




Best Web Hosting Provider In India 2024

మలయాళం స్టార్ హీరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్.. జెర్రిలాంటి మనిషి.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
మలయాళం స్టార్ హీరో రోషన్ మాథ్యూ నటించిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీలోకి రాబోతోంది. బుధవారం (మే 21) ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు. వచ్చే వారం స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ ట్రైలర్ తోనే అంచనాలను పెంచేసింది.
ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వస్తోంది. ఈ సిరీస్ పేరు కంఖజురా(Kankhajura). అంటే తెలుగులో జెర్రి అని అర్థం. ప్రముఖ మలయాళ నటుడు రోషన్ మాథ్యూ నెగటివ్ రోల్లో నటించిన సిరీస్ ఇది. గతంలోనే టీజర్ రిలీజ్ చేయగా.. బుధవారం (మే 21) ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ వెబ్ సిరీస్ విశేషాలేంటో చూద్దాం.
కంఖజురా వెబ్ సిరీస్ ట్రైలర్
క్రైమ్ థ్రిల్లర్ జానర్ వెబ్ సిరీస్ ఇష్టపడే వారికి ఈ కంఖజురా సిరీస్ ఆసక్తి రేపేలా ఉంది. ఇజ్రాయిల్ సిరీస్ అయిన మ్యాగ్పై (Magpie)ని ఇండియన్ వెర్షన్ ఈ సిరీస్. సోనీ లివ్ ఓటీటీలో మే 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఓ కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఉండే ఘర్షణ, అది ఆ కుటుంబాన్ని ఎలా విచ్ఛిన్నం చేస్తుందన్న కాన్సెప్ట్ తో వస్తోంది. ఈ సిరీస్ ట్రైలర్ రిలీజైంది. మొదట్లోనే 14 ఏళ్లు జైల్లో గడిపి వచ్చిన తన తమ్ముడి కోసం ఓ అన్న తన సన్నిహితులకు పార్టీ ఇవ్వడం చూపించారు.
అయితే ఆ తర్వాత ఆ తమ్ముడే తన అన్న వ్యాపారాల్లోని రహస్యాలను ప్రత్యర్థులకు చేరవేయడం చూడొచ్చు. అతనిపై ప్రతీకారం తీర్చుకోవడానికే జైలు నుంచి వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఈ వెబ్ సిరీస్ లో ఆషు అనే పాత్రలో రోషన్ మాథ్య, అతని అన్న మ్యాక్స్ పాత్రలో మోహిత్ రైనా నటించారు. సారా జేన్ డయాస్ కూడా ఇందులో ముఖ్యమైన పాత్ర పోషించింది.
కంఖజురా వెబ్ సిరీస్ గురించి..
టైటిల్ తోనే ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేసింది. కంఖజురా అంటే తెలుగులో జెర్రి అని అర్థం. దానిని మన కాలి వేసి సులువుగా నలిపేస్తాం. కానీ అది ఒక్కసారి మన శరీరంలోకి దూరిందంటే మాత్రం మని పని ఇక అంతే. ఈ సిరీస్ లో ఆషు పాత్ర కూడా అలాంటిదే. చిన్నప్పటి నుంచీ ఏమీ చేతకాని వాడిలా అందరి చేతుల్లో హేళనకు గురవుతాడు. జైలుకు కూడా వెళ్తాడు.
అయితే ఆ తర్వాతే తనలోని అసలు జెర్రిని అతడు బయటకు తీస్తాడు. మలయాళంలో ధూమం, కోబ్రాలాంటి సినిమాల్లో నటించిన రోషన్ మాథ్యూ ఇందులో ఆషు పాత్ర పోషించడంపై స్పందించాడు. ఆ పాత్ర భిన్నమైన స్వభావాలు కలిగినదని, ఈ సిరీస్ స్టోరీ తనను ఎంతగానో ఆకర్షించిందని చెప్పాడు. ఈ వెబ్ సిరీస్ ను చందన్ అరోరా డైరెక్ట్ చేశాడు. మే 30వ తేదీ నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
సంబంధిత కథనం