీ అరేబియాతో పాటు మలేషియా, ఇరాక్, యూఏఈ, ఒమన్, ఖతార్ వంటి దేశాలకు కూడా ప్రజలు భిక్షాటన కోసం వెళ్తుంటారని చెప్పారు.

ఇవన్నీ ఇస్లామిక్ దేశాలని, భిక్షాటన ద్వారా ఇక్కడ బతకవచ్చని పాకిస్థాన్‌లోని పేద ప్రజలు భావిస్తున్నారు. సౌదీ అరేబియా ప్రతి సంవత్సరం వేలాది మంది పాకిస్థానీ యాచకులను వెనక్కి పంపుతుంది. వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని పాక్ ప్రభుత్వాన్ని కోరుతోంది.

2024 జనవరి నుంచి ఇప్పటి వరకూ సౌదీ అరేబియా, ఇరాక్, మలేషియా, ఒమన్, ఖతార్, యూఏఈ నుంచి మొత్తం 5,402 మంది యాచకులను వెనక్కి పంపినట్లు మంత్రి తెలిపారు. అంతేకాకుండా ఈ ఏడాదిలోనే 552 మంది పాకిస్థానీ యాచకులను వెనక్కి రప్పించారు.

పాకిస్థాన్ నుంచి బిచ్చగాళ్లలో ఎక్కువ మంది సౌదీ అరేబియాకు వెళ్తుంటారు. పాకిస్థాన్ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు భిక్షాటన కోసమే వస్తున్నారని, దీనిపై సౌదీ అరేబియా కూడా పలుమార్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

పాకిస్థాన్ పార్లమెంటులో సమర్పించిన డేటా ప్రకారం భిక్షాటనకు వెళ్లేవారిలో అత్యధికంగా పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌కు చెందినవారే ఉన్నారు. ఒక్క సింధ్ నుంచి మాత్రమే సౌదీ అరేబియాకు వెళ్లిన వారి సంఖ్య 2,795. పంజాబ్ ప్రావిన్స్ నుంచి 1437 మంది, ఖైబర్ పఖ్తుంఖ్వా నుంచి 819 మంది వెళ్లిపోయారు. బలూచిస్థాన్ నుంచి 125 మంది సౌదీ అరేబియా వెళ్లారు. వెనక్కి పంపిన యాచకుల డేటా ఇది.

అక్కడ ఇంకా భిక్షాటన చేస్తున్న వారు ఉండటంతో ఈ సంఖ్య ఎక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఇరాక్ లాంటి దేశంలో కూడా పాకిస్థాన్‌కు చెందిన వారు భిక్షాటన చేయడానికి వెళ్లారు. పాక్ ప్రభుత్వ డేటాను పరిశీలించిన తర్వాత పాకిస్థాన్‌లో బిచ్చగాళ్ళు లేని ఒక్క ప్రాంతం కూడా లేదని స్పష్టమవుతోంది.

పాక్ తన పంజాబ్, సింధ్ ప్రావిన్సుల ప్రజలు ధనవంతులు అని చెబుతుంది. అయితే ప్రభుత్వ డేటా ప్రకారం ఈ రెండు ప్రావిన్సుల ప్రజలు కూడా భిక్షాటన చేస్తూ పట్టుబడ్డారు. అయితే పాక్‌ను చాలా మంది అంతర్జాతీయ బిచ్చగాడు అనే బిరుదుతో కూడా పిలుస్తున్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

టాపిక్

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link