అభిషేక్ వర్సెస్ దిగ్వేష్.. ఓపెనర్ కు చెంప దెబ్బ.. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ జోక్యం

Best Web Hosting Provider In India 2024


అభిషేక్ వర్సెస్ దిగ్వేష్.. ఓపెనర్ కు చెంప దెబ్బ.. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ జోక్యం

ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్ నిష్క్రమించింది. సోమవారం (మే 19) సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా దిగ్వేష్, అభిషేక్ మధ్య గొడవ వైరల్ గా మారింది.

Abhishek Sharma, Digvesh Rathi were involved in heated clash during LSG vs SRH

ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. సోమవారం (మే 19) హోం గ్రౌండ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో ఓడింది. ఈ థ్రిల్లింగ్ మ్యాచ్ లో అభిషేక్ శర్మ చెలరేగి సన్ రైజర్స్ ను గెలిపించాడు. అయితే ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ, లక్నో స్పిన్నర్ దిగ్వేష్ రతి మధ్య గొడవ వైరల్ గా మారింది. మ్యాచ్ ముగిసిన తర్వాత లక్నో అసిస్టెంట్ కోచ్ విజయ్ దహియా, బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా జోక్యం మరింత హీట్ పెంచింది.

ఏం జరిగిందంటే?

లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో ఛేజింగ్ అభిషేక్ శర్మ చెలరేగాడు. 20 బంతుల్లో 59 పరుగులు చేశాడు. అయితే అభిషేక్ ను ఔట్ చేసిన దిగ్వేష్ తనదైన స్టైల్లో నోట్ బుక్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. అది చూసిన అభిషేక్ కాస్త సీరియస్ అయ్యాడు. మాటా మాటా పెరిగింది. ఇద్దరు ఆటగాళ్ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో సహచర ఆటగాళ్లు, అంపైర్లు జోక్యం చేసుకుని అభిషేక్ ను పెవిలియన్ పంపించారు.

మ్యాచ్ ముగిశాక

అయితే అభిషేక్ శర్మ, దిగ్వేష్ రతి ఎపిసోడ్ అక్కడితోనే ముగిసిపోలేదు. మ్యాచ్ ముగిశాక రెండు టీమ్స్ ఆటగాళ్లు కరచాలనం చేశారు. ఆ సమయంలో లక్నో అసిస్టెంట్ కోచ్ విజయ్ దహియా.. అభిషేక్ శర్మ ను ఆపి కాసేపు మాట్లాడాడు. అభిషేక్ కాస్త కోపంతోనే స్పందించినట్లు కనిపించింది. దీంతో విజయ్ దహియా.. అభిషేక్ శర్మ చెంపపై మెల్లగా కొట్టి, వెళ్లమని చెప్పాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

బరిలోకి రాజీవ్ శుక్లా

అభిషేక్ శర్మ, దిగ్వేష్ రతి మధ్య గొడవకు ఎండ్ కార్డు వేసేందుకు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా బరిలో దిగాడు. ఇద్దిరితో మాట్లాడి గొడవ ముగించాడు. మ్యాచ్ తర్వాత అభిషేక్ శర్మతో రాజీవ్ మాట్లాడిన ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.

మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మ్యాచ్ అనంతరం తాను అతని (దిగ్వేష్)తో మాట్లాడాను. ఇప్పుడు అంతా బాగానే ఉందని’’ అని అభిషేక్ శర్మ తెలిపాడు. అభిషేక్ 20 బంతుల్లో ఆరు సిక్సర్లు, నాలుగు బౌండరీలు సాధించి సన్ రైజర్స్ ను గెలిపించాడు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం


Best Web Hosting Provider In India 2024


Source link