Best Web Hosting Provider In India 2024

గుండెనిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: తండ్రి డబ్బు కొట్టేసి మనోజ్ జంప్ -సత్యానికి మీనా సాయం- ప్రభావతి ఓవరాక్షన్
గుండె నిండా గుడి గంటలు మే 23 ఎపిసోడ్లో ఇంటర్వ్యూ వెళ్లడానికి డబ్బులు లేకపోవడంతో తండ్రి జేబులో నుంచి దొంగతనం చేస్తాడు మనోజ్. ఆ దొంగతనం మనోజ్ చేసి ఉంటాడని ప్రభావతి అనుమానపడుతుంది. మరోవైపు సత్యానికి అర్జెంట్‌గా డబ్బులు అవసరం కావడంతో మీనా సాయం చేస్తుంది.
తాను జాబ్ మానేసిన సంగతి తల్లికి చెబుతాడు మనోజ్. పెద్ద ఫారిన్ కంపెనీలో ఇంటర్వ్యూకు వెళుతున్నానని, డబ్బులు కావాలని అంటాడు. తన దగ్గర డబ్బులు లేవని ప్రభావతి బదులిస్తుంది. ఈ జాబ్ కూడా నువ్వు చేస్తావన్న నమ్మకం లేదు…నేను డబ్బులు ఇవ్వను మనోజ్‌కు బదులిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ప్రభావతి.
మనోజ్ దొంగతనం…
తండ్రి రూమ్‌లోకి వెళతాడు మనోజ్. అక్కడ ఎవరు కనిపించకపోవడంతో తండ్రి జేబులో ఉన్న మూడు వందలు దొంగతనం చేసి అక్కడి నుంచి జారు కుంటాడు. ఆ తర్వాత రూమ్‌లోకి వచ్చిన సత్యం తన షర్ట్ కిందపడి ఉండటం, అందులో డబ్బులు కనిపించకపోవడంతో కంగారు పడతాడు. తన షర్ట్ జేబులో ఉన్న డబ్బులు కనిపించడం లేదని, ఏమయ్యాయని ప్రభావతిని అడుగుతాడు. ఇంట్లో పెట్టిన డబ్బులు ఎలా మాయమవుతాయని నిలదీస్తాడు.
ప్రభావతి అనుమానం…
అప్పుడే హాల్లోకి వచ్చిన మనోజ్వైపు అనుమానంగా చూస్తుంది ప్రభావతి. నేను వెళ్లాలి టైమ్ అవుతుందని కంగారుగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు మనోజ్. తన జేబులో డబ్బులు మిస్సయిన సంగతి బాలుకు చెబుతాడు సత్యం. మనోజ్ ఇంట్లో ఉన్నాడా అని బాలు అడుగుతాడు. ఆ మాట వినగానే మనోజ్‌ను దొంగ అంటావా అని ప్రభావతి ఫైర్ అవుతుంది. నేను ఆ మాట అనలేదని, మనోజ్‌ను అడగమని చెప్పబోతుంటే నువ్వే తొందరపడ్డావని బాలు సెటైర్ వేస్తాడు.
డబ్బులు ఇచ్చిన మీనా…
అర్జెంట్‌గా ఓ మూడు వందలు కావాలని బాలును అడుగుతాడు సత్యం. కానీ అతడి దగ్గర కూడా లేకపోవడం మీనా ఆ డబ్బులు ఇస్తుంది. మీనా దగ్గర నుంచి ఆ డబ్బులు తీసుకొని తండ్రికి ఇస్తాడు బాలు. ఈ రోజు నీ ఫేవరేట్ టిఫిన్ తినేసి వెళ్లమని బాలుతో చెబుతాడు సత్యం.
మనోజ్ బిల్డప్పులు…
ఇంటర్వ్యూకు వచ్చిన వారి ముందు తాను సంపాదించిన డిగ్రీల గురించి గొప్పలు చెబుతాడు మనోజ్. నా టాలెంట్, క్వాలిఫికేషన్‌కు ఈ జాబ్ ఈజీగా నాకే వస్తుందని బిల్డప్‌లు ఇస్తాడు. మీతో పోటీపడలేమని మనోజ్‌కు చెప్పి ఇంటర్వ్యూకు వచ్చిన వాళ్లు వెళ్లిపోతారు.
టేస్ట్ అదిరింది…
మీనా తన కోసం పూరీలు చేసిందని తెలిసి తినడానికి వస్తాడు బాలు. పూరీలు తింటే మీనా ముందు తక్కువైపోతానని ఆలోచించి డైనింగ్ టేబుల్ దగ్గర ఆగిపోతాడు. వెళ్లిపోవడానికి మనసు రాకపోవడంతో ఏదైతే అది అని తినడం మొదలుపెడతాడు. బాలు తింటాడా లేదా అని అతడినే చూస్తుంటుంది మీనా. చివరకు బాలు తినడం మొదలుపెట్టడంతో సంబరపడుతుంది. మీనా చేసిన పూరీ టేస్ట్ అదిరిపోయిందని మనసులోనే మెచ్చుకుంటాడు బాలు. రెండే పూరీలు మిగిలిపోవడంతో వాటిని మీనా కోసం ఉంచేసి వెళ్లిపోతాడు బాలు.
మీనా సంబరం…
బాలు ఎక్కడ ఖాళీ కడుపుతో బయటకు వెళతాడో అని మీనా పడిన టెన్షన్ మొత్తం పోతుంది. బాలు కడుపు నిండా తినడం చూసి సంబరపడుతుంది. అందులో మిగిలిపోయిన రెండు పూరీలు చూసి…నేను తిన్నానో లేదో అని నా కోసమే వదిలివెళ్లాడు అని మనసులో అనుకుంటుంది మీనా. సంతోషంగా టిఫిన్ చేస్తుంది.
టైమ్ కలిసి రాలేదు…
ఇంటర్వ్యూలో మనోజ్‌కు జాబ్ వస్తుంది. నాకు మీకంటే ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్నాయని, అసలు మీ ప్లేస్‌లో ఉండాలని కానీ టైమ్ కలిసిరాలేదని కంపెనీ ఎండీతో మనోజ్ బిల్డప్‌లు ఇస్తాడు. మనోజ్‌కు ఉద్యోగం వస్తుంది. కానీ కెనడాలో జాబ్ అని, ఉద్యోగంలో చేరడానికి డబ్బులు ఇవ్వాలని కంపెనీ ఎండీ అంటాడు. తన దగ్గర ఉన్న మూడు వందలు ఇవ్వబోతాడు. మూడు వందలు కాదని, 14 లక్షలు అని చెబుతాడు. ఎండీ చెప్పిన మాట విని మనోజ్ షాకవుతాడు. ఎమౌంట్ మొత్తం ఒకేసారి కట్టాలని అంటాడు.
వదిలేశాడా…గెంటేశారా…
మనోజ్ జాబ్ పోయిన సంగతి భర్తతో చెబుతుంది ప్రభావతి. అప్పుడే అక్కడికి వచ్చిన బాలు తల్లి మాటలు వింటాడు. వాడు వదిలేశాడా…బిల్డప్పులు భరించలేక గెంటేశారా అని బాలు సెటైర్లు వేస్తాడు. పెద్ద కంపెనీలో ఆఫర్ ఉందని ప్రజెంట్ జాబ్ వదిలేశాడని భర్తకు సపోర్ట్ చేసి రోహిణి మాట్లాడుతుంది.
అప్పుడే డల్‌గా అక్కడికి వస్తాడు మనోజ్. ఏమైందని ప్రభావతి అడుగుతుంది. తనకు కెనడాలో ఉద్యోగం వచ్చిన విషయం తల్లి చెవిలో సీక్రెట్‌గా చెబుతాడు. అతడు చెప్పిన మాట విని ప్రభావతి సంబరపడుతుంది.
ప్రభావతి శోకాలు…
వాడేం చెప్పాడు…నువ్వేం విన్నావు…అసలు ఏం జరుగుతుంది తల్లిని అడుగుతాడు బాలు. ఈ వయసులో ఈ కష్టాన్ని ఎలా తట్టుకునేది అని శోకాలు పెడుతుంది ప్రభావతి. తనకు ఉద్యోగం వచ్చిందని మనోజ్ అంటాడు. లక్షల్లో జీతం ఇస్తారు అని అంటాడు.
నెత్తి మీద రూపాయి పెట్టిన ఎవరూకొనరు నీకు లక్షల్లో జీతం ఇచ్చేది ఎవరు…వీడు ఏదో పెద్ద కుట్ర పన్నుతున్నాడని బాలు అంటాడు. కెనడాలో తనకు జాబ్ వచ్చిందని మనోజ్ బదులిస్తాడు. మనోజ్ దేశం కానీ దేశం పోతే ఈ ఇంట్లో ఎలా ఉండేది అని ప్రభావతి మళ్లీ శోకాలు పెడుతుంది. నేను నీతో పాటు కెనడా వస్తానని అంటుంది. అప్పుడే మనోజ్ కెనడా వెళుతున్నట్లు అతడికి అన్ని జాగ్రత్తలు చెబుతుంది ప్రభావతి.
పధ్నాలుగు లక్షలు…
పధ్నాలుగు లక్షలు కడితేనే ఆ జాబ్ తనకు వస్తుందనే అసలు సంగతి బయటపెడతాడు మనోజ్. అతడి మాటలు విని ప్రభావతి షాక్ అవుతుంది. ఉలుకుపలుకు లేకుండా ఉండిపోతుంది. రోహిణి పిలుపుతో షాక్ నుంచి తేరుకుంటుంది. ఇప్పుడు తీరిగ్గా ఏడువు అని తల్లితో అంటాడు బాలు. మనోజ్‌కు ప్రభావతి చెప్పిన అన్ని జాగ్రత్తలు రిపీట్ చేస్తూ ఆటపడ్డిస్తాడు. దీనికా వీడు ఇన్ని బిల్డప్‌లు ఇచ్చింది అని అంటాడు.
ఇళ్లు తాకట్టు పెట్టి…
బాలు కారు అమ్మేసి ఆటో నడుపుతోన్న విషయం బటపడుతుంది. ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి కొన్న కారును ఎందుకు అమ్మేశావని బాలును ప్రభావతి, రోహిణి నిలదీస్తారు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.