





Best Web Hosting Provider In India 2024

మళ్లీ తెరమీదకు 68 ఏళ్ల నాటి క్లాసిక్ మాయాబజార్.. తెలుగు నాట రాజకీయాలను ఎన్టీఆర్‌కు ముందు తర్వాత చెప్పుకోవాలంటూ!
సీనియర్ ఎన్టీఆర్ నటించిన ఎన్నో సినిమాలు క్లాసిక్స్‌గా ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. అలాంటి సినిమాల్లో మాయాబజార్ ఒకటి. 68 ఏళ్ల నాటి ఈ క్లాసిక్ మూవీని కలర్‌లో మళ్లీ తెరపైకి తీసుకురానున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మాయాబజార్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖులు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
తెలుగు సినిమా రంగంలో మాయాబజార్ నాటికీ నేటికీ ఏనాటికి ఓ క్లాసిక్ మూవీ. సీనియర్ ఎన్టీఆర్ నటించిన ఎన్నో సినిమాలు క్లాసిక్స్‌గా ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. అలాంటి మూవీస్‌లో మాయాబజార్ ఒకటి. మాయాబజార్ సినిమా విడుదలై 68 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
మాయాబజార్ నటీనటులు
ఎన్‌టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.వి.రంగారావు, సావిత్రి, రేలంగి, గుమ్మడి, ముక్కామల, మిక్కిలినేని, అల్లు రామలింగయ్య, ఆర్. నాగేశ్వర రావు, సూర్యకాంతం, రమణా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన గొప్ప పౌరాణిక చిత్రం మాయా బజార్. విజయా ప్రొడక్షన్స్ పతాకంపై నాగిరెడ్డి, చక్రపాణి ‘మాయాబజార్’ చిత్రాన్ని చిరస్మరణీయంగా రూపొందించారు.
అపూర్వంగా-అనూహ్యంగా
దర్శకుడు కె.వి.రెడ్డి “మాయాబజార్” చిత్రాన్ని అపూర్వంగా, అనూహ్యంగా, అనితర సాధ్యంగా తెలుగు తెరపై ఓ సెల్యులాయిడ్ కావ్యంగా మలిచారు. అలాంటి “మాయాబజార్” చిత్రాన్ని ఈ నెల 28న ఎన్.టి. రామారావు 102వ జయంతి సందర్భంగా బలుసు రామారావు విడుదల చేస్తున్నారు.
మాయాబజార్ ప్రీ రిలీజ్ ఈవెంట్
మరోసారి తెరపైకి వస్తున్న మాయాబజార్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తాజాగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఛైర్మన్ టీడీ జనార్ధన్ మాట్లాడుతూ.. “మాయాబజార్ సినిమా అప్పటి ఇప్పటి తరానికి ఒక మైలు రాయి లాంటిది” అని అన్నారు.
తిరుగులేని విజయాన్ని
“ఇప్పటితరంలో ఎన్నో గ్రాఫిక్స్ వచ్చినా ఆనాడే గ్రాఫిక్స్ లేని సమయంలో ఎంతో అద్భుతంగా మాయాబజార్ సినిమాను మలిచి తిరుగులేని విజయాన్ని అందుకున్నారు. మళ్లీ ఇప్పుడు మాయాబజార్‌ని బలుసు రామారావు విడుదల చేయడం అభినందించదగ్గ విషయం” అని టీడీ జనార్ధన్ తెలిపారు.
రాజకీయాల్లో ఓ ధృవతార
“సినీరంగంలో రారాజుగా నిలిచిన ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఓ ధృవతార. తెలుగునాట రాజకీయాల్ని ఎన్టీఆర్‌కు ముందు తర్వాతగా చెప్పుకోవాలి. రాజకీయాల్లో నైతిక విలువల్ని, ప్రజాస్వామ్య విధానాల్ని, సంక్షేమ శకాన్ని ప్రారంభించిన మహాపురుషుడు ఎన్టీఆర్” అని టీడీ జనార్ధన్ కొనియాడారు.
ఎన్టీఆర్ శతజయంతి
“2023లో ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీని ఏర్పాటు చేశాము. ఎన్టీఆర్‌ను నమ్మి ఆచరించిన మహోన్నత ఆశయాలు, సిద్ధాంతాలు, విధానాల్ని భావితరాలకు అందించాలనే లక్ష్యంతో మేము ఎన్టీఆర్‌కు సంబంధించిన అపురూప గ్రంథాలను వెలువరించాము” అని జనార్ధన్ పేర్కొన్నారు.
మహానాడులో పాల్గొంటున్న
“మాయాబజార్ విడుదలై గొప్ప విజయం సాధిస్తుంది అని నమ్మకం నాకుంది. మే 28న మహానాడులో పాల్గొంటున్న కారణంగా ఆ రోజు నేను మాయాబజార్‌ను వీక్షించలేకపోయినా, కుటుంబ సమేతంగా మర్నాడు చూస్తాను. అందరూ దీనిని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఛైర్మన్ టీడీ జనార్ధన్ తన స్పీచ్ ముగించారు.
సంబంధిత కథనం