




Best Web Hosting Provider In India 2024
అప్పుడు జీరో.. ఇప్పుడు హీరో.. కెప్టెన్ హార్దిక్ పాండ్య స్టోరీలో ట్విస్ట్.. కథ మారిందిలా.. ఫ్యాన్స్ రియాక్షన్స్ వైరల్!
ఎవరికైనా సరే టైమ్ రావాలంటారు. ఇప్పుడు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యకు ఆ టైమొచ్చింది. గతేడాది ఎన్నో హేళనలు, అవమానాలు భరించిన అతనిపై ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి. ముంబయిని కెప్టెన్ గా ఫస్ట్ టైమ్ ప్లేఆఫ్స్ చేర్చాడు హార్దిక్.
ఒక్క ఏడాదిలో ఎంత మార్పు. 2024 ఐపీఎల్ లో అవమానాలు ఎదుర్కొని, జీరోగా మిగిలాడు హార్దిక్ పాండ్య. కానీ ఈ ఐపీఎల్ 2025లో వరుస ఓటముల తర్వాత టీమ్ పుంజుకుని ప్లేఆఫ్స్ చేరడంలో కీ రోల్ ప్లే చేశాడు. తన కెప్టెన్సీలో ముంబయి ఫస్ట్ టైమ్ ప్లేఆఫ్స్ చేరింది. దీంతో అప్పటి జీరో ఇప్పుడు హీరోగా మారాడు. ఫ్యాన్స్ అందరూ అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
అప్పుడేమైంది?
2023 సీజన్ వరకూ ముంబయి ఇండియన్స్ పరిస్థితి బాగానే ఉంది. రోహిత్ శర్మ కెప్టెన్. అప్పటికే అయిదు టైటిళ్లు గెలిచింది టీమ్. కానీ 2024 సీజన్ కోసం గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యను రప్పించి మరీ రోహిత్ స్థానంలో కెప్టెన్ గా చేశారు. దీంతో ఫ్యాన్స్ రగిలిపోయారు. ఎంఐ జెర్సీలను తగలబెట్టారు. స్టేడియంలో హార్దిక్ కనిపిస్తే చాలు హేళన చేశారు. ఎగతాళిగా కామెంట్లు చేశారు.
దారుణమైన ట్రోల్స్
హార్దిక్ పాండ్య కెప్టెన్ గా రావడంతో ముంబయి ఇండియన్స్ ఆటగాళ్లు రెండు వర్గాలుగా విడిపోయారనే వార్తలు వచ్చాయి. ఆ టీమ్ ప్రదర్శన దారుణంగా పడిపోయింది. ఐపీఎల్ 2024లో ముంబయి 14 మ్యాచ్ ల్లో 4 మాత్రమే గెలచింది. 10 ఓడిపోయింది. 8 పాయింట్లతో పట్టికలో లాస్ట్ ప్లేస్ లో నిలిచింది. దీంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యపై ఘోరమైన ట్రోల్స్ వచ్చాయి.
ఇప్పుడు ఇలా
ఏడాది గడిచింది. ఐపీఎల్ 2025 వచ్చింది. ఈ సీజన్ లో ఫస్ట్ 5 మ్యాచ్ ల్లో ముంబయి నాలుగు ఓడింది. దీంతో మళ్లీ గతేడాది సీన్ రిపీట్ అవుతుందని, కెప్టెన్ గా హార్దిక్ పై వేటు వేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. కానీ టీమ్ అద్భుతంగా పుంజుకుంది. ఆ తర్వాత ఆడిన 8 మ్యాచ్ ల్లో ఏకంగా 7 గెలిచి ప్లేఆఫ్స్ లో అడుగుపెట్టింది. కెప్టెన్ గా టైటాన్స్ ను 2022లో ఛాంపియన్ గా నిలిపాడు హార్దిక్. 2023లో టైటాన్స్ రన్నరప్ గా నిలిచింది.
కథ మారిందిలా
సవాళ్లను చూసి, అడ్డంకులు వచ్చాయని ఆగిపోయే రకం కాదు హార్దిక్ పాండ్య. ప్రొఫెషనల్ గా అయినా, పర్సనల్ గా అయినా హార్దిక్ పోరాట యోధుడే. ఓ వైపు భార్య వెళ్లిపోయినా.. మరోవైపు ప్రదర్శన పడిపోయినా హార్దిక్ ఆగలేదు. నెవర్ గివప్ యాటిట్యూడ్ తో సాగాడు. మళ్లీ కొత్తగా రీస్టార్ట్ చేశాడు. గేమ్ పై ఫోకస్ పెట్టాడు. ప్రాక్టీస్ టైమ్ పెంచాడు. లీడర్ గానూ టీమ్ మెంబర్స్ తో కలిసిపోయాడు.
అదే వాంఖడేలో
ముంబయి ఇండియన్స్ వరుస ఓటముల నేపథ్యంలో టీమ్ లో తిరిగి స్ఫూర్తి నింపేలా వ్యవహరించాడు. మధ్యలో తిలక్ వర్మ రిటైర్డ్ ఔట్ లాంటి కాంట్రవర్సీ నిర్ణయాలు ఉన్నా.. టీమ్ తిరిగి పుంజుకోవడంలో హార్దిక్ కీ రోల్ ప్లే చేశాడు. ఇప్పుడు అదే వాంఖడే స్టేడియంలో ముంబయి ఫ్యాన్స్ తో హీరో అనిపించుకున్నాడు. ఈ సీజన్ లో 12 మ్యాచ్ ల్లో 161 పరుగులు చేసిన హార్దిక్.. 13 వికెట్లు పడగొట్టాడు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link