బ్రహ్మముడి మే 21 ఎపిసోడ్: జనాభా లెక్కలతో బయటపడిన కావ్య బంధం- కళావతిపై అరిచిన రాజ్- గర్ల్‌ఫ్రెండ్‌తో రాహుల్ రొమాన్స్

Best Web Hosting Provider In India 2024

బ్రహ్మముడి మే 21 ఎపిసోడ్: జనాభా లెక్కలతో బయటపడిన కావ్య బంధం- కళావతిపై అరిచిన రాజ్- గర్ల్‌ఫ్రెండ్‌తో రాహుల్ రొమాన్స్

Sanjiv Kumar HT Telugu

బ్రహ్మముడి సీరియల్ మే 21 ఎపిసోడ్‌లో కావ్యకు లవ్ లెటర్ రాస్తాడు రాజ్. దానికి కల్యాణ్ సహాయం తీసుకుంటాడు. గర్ల్‌ఫ్రెండ్‌తో బెడ్ మీద రాహుల్ రొమాన్స్ చేస్తాడు. స్వప్న రవ్వల నెక్లెస్ ఇస్తే ఏడు వారాల నగలు కావాలంటుంది. దాంతో వాటిని కొట్టేయాలని ప్లాన్ చేస్తాడు రాహుల్. కావ్యకు రాజ్ లవ్ లెటర్ ఇస్తాడు.

బ్రహ్మముడి సీరియల్‌ మే 21వ తేది ఎపిసోడ్

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాజ్ సైడ్ నుంచి నరుక్కొద్దాం అని ఇందిరాదేవి అంటుంది. హా నరుకొద్దామా అని అపర్ణ ఆశ్చర్యపోతుంది. ఆరు నెలలు సావాసం చేస్తే గుర్రం గాడిద అయినట్లు నువ్ కూడా దీనిలా తింగరిదానిలా మాట్లాడుతావేంటీ. వాడి సైడ్ నుంచి మన ప్లాన్ ఇంప్లిమెంట్ చేద్దామంటున్నా అని ఇందిరాదేవి అంటుంది.

యూత్‌ఫుల్‌గా ఆలోచించాలి

అంటే, నేను గాడిదనా అని కావ్య అమాయకంగా అడుగుతుంది. చెప్పిందంతా వదిలేసి గాడిద దగ్గరే ఆగిపోయావ్ చూడు అప్పుడే అర్థమైంది. గాడిదవు కాదు అడ్డగాడిదవని, దున్నపోతువని.. ఛీ.. ఛీ ఎక్కడ దొరికిన సంతరా నాకిది అని కావ్యను తిడుతుంది ఇందిరాదేవి. కళావతిని ఇంప్రెస్ చేయడానికి మనమే యూత్‌ఫుల్‌గా ఆలోచించాలి అని రాజ్ ఆలోచిస్తుంటాడు.

స్తంభానికి చుట్టుకుని ఫోన్‌లో రొమాంటిక్‌గా మాట్లాడుతాడు కల్యాణ్. అది చూసిన రాజ్ తమ్ముడేంటీ త్రాచుపాములా మెలికలు తిరిగిపోతున్నాడు. తమ్ముడి కవి కదా. మనోడిని యూజ్ చేసుకుని మంచి లవ్ లెటర్ రాయిస్తే కళావతిని ఇంప్రెస్ చేద్దాం అని రాజ్ వెళ్తాడు. బెడ్ రూమ్‌లో అప్పు చేసిన దానిగురించి కల్యాణ్ అడుగుతాడు.రెచ్చగొట్టడం తప్పే అని కల్యాణ్ అంటాడు.

పెళ్లాంతోనే పులిహోర కలుపుతున్నాడా. వీళ్లు భార్యాభర్తలు కదా. ఇలా అడుక్కుంటున్నాడేంటీ అని రాజ్ అనుకుంటాడు. వెంటనే వచ్చి అప్పును ముద్దు పెట్టమంటాడు కల్యాణ్. నేను జీపులో ఉన్నా. కానిస్టేబుల్స్ వింటున్నారు అని ఇబ్బందిగా ఫీల్ అవుతుంది అప్పు. ఎంత చెప్పిన కల్యాణ్ వినడు. పబ్లిక్‌లో కన్ను కొట్టినందుకు ఫోన్‌లో ముద్దు పెట్టు అని కల్యాణ్ అంటాడు.

అప్పు ముద్దుపెట్టబోతుంటే

అది విన్న కానిస్టేబుల్ పర్లేదు మేడమ్ పెట్టండి. సర్ అసలే రొమాంటిక్. డ్రైవర్ కారు పక్కన ఆపు అని చెబుతుంది. దాంతో అప్పు జీపు దిగి మాట్లాడుతుంది. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావ్ నేను ఇంటికి వచ్చానంటే అని అప్పు అంటే.. మన ఫస్ట్ నైట్‌కు ఏర్పాటు చేస్తాను అని కల్యాణ్ అంటాడు. సరే అని ఫోన్‌లో కల్యాణ్‌కు అప్పు ముద్దు పెట్టబోతుంటే.. రాజ్ ఫోన్ లాక్కుంటాడు.

ఏంటీ అన్నయ్య ఇది అని కల్యాణ్ అడిగితే.. కడుపు మంటరా.. కడుపు మంట.. మనకు దక్కనిది ఇంకొకరికి ఈజీగా దక్కేస్తుంటే కడుపు మంట. మీ వదినను హర్ట్ చేశాను అని మోడ్రన్ డ్రెస్ గురించి చెబుతాడు రాజ్. ఇప్పుడు ఇంప్రెస్ చేయాలి. నా మీదున్న కోపాన్ని పోగొట్టాలి. నా మనసులో మాటలు లెటర్‌లో రాసి ఇస్తా అని రాజ్ అంటాడు. దానికి నన్ను డిస్టర్బ్ చేయాల. మంచి ముద్దు మిస్ చేశావ్ తెలుసా. నీకేం తెలుసులే పెళ్లి అయినవాడి కష్టాలు అని కల్యాణ్ అంటాడు.

తెలుసుకుంటాలే. లెటర్ రాయడానికి హెల్ప్ చేయి. తప్పులు లేకుండా కరెక్షన్ చేద్దువు. ఇంకోసారి మీ వదిన విషయంలో తప్పు చేయాలనుకోవట్లేదు. అందుకే నీ హెల్ప్ అడుగుతున్నా అని రాజ్ అంటాడు. మరోవైపు ఫోన్ సడెన్‌గా కట్ అవడంతో అప్పు వెళ్లిపోతుంది. కళావతి మీరే నా ప్రేమ అగరబత్తి.. చూడగానే పోయింది నా మతి అని రాజ్ కవిత్వం చెబుతుంటే కల్యాణ్ రాస్తాడు.

నువ్వే జీవితం అనుకుని

ఆ రోజు మిమ్మల్ని రోడ్డు మీద చూడటం ఒక కల.. అప్పటి నుంచి మీ వెంట పడ్డ కుక్కల.. అని రాజ్ అంటాడు. ప్రాసలతో రాజ్ చెబుతాడు. దాన్ని కావ్యకు ఇచ్చేయమని కల్యాణ్ అంటాడు. దాంతో రాజ్ వెళ్లిపోతాడు. అందులో ఏం రాస్తే ఏంటీలే.. నువ్వే జీవితం అనుకుని బతుకుతుంది వదినా. నిన్ను కాదని ఎక్కడికి వెళ్తుంది చెప్పు అని కల్యాణ్ అనుకుంటాడు.

మరోవైపు ఇంట్లో వరుసల గురించి చెప్పి కావ్య స్థానం ఏంటో రాజ్‌కు అర్థమయ్యేలా చెప్పాలి అని రుద్రాణి అనుకుంటాడు. రాజ్ వస్తాడు. లెటర్ దాస్తాడు. ఏంటీ దాస్తున్నావ్ అని రుద్రాణి అడుగుతుంది. కానీ, మీకు చెప్పాల్సిన అవసరం లేదని అర్థమయ్యేలా చెబుతాడు రాజ్. నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. కళావతి గురించి అని రుద్రాణి అంటుంది. దాంతో రాజ్ ఆగిపోతాడు.

ధాన్యలక్ష్మీ, తన కొడుకు, రుద్రాణి తన కొడుకు రాహుల్ గురించి చెబుతుంది రుద్రాణి. ఎధవ అంటగా.. అదే పబ్లిక్ టాక్ అని రామ్ అంటాడు. తర్వాత స్వప్న గురించి చెబుతుంది రుద్రాణి. వరుసల గురించి చెబుతున్నారు అంతేగా.. అది తర్వాత అయిన తెలుసుకోవచ్చు. కొంపలు కూల్చే పని తప్ప మీకు వేరే ఏం పని ఉండదని మా అమ్మ చెప్పింది. మీ మాటలు వినడానికి రెడీగా లేను అని రాజ్ వెళ్లిపోతాడు. దాంతో రుద్రాణి షాక్ అవుతుంది.

తిట్టనందుకు సంతోషించు

కావ్యకు పెళ్లి అయిపోయిందని చెప్పాలనుకుంటే ఇలా వెళ్లిపోయాడేంటీ అని రుద్రాణి అనుకుంటుంది. తిట్టనందుకు సంతోషించు అని స్వప్న ఎంట్రీ ఇస్తుంది. అదే నేను అయితే ఆ కుర్చీని మడతపెట్టి.. పక్కన పెట్టేదాన్ని. మీకు కొంచెం కూడా సిగ్గుగా లేదా. కావ్య గురించి బయటపెట్టాలని ఎందుకు చూస్తున్నావ్. ఎందుకు రాజ్ ప్రాణాలతో ఆడుకుంటున్నావ్ అని కావ్య పెళ్లి ఫొటో గురించి చెబుతుంది స్వప్న.

అయితే, ఫొటో మార్చింది నువ్వేనా అని రుద్రాణి అంటుంది. ఇంకోసారి నా చెల్లి జోలికి వస్తే నీకు నీ కొడుకుకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. నీ కొడుకు ఎక్కడికి వెళ్లాడు. నీ హస్తం లేకుండా వాడు ఎక్కడికి వెళ్లడు. వాడు ఏదైనా తప్పు చేస్తున్నాడని తెలియాలి. మీకుంటది దబిడి దిబిడే అని స్వప్న వెళ్లిపోతుంది. మరోవైపు వేరే అమ్మాయితో రాహుల్ డ్యాన్స్ చేస్తుంటాడు.

డ్యాన్స్ చేసి తనను బెడ్ మీద పడెస్తాడు. బెడ్ మీద రాహుల్ పడి రొమాంటిక్‌గా చూస్తాడు. తర్వాత స్వప్న దగ్గర దొంగలించిన రవ్వల నెక్లెస్‌ను తనకు చూపిస్తాడు. దాంతో తను కోపంగా లేస్తుంది. ఏమైందని రాహుల్ అడిగితే.. నేనేం అడిగాను. నువ్వేం తీసుకొచ్చావ్. నేను అడిగింది మీ ఆవిడ వేసుకునే ఏడు వారాల నగలు. ఈ ముష్టి నెక్లెస్ తీసుకొచ్చి నన్ను నీ సొంతం చేసుకోవాలని చూస్తున్నావా అని అంటుంది.

అవసరం తీరాక

అలా చేయాలంటే చాలా టైమ్ పడుతుంది అని రాహుల్ అంటాడు. అవసరం తీరాక నన్ను కూడా వదిలేద్దామనుకుంటున్నావా అని అమ్మాయి అంటుంది. రాహుల్ ఏదోటి కవర్ చేస్తాడు. నా పెళ్లాం కంటే నిన్ను ఎక్కువగా లవ్ చేస్తున్నాను కాబట్టే వచ్చాను. నా మనసుకు గాయం చేయకు. మా డాడీ మీద ఒట్టు అని రాహుల్ అంటాడు. నిజంగా నన్ను లవ్ చేస్తే ఏడు వారాల నగలు తీసుకురావాలి అని అమ్మాయి అంటుంది.

అవన్నీ బ్యాంక్ లాకర్‌లో ఉన్నాయి. వాటిని ఇంటికి తీసుకొచ్చేలా చేసి తీసుకురావాలి అని రాహుల్ అంటాడు. అయితే, ముందు ఆ పని గురించి చూడు. ఏడు వారాల నగలు తీసుకొచ్చి నీ సొంతం చేసుకో. అప్పటి వరకు దీంతో అడ్జస్ట్ అవుతాను అని వెళ్లిపోతుంది. దీన్ని సొంతం చేసుకోవాలంటే ఆ ఏడు వారాల నగలు కొట్టేయక తప్పదు. స్వప్న వస్తున్నా నీ ముందు మ్యాజిక్ చేయడానికి అని రాహుల్ వెళ్లిపోతాడు.

రాజ్ రావడం చూసిన కావ్య ఈయన మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నట్లున్నారు. బెడ్ రూమ్‌లోకి తలుపు వేసుకోవడం మంచిది అని రాజ్‌ను చూసి పరుగెడుతుంది కావ్య. వెంటనే వచ్చిన రాజ్ నేను రావడం చూసి మీరు లోపలికి పారిపోతున్నారు అని అడుగుతాడు. దాంతో కావ్య కవర్ చేస్తుంది. తర్వాత తను కోమా నుంచి రాగానే మీ వెంట పడుతున్నట్లు రాజ్ ఆవేశంగా చెబుతాడు.

అరవట్లేదు..

అరుస్తున్నారేంటీ అరుస్తున్నారు అని కావ్య అంటుంది. అరవట్లేదు.. జస్ట్ చెబుతున్నా అని రాజ్ అంటే.. ఎందుకొచ్చారు అని కావ్య అంటుంది. మీకు ఒక్కటి ఇద్దామని రాజ్ అంటే.. కావ్య భయపడుతుంది. అదేదో కాదండి ఇది లవ్ లెటర్ చూపిస్తాడు రాజ్. అది తీసుకుని కావ్య చూస్తుంది. మరోవైపు జనాభా లెక్కల కోసం వచ్చినట్లుగా నా మనిషి మీ ఇంటికి వస్తారు. అక్కడ ఎవరికి ఎవరు ఏమవుతారో వారే తేలుస్తారు అని రుద్రాణితో యామిని చెప్పి కుట్ర చెస్తే రుద్రాణి ఫాలో అవుతుంది.

దుగ్గిరాల ఇంటికి జనాభా లెక్కలు అంటూ యామిని పంపించిన వ్యక్తి వస్తాడు. ఒక్కొక్కరి రిలేషన్ చెబుతారు ఇంట్లోవాళ్లు. ఇంతలో కావ్య వస్తే.. ఈవిడ ఇంటికి ఏమవుతారు అని జనాభా లెక్కల అతను అడుగుతాడు. దాంతో అంతా కంగారుగా చూస్తారు. రాజ్ కూడా చూస్తుంటాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024