




Best Web Hosting Provider In India 2024

నేషనల్ హెరాల్డ్ కేసు.. ఈడీ ఛార్జిషీట్‌లో రేవంత్ రెడ్డి పేరు.. ఆరోపణలు ఇవే
నేషనల్ హెరాల్డ్ కేసుపై ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. దాంట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించింది. కానీ నిందితుల జాబితాలో చేర్చలేదు. వైఐ, ఏజీఎల్‌కు విరాళాలు అందించడానికి కొందరు కాంగ్రెస్ నాయకులు ప్రోత్సహించారని.. వారిలో రేవంత్ కూడా ఉన్నారని ఈడీ స్పష్టం చేసింది.
నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన ఛార్జిషీట్‌లో.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రస్తావించింది. యంగ్ ఇండియన్, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌లకు విరాళాలు అందించడానికి సహకరించిన కాంగ్రెస్ నాయకులలో.. రేవంత్ రెడ్డి కూడా ఉన్నారని ఈడీ స్పష్టం చేసింది. కానీ ఆయనను నిందితుడిగా పేర్కొనలేదు.
విరాళాలు.. వివాదాలు..
ఏప్రిల్ 9న కోర్టులో ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ.. యంగ్ ఇండియన్ ద్వారా ఏజీల్‌కు చెందిన సుమారు రూ.2,000 కోట్ల విలువైన ఆస్తులను మళ్లించడానికి పథకాన్ని రచించారని ఆరోపించింది. రేవంత్ రెడ్డి, దివంగత అహ్మద్ పటేల్, పవన్ బన్సాల్ వంటి కొంతమంది కాంగ్రెస్ నాయకులు 2019- 2022 మధ్య ఏఐ, ఏజీఎల్‌కు విరాళాలు ఇవ్వడానికి కొందరిని ప్రభావితం చేశారని.. ఈడీ ఛార్జిషీట్‌లో పేర్కొంది. ఈ విరాళాలు స్వచ్ఛందమైనవి కావని.. రాజకీయ ప్రయోజనాలను ఆశించి వచ్చాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అభిప్రాయపడింది.
నేషనల్ హెరాల్డ్ కేసు ఏంటి..
నేషనల్ హెరాల్డ్ వార్తా పత్రికను.. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ప్రచురించేది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా 2008లో ప్రచురణ నిలిచిపోయింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏజీఎల్‌కి రూ.90.25 కోట్ల వడ్డీ లేని రుణం ఇచ్చింది. 2010లో యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కొత్త సంస్థను స్థాపించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈ సంస్థలో ప్రధాన వాటాదారులు. యంగ్ ఇండియన్ కేవలం రూ.50 లక్షలు చెల్లించి ఏజీఎల్ ఆస్తులను పొందిందనే ఆరోపణలు ఉన్నాయి.
సోనియా, రాహుల్ నిందితులు..
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ వ్యవహారంపై మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తోంది. ఈడీ ఢిల్లీ కోర్టుకు తెలిపిన ప్రకారం.. సోనియా గాంధీ తన ఏఐసీసీ అధ్యక్ష పదవిని దుర్వినియోగం చేసి.. యంగ్ ఇండియన్ ద్వారా ప్రజాధనాన్ని తమ సొంతానికి ఉపయోగించుకున్నారని ఆరోపించింది. ఈ కేసులో సోనియా గాంధీని ఏ వన్‌గా, రాహుల్ గాంధీని ఏ2గా పేర్కొంటూ ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో విచారణలో ఉంది.
సంబంధిత కథనం
టాపిక్