బ్రహ్మముడి మే 24 ఎపిసోడ్: అప్పు మెడపై కల్యాణ్ ముద్దు- ధాన్యలక్ష్మీతో రుద్రాణి చిచ్చు- స్వప్న నెక్లెస్ మార్చిన రాహుల్!

Best Web Hosting Provider In India 2024

బ్రహ్మముడి మే 24 ఎపిసోడ్: అప్పు మెడపై కల్యాణ్ ముద్దు- ధాన్యలక్ష్మీతో రుద్రాణి చిచ్చు- స్వప్న నెక్లెస్ మార్చిన రాహుల్!

Sanjiv Kumar HT Telugu

బ్రహ్మముడి సీరియల్ మే 24 ఎపిసోడ్‌లో ఇంటికి వచ్చిన రాజ్‌ను యామిని తల్లి వైదేహి నిలదీస్తుంది. దాంతో రేపు ఒక్కరోజు క్లారిటీ వస్తుందని వెళ్లిపోతాడు. మరోవైపు అప్పు పర్మనెంట్‌గా ఇంట్లో ఉండేందుకు ధాన్యలక్ష్మీకి రుద్రాణి ప్లాన్ చెబుతుంది. ఇక స్వప్న నెక్లెస్ కొట్టేసిన రాహుల్ డూప్లికెట్ పెట్టి మార్చేస్తాడు.

బ్రహ్మముడి సీరియల్‌ మే 24వ తేది ఎపిసోడ్

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో అప్పు స్నానం చేసి జుట్టు తుడుచుకుంటుంది. వెనుక నుంచి కల్యాణ్ వస్తాడు. ఇంతలో అప్పుకు కాల్ వస్తుంది. 49 సార్లు తప్పించుకున్న క్రిమినల్ చార్లెస్ కడుపు నొప్పి అంటూ బాధపడుతున్నాడు అని కానిస్టేబుల్ కాల్ చేస్తాడు. అదంతా వాడు నాటకం ఆడుతున్నాడు. మీరు మాత్రం హాస్పిటల్‌కు తీసుకెళ్లకండి అని అప్పు చెబుతుంది.

షాక్ అయిన కానిస్టేబుల్

అందరిముందు కళ్లుగప్పి కన్నుకొట్టి నన్ను రెచ్చగొడతావా.. ఇప్పుడెలా తప్పించుకుంటావో చూస్తాను అని అప్పు కాల్ మాట్లాడుతుండగానే.. వెనుక నుంచి వెళ్లి గట్టిగా వాటేసుకుని అప్పు మెడపై ముద్దు పెడతాడు కల్యాణ్. దాంతో అప్పు గట్టిగా అరుస్తుంది. దానికి కానిస్టేబుల్ ఏమైందని షాక్ అవుతాడు. వదిలేయమని కల్యాణ్‌ను అంటే.. అంత కష్టపడి పట్టుకున్నాం కదా మేడమ్ అని కానిస్టేబుల్ అంటాడు.

మిమ్మల్ని కాదయ్యా అని అప్పు అంటుంది. తర్వాత మీరు కానివ్వండి అని కానిస్టేబుల్‌కు చెబితే.. హో అంత నచ్చిందా.. అయితే మళ్లీ ముద్దు పెడతాను అని కల్యాణ్ అంటాడు. శేషు గారు మీకు తర్వాత కాల్ చేస్తా అని కానిస్టేబుల్ కాల్ కట్ చేస్తుంది. కల్యాణ్‌ను ఏంట్రా రెచ్చిపోతున్నావ్. పట్టుకుంటే తోలు తీసే హక్కు ఉంది. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు కలిస్తే నెల తక్కువ వెధవలు పుడతారని మా అమ్మ చెప్పిందని అప్పు అంటుంది.

మరి మా అమ్మకు చెప్పి మంచి ముహుర్తం పెట్టించనా అని ఫస్ట్ నైట్ గురించి అంటాడు కల్యాణ్. కుదరదు.. ముహుర్తం పెట్టగానే నేనేం హౌజ్ వైఫ్ కాదు. నేను వెంటనే పూర్తి చేయాల్సిన కేసులు 3 ఉన్నాయి. అవి పూర్తి కావాలంటే 3 నెలలు అవుతుంది. అలాగే, నాకు ఇప్పుడు పిల్లలు వద్దు. రెండేళ్లు ఆగాల్సిందే అని అప్పు అంటుంది. అంటే అప్పటివరకు పస్తులు ఉండటమేనా అని కల్యాణ్ అంటే లేదు అని అప్పు ముద్దు పెడుతుంది. ఇలా స్నాక్స్ దొరుకుతాయ్ అని చెబుతుంది.

ఎదురుపడిన ధాన్యం

నాకు ఇలా స్నాక్స్‌తో కడుపు నిండదు. టిఫిన్స్ కావాలని కల్యాణ్ అంటే.. అయితే స్నాక్స్ కూడా పెట్టను అని కల్యాణ్‌ను తోసేసి బయటకు వెళ్లిపోతుంది అప్పు. వెంటనే కల్యాణ్ కూడా వస్తాడు. అప్పుకు ధాన్యలక్ష్మీ ఎదురుపడుతుంది. దాంతో అప్పు షాక్ అవుతుంది. కల్యాణ్ ఆగిపోతాడు. తన ఫ్రెండ్స్ ఫస్ట్ నైట్ గురించి మాట్లాడుకుంటున్నామని కల్యాణ్ చెబుతాడు. అడక్కుండానే ఆన్సర్ చెబుతున్నావేంటీ అని ధాన్యం అంటుంది.

అడుగుతావేమో అని చెప్పిన కల్యాణ్ వెళ్లిపోతాడు. అంటే, వీళ్లిద్దరికి ఇంకా మొదటిరాత్రి కాలేదన్నమాట. వీడిని అది దాని కొంగుకు కట్టేసుకుని ఆడిస్తూ తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తుందన్నమాట. దీని ఆటలు సాగనివ్వకూడదు అని ధాన్యలక్ష్మీ అనుకుంటుంది. మరోవైపు యామిని ఇంటికి రాజ్ వస్తాడు. ఎప్పుడు లేని విధంగా నీ ఫేస్ మూన్ లైట్‌లా వెలిగిపోతుందేంటీ అని యామిని అడుగుతుంది.

యామిని ఏంటీ ఇలా గుచ్చి గుచ్చి అడుగుతుంది. కళావతి ఇంటికి వెళ్లింది తెలిసిందా ఏంటీ అని రామ్ అనుకుంటాడు. రామ్ ఏదోటి కవర్ చేస్తాడు. నువ్ ఎక్కడికి వెళ్లావో తెలుసు. ఎవరితో కబుర్లు చెప్పావో తెలుసు. నాతో కహానీలు చెబితే నమ్మేంత పిచ్చిదాన్ని కాదు అని మనసులో అనుకుంటుంది యామిని. కలిసి భోజనం చేద్దామని వైధేహి అంటుంది. తినేసొచ్చానని రామ్ చెబుతాడు.

ఇంకా కొన్ని రోజులు మాత్రమే

దాంతో యామిని వెటకారంగా మాట్లాడుతుంది. కరెక్ట్‌గా అర్థం చేసుకున్నావ్ అని రామ్ అంటాడు. నువ్వేనా ప్రేమను అర్థం చేసుకోవట్లేదు. నా వల్ల ప్రాబ్లమ్ ఉందా అని యామిని అంటుంది. లేదని రామ్ అంటే.. లేదు మీరు యామినిని సరిగా పట్టించుకోవట్లేదు. పెళ్లికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది. ఇలాంటి టైమ్‌లో మీరు అమ్మాయి జంట పక్షుల్లా కలిసి ఉండాలి కానీ, ఒంటరి పక్షుల్లా ఉంటున్నారు. ఒకరికి ఒకరు సంబంధం లేకుండా ఉంటున్నారు అని వైధేహి నిలదీస్తుంది.

మీకోసం ఇంట్లో ఒకరు ఎదురుచూస్తున్నారు ఆలోచించట్లేదు. మీకోసం యామిని తినకుండా ఎదురుచూసింది. మీరేమే తినేసి వచ్చారు అని యామిని తండ్రి అంటాడు. మాతో ఏదైనా చెప్పాలా రామ్ అని వైధేహి అంటుంది. అవును మీకు ఓ విషయం చెప్పాలి. కానీ, ఇప్పుడు కాదు. రేపు నాకు ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు చెబుతాను అని రాజ్ వెళ్లిపోతాడు. రామ్ మాటల్లో ఏదో తేడా కనిపిస్తుంది ఏంటీ అని వైధేహి అంటుంది.

రేపే క్లారిటీ వస్తుంది. ఎందుకంటే బావ కావ్యకు లవ్ ప్రపోజ్ చేసేది రేపే. నేను బతికి ఉండగా అలా జరగనివ్వను. ఆ కావ్యకు బావ ప్రపోజ్ చేయకుండా ఉండేందుకు మీ ఇద్దరి హెల్ప్ కావాలి అని యామిని అంటుంది. నీ జీవితం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం అని వైధేహి అంటుంది. బావ చాలా సంబరపడుతున్నట్లున్నావ్. కానీ, కావ్యకు ఎలా ప్రపోజ్ చేస్తావో అది చూస్తాను అని యామిని అనుకుంటుంది.

ఇంట్లోనే పర్మనెంట్‌గా ఉంటుంది

మరోవైపు ధాన్యలక్ష్మీ ఆలోచిస్తుంటే రుద్రాణి వచ్చి ఎందులో అయినా ఇన్వెస్ట్ చేసి డబ్బులు పోగొట్టుకున్నావా అని అడుగుతుంది. అలా పోగొట్టుకునేది నువ్వు నీ కొడుకు అని ధాన్యలక్ష్మీ అంటుంది. కన్సర్న్‌గా మాట్లాడుదామని వస్తే కక్ష కట్టినట్లు అంటావేంటీ అని రుద్రాణి అంటుంది. నీ కోడలి మీద ఫ్రస్టేషన్ నా మీద చూపిస్తున్నావా అని రుద్రాణి అంటుంది.

అసలు అది ఏమనుకుంటుంది. నా కొడుకు సంతోషం కావాలి. తెల్లార్లు రాసుకుంటూ కూర్చొంటే అవుతుందా. పెళ్లి అయింది కానీ, ఇప్పటివరకు మొదటి రాత్రి జరగలేదు. ఆ పొట్టిది కనీసం నా కొడుకును చేయి కూడా వేయనివ్వట్లేదు అని ధాన్యలక్ష్మీ అంటుంది. నా ప్రాబ్లమ్‌కు నా దగ్గర సొల్యూషన్ ఉంది. నేను చెప్పినట్లు చేస్తే నీకు వారసుడు పుట్టడమే కాదు అప్పును జాబ్ లోనుంచి కూడా తీసేయొచ్చు. ఇంట్లోనే పర్మినెంట్‌గా ఉండేలా చేయొచ్చు అని రుద్రాణి అంటుంది.

ఏంటది అని ధాన్యలక్ష్మీ అడుగుతుంది. వాడికి ఫస్ట్ నైట్ జరగలేదని ఇంట్లోవాళ్లందరికి చెప్పు. అంటే వాళ్ల మొదటి రాత్రికి ముహుర్తం పెట్టు. అప్పుడు ఫస్ట్ నైట్ పూర్తి అయ్యి అప్పు కడుపులో కాయో పండో పడిందనుకో కడుపుతో ఉన్న మనిషి జాబ్ చేయకు అని రూల్ పెట్టు. బిడ్డ పుట్టాక సంవత్సరం తర్వాత వాడి భవిష్యత్ కోసం ఇంట్లోనే ఉండని బ్లాక్ మెయిల్ చేశావనుకో పర్మనెంట్‌గా ఉండిపోతుంది అని రుద్రాణి అంటుంది.

అప్పు, స్వప్న సెటైర్లు

ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. రేపే వాళ్ల శోభనానికి ముహుర్తం పెట్టిస్తానని ధాన్యలక్ష్మీ వెళ్లిపోతుంది. ఇందిరాదేవి చెప్పిన రాజ్ ప్రపోజ్ గురించి కావ్య ఆలోచిస్తుంది. యామినికి తెలిస్తే ఏదో ఒక గొడవ చేస్తుంది. ఎలా అడ్డుకోవాలని అనుకుంటుంది కావ్య. ఇంతలో అప్పు, స్వప్న వస్తారు. రాజ్ దూరంగా ఉండటంపై సెటైర్లు వేస్తారు. రేపు బావ వచ్చి ప్రపోజ్ చేస్తారంట కదా. ఇకా అంతా రొమాన్సే కదు అని అప్పు అంటుంది.

యామిని గురించి ఏం ఆలోచించకు అని చెబుతారు. పెళ్లయిన తర్వాత మొగుడిని నీ వెంట తిప్పించుకుంటూ. ప్రపోజ్ చేయించుకుంటున్నావ్. అదృష్టమంటే నీదేనే అని స్వప్న అంటుంది. రాజ్ ప్రపోజ్ చేశాక ఏం చేస్తావ్. ముద్దు పెడతావా, గట్టిగా హగ్ చేసుకుంటావా అని ఇద్దరు అనేసరికి మీకు సిగ్గు లేదు అని వెళ్లిపోయి బెడ్‌మీద పడుతుంది కావ్య. రాజ్, కావ్య ఒకరినొకరు ఊహల్లో మాట్లాడుకుంటారు.

మీరు ఒప్పుకుంటే యామినికి చెప్పేసి నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఎవరు లేని చోటకు వెళ్లిపోదాం. మనమధ్య ఎవరు ఉండకూడదు అని రాజ్ అనుకుంటాడు. ఇలా ఒకరినొకరు లవ్ ప్రపోజ్, తర్వాత ఏం చేయడం అనేది ఊహల్లో అనుకుంటారు. మరోవైపు రాహుల్ వచ్చి స్వప్న ఫ్రెష్ అవుతుందనుకుంటా.

ఒరిజనల్‌కి బదులు

ఇదే కరెక్ట్ టైమ్ అని స్వప్న ఒరిజినల్ రవ్వల నెక్లెస్‌కు బదులు డూప్లికేట్ పెడతాడు. అప్పుడే స్వప్న అటుగా వస్తుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024