




Best Web Hosting Provider In India 2024

ఓటీటీలో అదరగొడుతున్న యాక్షన్ కామెడీ సినిమా.. ట్రెండింగ్‌లో దూసుకొచ్చిన లోబడ్జెట్ చిత్రం.. తెలుగులోనూ స్ట్రీమింగ్
గ్యాంగర్స్ సినిమా ఓటీటీలో మంచి వ్యూస్ దక్కించుకుంటోంది. నేషనల్ వైడ్ ట్రెండింగ్‌లో దూసుకొచ్చేసింది. ఐదు భాషల్లో ఈ మూవీ ఇటీవలే స్ట్రీమింగ్కు అడుగుపెట్టింది.
తమిళ యాక్షన్ కామెడీ మూవీ ‘గ్యాంగర్స్’ ఏప్రిల్ 24వ తేదీన థియేటర్లలో విడుదలైంది. సుందర్ సీ, వడివేలు, క్యాథరీన్ థ్రెసా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఓ భారీ దోపిడీ చేసేందుకు ఓ గ్యాంగ్ ప్రయత్నించడం చుట్టూ కామెడీ ప్రధానంగా ఈ చిత్రం సాగుతుంది. లీడ్ రోల్ చేసిన సుందర్ సీ.. ఈ మూవీకి దర్శకత్వం కూడా వహించారు. ఈ గ్యాంగర్స్ సినిమా ఓటీటీలో అదిరిపోయే పర్ఫార్మెన్స్ చేస్తోంది.
గ్యాంగర్స్ సినిమా గత వారం మే 15వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చింది. స్ట్రీమింగ్ తర్వాత పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఓటీటీలో ఈ చిత్రానికి ఆదరణ అంచనాలకు మించి దక్కుతోంది.
ట్రెండింగ్‌లో రెండో ప్లేస్‌కు..
గ్యాంగర్స్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో మంచి వ్యూస్ దక్కించుకుంటోంది. స్ట్రీమింగ్ తర్వాత క్రమంగా వ్యూస్ పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఈ చిత్రం ఏకంగా నేషనల్ వైడ్ ట్రెండింగ్‌లో ప్రస్తుతం (మే 20) రెండో స్థానానికి దూసుకొచ్చింది. ఈ తక్కువ బడ్జెట్ మూవీ ఇండియా రేంజ్లో ట్రెండింగ్‌లో సత్తాచాటుతోంది.
ఐదు భాషల్లో స్ట్రీమింగ్
గ్యాంగర్స్ సినిమా మే 15వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్కు వచ్చింది. థియేటర్లలో తమిళంలో ఒక్కటే విడుదలైన ఈ సినిమా.. ఓటీటీలో మాత్రం ఐదు భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీకి భారీ వ్యూస్ దక్కేందుకు ఇది కూడా ఓ కారణంగా ఉంది.
గ్యాంగర్స్ బడ్జెట్ ఇదే
గ్యాంగర్స్ సినిమా సుమారు రూ.16కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. ఈ మూవీ మొత్తం రూ.13కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుందని అంచనా. థియేట్రికల్ రన్లో ఈ మూవీ సక్సెస్ కాలేకపోయింది. అయితే, ఈ లోబడ్జెట్ చిత్రం ప్రైమ్ వీడియో ఓటీటీలో అదరగొడుతోంది. వేరే భారీ చిత్రాలను దాటేసి ఇండియా ట్రెండింగ్‌లో ఈ మూవీ రెండో ప్లేస్‌కు దూసుకొచ్చింది. ఎన్ని రోజులు జోరు కొనసాగిస్తుందో చూడాలి.
గ్యాంగర్స్ సినిమాలో సుందర్, వడివేలు, క్యాథరీన్ థ్రెసాతో పాటు వాణి భోజన్, మైమ్ గోపీ, హరీశ్ పేరడి, విచు విశ్వనాథ్, అరుల్ దాస్, మునిశ్కాంత్, భగవంత్ పెరుమాల్ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీని ఎంటర్టైనింగ్గా తెరకెక్కించారు సుందర్. స్కూల్లో ఓ పాప మిస్సింగ్, గ్యాంగర్స్ అనే టీమ్ ఓ చోరీ చేసేందుకు ప్రయత్నించడం చుట్టూ స్టోరీ సాగుతుంది. ఈ సినిమాను అవ్ని సినిమ్యాక్స్, బెంజ్ మీడియా బ్యానర్లపై ఖుష్బూ సుందర్, ఏసీ షణ్ముగం, అరుణ్ కుమార్ ప్రొడ్యూజ్ చేశారు. సీ సత్య సంగీతం అందించారు.
గ్యాంగర్స్ స్టోరీలైన్
ఓ స్కూల్లో చదివే పాప మిస్ అవుతుంది. ఆ పాపను కనుగొనాలని పోలీసులకు టీచర్ సుజిత (క్యాథరీన్ థ్రెసా) కంప్లైట్ చేస్తుంది. విచారణ సాగుతుంది. ఇంతలో ఓ పీటీ టీచర్ శవరణన్ (సుందర్ సీ) దోపిడీ చేసేందుకు ప్లాన్ చేస్తాడు. ఓ చోటు భారీగా ఉన్న ధనాన్ని దోచేయాలని ఓ గ్యాంగ్‌ను కూడగడతాడు. ఇది ఎలా సాగిందనే విషయం గ్యాంగర్స్ సినిమాలో ఉంటుంది. ఈ మూవీ క్లైమాక్స్ బాగా మెప్పించేలా సాగుతుంది.
సంబంధిత కథనం