ఓటీటీలోకి మరో 5 రోజుల్లో నాని హిట్ 3.. రేపటి నుంచే సల్మాన్-రష్మిక మందన్నా సికందర్ స్ట్రీమింగ్.. 2 ఒకేదాంట్లో రిలీజ్!

Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి మరో 5 రోజుల్లో నాని హిట్ 3.. రేపటి నుంచే సల్మాన్-రష్మిక మందన్నా సికందర్ స్ట్రీమింగ్.. 2 ఒకేదాంట్లో రిలీజ్!

Sanjiv Kumar HT Telugu

ఓటీటీలోకి నేచురల్ స్టార్ నాని హిట్ 3 మూవీతోపాటు సల్మాన్ ఖాన్, రష్మిక మందన్నా సికందర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. మరో ఐదు రోజుల్లో హిట్ ది థర్డ్ కేస్ ఓటీటీ రిలీజ్ కానుండగా.. రేపటి నుంచే సికందర్ ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది. రెండు ఒకే ఓటీటీ ప్రీమియర్ కానున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

ఓటీటీలోకి మరో 5 రోజుల్లో నాని హిట్ 3.. రేపటి నుంచే సల్మాన్-రష్మిక మందన్నా సికందర్ స్ట్రీమింగ్.. 2 ఒకేదాంట్లో రిలీజ్!

ఒకే ఒటీటీలోకి రెండు క్రేజీ సినిమాలు హిట్ 3, సికందర్ డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీగా ఉన్నాయి. ఈ రెండింట్లో స్టార్ హీరోలు, హీరోయిన్స్ నటించారు. అయితే, వీటిలో ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలవగా.. మరో మూవీ మాత్రం థియేటర్లలో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఒకే ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నా హిట్ ది థర్డ్ కేస్, సికందర్ డిజిట్ ప్రీమియర్ విశేషాలు ఇక్కడ చూద్దాం.

మోస్ట్ వయోలెంట్

నేచురల్ స్టార్ నాని నటించిన మోస్ట్ వయెలెంట్ ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా హిట్ 3. హిట్ ఫ్రాంచైజీలో మూడో సినిమాగా వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అర్జున్ సర్కార్‌గా నాని చేయగా ఆయనకు జోడీగా కన్నడ ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది.

సైంధవ్ వంటి ప్లాప్ తర్వాత డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన హిట్ 3 మూవీని నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మాతలుగా నిర్మించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన హిట్ ది థర్డ్ కేస్ సినిమా మే 1న థియేటర్లలో విడుదలైంది. సుమారు రూ. 60-65 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన హిట్ 3 బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ. 114 కోట్లు కలెక్షన్స్ రాబట్టి సూపర్ హిట్‌గా నిలిచింది.

హిట్ 3 ఓటీటీ రిలీజ్

అలాంటి హిట్ 3 ఓటీటీలోకి వచ్చేయనుంది. మరో ఐదు రోజుల్లో హిట్ 3 ఓటీటీ రిలీజ్ కానుంది. మే 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో హిట్ 3 ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ స్ట్రీమింగ్ డేట్ మెన్షన్ చేస్తూ పెట్టింది.

తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం వంటి భాషల్లో కూడా హిట్ 3 డిజిటల్ ప్రీమియర్ అయ్యే అవకాశం ఉంది. అయితే, మే 1న థియేటర్లలో విడుదలైన హిట్ 3 మంచి విజయం సాధించి కూడా నెల రోజులు కాకుండానే ఓటీటీ రిలీజ్ కావడం విశేషం.

చాలా గ్యాప్ తర్వాత

ఇక ఇదే నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్న మరో సినిమా సికందర్. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరో హీరోయిన్స్‌గా నటించిన సికందర్ సినిమాకు క్రేజీ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. చాలా గ్యాప్ తర్వాత మురుగదాస్ డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో సినిమా చాలా స్పెషల్‌గా మారింది.

కాజల్ అగర్వాల్ కూడా మరో హీరోయిన్‌గా నటించిన సికందర్ మూవీలో బాహుబలి కట్టప్ప ఫేమ్ సత్యరాజ్, సునీల్ శెట్టి విలన్ రోల్ చేశారు. అయితే, మార్చి 30న థియేటర్లలో విడుదలైన సికందర్ బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. యావరేజ్‌గా నిలిచిన సికందర్ ఓటీటీలోకి వచ్చేయనుంది.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో

నెట్‌ఫ్లిక్స్‌లో రేపటి నుంచే సికందర్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఆదివారం (మే 25) సికందర్ ఓటీటీ రిలీజ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తన ప్లాట్‌ఫామ్ వేదికగా తెలిపింది. కేవలం హిందీలోనే కాకుండా తెలుగు, ఇతర సౌత్ భాషల్లో సికందర్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని సమాచారం.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024