ఒకే రోజు ఒకే ఓటీటీలోకి వ‌చ్చిన రెండు మ‌ల‌యాళం సినిమాలు – ఒక‌టి హార‌ర్ – మ‌రోటి రొమాంటిక్ థ్రిల్ల‌ర్

Best Web Hosting Provider In India 2024

ఒకే రోజు ఒకే ఓటీటీలోకి వ‌చ్చిన రెండు మ‌ల‌యాళం సినిమాలు – ఒక‌టి హార‌ర్ – మ‌రోటి రొమాంటిక్ థ్రిల్ల‌ర్

Nelki Naresh HT Telugu

మ‌ల‌యాళం సినిమాలు హంట్‌, అభిలాషం ఒకే రోజు ఒకే ఓటీటీలో రిలీజ‌య్యాయి. శుక్ర‌వారం నుంచి మ‌నోర‌మా మ్యాక్స్ ఓటీటీలో ఈ రెండు సినిమాలు స్ట్రీమింగ్ అవుతోన్నాయి. హంట్ మూవీలో భావ‌న హీరోయిన్‌గా న‌టించ‌గా…సైజు కురుప్‌, త‌న్విరామ్‌, అర్జున్ అశోక‌న్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.

మలయాళం ఓటీటీ

శుక్ర‌వారం (మే23న‌) ఒకే రోజు రెండు మ‌ల‌యాళం సినిమాలు మ‌నోర‌మా మ్యాక్స్ ఓటీటీలో రిలీజ‌య్యాయి. హంట్‌తో పాటు అభిలాషం సినిమాలు స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వ‌చ్చాయి. హంట్ మూవీ హార‌ర్ క‌థాంశంతో రూపొంద‌గా అభిలాషం రొమాంటిక్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కింది.

భావ‌న హీరోయిన్‌…

హార‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన హంట్ మూవీలో భావ‌న హీరోయిన్‌గా న‌టించ‌గా…రెంజీ ఫ‌ణిక్క‌ర్‌, అజ్మ‌ల్ అమీర్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ మూవీకి షాజీ కైలాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. నాన్ లీనియ‌ర్ స్క్రీన్‌ప్లే డిఫ‌రెంట్ అటెంప్ట్‌గా ద‌ర్శ‌కుడు ఈ మూవీని తెర‌కెక్కించాడు. భావ‌న యాక్టింగ్, టెక్నిక‌ల్‌గా మూవీ బాగున్నా కాన్సెప్ట్ రొటీన్ కావ‌డంతో బాక్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్‌గా మిగిలిపోయింది.

ఆత్మ వెంట‌ప‌డితే…

కీర్తి (భావ‌న‌) ఫోరెన్సిక్ స్టూడెంట్‌. ఈ మ‌ర్డ‌ర్ కేసు ఇన్వేస్టిగేష‌న్‌లో పోలీసుల‌కు సాయం చేస్తుంది కార్తి. అప్ప‌టి నుంచి ఆమె జీవితం ఊహించ‌ని మ‌లుపులు తిరుగుతుంది. చ‌నిపోయిన అమ్మాయి సారా ఆత్మ‌గా మారి కీర్తి వెంట‌ప‌డుతుంది. సారా ఎలా చ‌నిపోయింది? ఆమె మ‌ర‌ణానికి కీర్తి బాస్‌కు ఉన్న‌ సంబంధం ఏమిటి? సారా ఆత్మ కీర్తి వెంట‌ప‌డ‌టానికి కార‌ణం ఏమిటి? సారా మ‌ర‌ణం గురించి కీర్తికి ఎలాంటి నిజాలు తెలిశాయి? అన్న‌దే హంట్ మూవీ క‌థ‌.

అభిలాషం…

రొమాంటిక్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన అభిలాషం మూవీలో సైజు కురుప్‌, త‌న్విరామ్‌, అర్జున్ అశోక‌న్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. శంజు జైబా ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ ఏడాది మార్చిలో ఈ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. ఐఎమ్‌డీబీలో 8.9 రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది.

అభిలాషం క‌థ ఇదే…

అభిలాష్ కుమార్ అత్త‌రు బిజినెస్‌తో పాటు కొరియ‌ర్ స‌ర్వీస్ షాప్ న‌డుపుతుంటాడు. త‌న చిన్న‌నాటి స్నేహితురాలు షెరిన్‌ను ప్రాణంగా ప్రేమిస్తాడు. కానీ త‌న ప్రేమ‌ను ఆమెకు వ్య‌క్తం చేసేందుకు భ‌య‌ప‌డ‌తాడు. షెరిన్‌కు మ‌రో వ్య‌క్తితో పెళ్ల‌వుతుంది. భ‌ర్త చ‌నిపోవ‌డంతో కూతురితో క‌లిసి పుట్టింటికి వ‌స్తుంది. మ‌ళ్లీ షెరిన్‌కు ద‌గ్గ‌ర‌వుతాడు అభిలాష్‌. ఆమెకు త‌న ప్రేమ‌ను చెప్పాడా? కూతురితో క‌లిసి విదేశాల‌కు వెళ్లిపోవాల‌ని షెరిన్ ఎందుకు అనుకుంది? ఆమె కోసం అభిలాష్ ఎలాంటి రిస్క్ తీసుకున్నాడు అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024