





Best Web Hosting Provider In India 2024

ఓటీటీల్లోకి రేపు ఐదు సినిమాలు.. ప్రియదర్శి తెలుగు కామెడీ చిత్రం స్ట్రీమింగ్.. ఓ మలయాళ మూవీ.. తమిళంలో రెండు
ఓటీటీల్లోకి రేపు ఐదు ముఖ్యమైన సినిమా స్ట్రీమింగ్కు అడుగుపెట్టనున్నాయి. ఓ తెలుగు కామెడీ థ్రిల్లర్ సినిమా ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. రెండు తమిళ చిత్రాలు స్ట్రీమింగ్కు రానున్నాయి. ఆ ఐదు సినిమాలు ఏవంటే..
ఓటీటీల్లో కొత్త సినిమాలు చూడాలనుకునే వారు రెడీగా ఉండండి.. రేపు (మే 23) మరిన్ని స్ట్రీమింగ్కు రానున్నాయి. వీటిలో ఐదు చిత్రాలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. ప్రియదర్శి హీరోగా నటించిన తెలుగు కామెడీ మూవీ రేపే ఓటీటీలోకి వచ్చేయనుంది. మలయాళం, తమిళంలోనూ సినిమాలు ఎంట్రీ ఇవ్వనున్నాయి. రేపు ఓటీటీల్లోకి రానున్న ఐదు సినిమాలు ఏవంటే..
సారంగపాణి జాతకం
తెలుగు కామెడీ థ్రిల్లర్ సినిమా ‘సారంగపాణి జాతకం’ రేపు (మే 23) అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్కు రానుంది. ప్రియదర్శి హీరోగా నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలోనూ ఎంట్రీ ఇవ్వనుంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజైంది. నెలలోగానే ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వచ్చేస్తోంది.
సారంగపాణి జాతకం మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ సినిమాలో ప్రియదర్శితో పాటు రూప కొండువాయుర్, వెన్నెల కిశోర్, శ్రీనివాస్ అవసరాల, వైవా హర్ష కీలకపాత్రలు పోషించారు. బాక్సాఫీస్ వద్ద అనుకున్న రేంజ్లో ఈ చిత్రం కలెక్షన్లను దక్కించుకోలేదు. ఈ మూవీకి వివేక్ సాగర్ సంగీతం అందించారు. రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సారంగపాణి జాతకం సినిమాను చూసేయవచ్చు.
అభిలాషం
అభిలాషం చిత్రం థియేటర్లలో రిలీజైన దాదాపు 55 రోజుల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. ఈ మలయాళ రొమాంటిక్ డ్రామా సినిమా రేపు అమెజాన్ ప్రైమ్ వీడియో, మనోరమ మ్యాక్స్ ఓటీటీల్లో స్ట్రీమింగ్కు అడుగుపెట్టనుంది. సైజు గోపు, తన్విరామ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా మార్చి 29న రిలీజైంది. అభిలాషం మూవీకి సంజు జేబా దర్శకత్వం వహించారు.
వల్లమై
తమిళ రివేంజ్ థ్రిల్లర్ సినిమా వల్లమై రేపు మే 23వ తేదీన ఆహా తమిళ్, టెంట్కొట్టా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు రానుంది. ప్రేమ్‌గి అమరన్, దివ్యదర్శిని ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఏప్రిల్ 25న థియేటర్లలో విడులైంది. కూతురిపై లైంగిక దాడి చేసిన వారిపై తండ్రి పగ తీర్చుకోవడం చుట్టూ ఈ మూవీ సాగుతుంది. వల్లమై చిత్రానికి కరుప్పయా మురుగన్ దర్శకత్వం వహించారు.
సుమో
సుమో సినిమా రేపు టెంట్కొట్టా ఓటీటీలో స్ట్రీమింగ్కు రానుంది. ఈ తమిళ కామెడీ డ్రామా మూవీలో శివ, ప్రియా ఆనంద్, యషినోరో తషిరో లీడ్ రోల్స్ చేశారు. ఎస్పీ హోసిమిన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 25న థియేటర్లలో విడుదలైంది. నెలలోగానే ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది.
ఎయిర్‌ఫోర్స్ ఎలైట్: థండర్ బర్డ్స్
‘ఎయిర్‌ఫోర్స్ ఎలైట్: థండర్ బర్డ్స్’ అనే డాక్యుమెంటరీ సినిమా రేపు (మే 22) నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్కు రానుంది. అమెరికా ఎయిర్‌ఫోర్స్‌లోని ఓ దళం, ఎఫ్-16 విమానాల గురించి ఈ సినిమాలో ఉంటాయి. ఈ చిత్రానికి మాట్ విల్కాక్స్ దర్శకత్వం వహించారు.
సంబంధిత కథనం