టాలెంట్ ఉండి సినిమా చేయ‌లేక‌పోతున్న వారి కోసం దిల్‌రాజు డ్రీమ్స్ – ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ లాంఛ్ ఎప్పుడంటే?

Best Web Hosting Provider In India 2024

టాలెంట్ ఉండి సినిమా చేయ‌లేక‌పోతున్న వారి కోసం దిల్‌రాజు డ్రీమ్స్ – ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ లాంఛ్ ఎప్పుడంటే?

Nelki Naresh HT Telugu

ఇండ‌స్ట్రీలో యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేసేందుకు దిల్‌రాజు డ్రీమ్స్ పేరుతో ఓ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు లాంఛ్ చేశారు. జూన్ నుంచి ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ అందుబాటులోకి రానుంది.

దిల్‌రాజు డ్రీమ్స్

టాలెంట్‌తో పాటు సినిమా చేయాల‌నే కోరిక‌, ఆశ బ‌లంగా ఉండి కూడా ఎవ‌రికి కాంటాక్ట్ కావాలో, ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియ‌క ఇబ్బందులు ప‌డేవారు ఇండ‌స్ట్రీలో చాలా మంది క‌నిపిస్తారు. ఇలాంటి యంగ్ టాలెంట్‌ను ప్రోత్స‌హించేందుకు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు ఓ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ లాంఛ్ చేయ‌బోతున్నారు. దిల్‌రాజు డ్రీమ్స్ పేరుతో ప్రారంభం కాబోతున్న ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ జూన్ నెల నుంచి అందుబాటులోకి రానుంది.

లింక్‌పై క్లిక్ చేసి…

కెరీర్ ప్రారంభం నుంచి కొత్త‌ కంటెంట్‌ను, టాలెంట్ ను ప్రోత్సహించే దిల్ రాజు ఇప్పుడు దిల్ రాజు డ్రీమ్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా యంగ్ టాలెంట్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసేందుకు సిద్ధ‌మ‌వుతోన్నారు.

ఈ ప్లాట్‌ఫామ్‌లో భాగం కావాలనుకునే వారు https://dilrajudreams.com/ లింక్‌పై క్లిక్ చేసి తమ వివరాలను నమోదు చేస్తే, దిల్ రాజు డ్రీమ్స్ బృందం స్వయంగా వారిని సంప్రదిస్తుంది. జూన్‌లో ఈ పోర్టల్ సిద్ధమైన తర్వాత, దిల్ రాజు డ్రీమ్స్ ద్వారా యువ ప్రతిభావంతులు తమ ఆలోచనలను ఈ బృందం దృష్టికి తీసుకెళ్లవచ్చు.

అప్రోచ్ కావాలో తెలియ‌క‌…

సినీ ప‌రిశ్ర‌మ‌లో త‌మ టాలెంట్ నిరూపించుకోవాలనుకునేవారు ఎంతోమంది సరైన ప్లాట్‌ఫామ్‌ లేక ఇబ్బందులు పడుతున్నారు. టాలెంట్ ఉన్నా సినీ పరిశ్రమలో కాంటాక్ట్స్ లేక, ఎవరిని ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియక ముందుకు వెళ్లలేకపోతున్నారు. అలాంటి వారందరికీ ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని దిల్‌రాజు డ్రీమ్స్ టీమ్ చెబుతోంది.

యువ‌త‌ త‌మ టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవడానికి దిల్ రాజు డ్రీమ్స్ చ‌క్క‌టి వేదిక‌గా ఉండ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. సినిమాలు చేయాలనే ఆలోచన ఉన్నవారు, సినీ పరిశ్రమలో అడుగు పెట్టాలనుకునేవారు, సినీ పరిశ్రమంలో భాగము కావాలనుకునేవారు దిల్ రాజు డ్రీమ్స్ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకుని తమ కలను సాకారం చేసుకోవచ్చ‌ని అన్నారు.

గేమ్ ఛేంజ‌ర్‌…సంక్రాంతికి వ‌స్తున్నాం…

ఈ ఏడాది దిల్‌రాజు గేమ్ ఛేంజ‌ర్‌తో పాటు సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమాల‌ను ప్రొడ్యూస్ చేశారు. ఇందులో గేమ్ ఛేంజ‌ర్ డిజాస్ట‌ర్‌గా నిల‌వ‌గా..సంక్రాంతికి వ‌స్తున్నాం మాత్రం మూడు వంద‌ల కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. నిర్మాత‌ల‌కు భారీగా లాభాల‌ను తెచ్చిపెట్టింది. ప్ర‌స్తుతం త‌మ్ముడు, రౌడీ జ‌నార్ధ‌న‌తో పాటు ప‌లు సినిమాల‌ను నిర్మిస్తోన్నారు దిల్‌రాజు. ఇటీవ‌లే సొంతంగా ఏఐ కంపెనీని దిల్‌రాజు లాంఛ్ చేశారు.

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024