ఓటీటీలో సూపర్ సక్సెస్.. థియేటర్లలోకి తెలుగు సినిమా

Best Web Hosting Provider In India 2024

ఓటీటీలో సూపర్ సక్సెస్.. థియేటర్లలోకి తెలుగు సినిమా

అనగనగా సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఓటీటీలో సూపర్ సక్సెస్ అయ్యాక సిల్వర్ స్క్రీన్‍పైకి కూడా రానుంది. పరిమిత థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుంది.

ఓటీటీలో సూపర్ సక్సెస్.. థియేటర్లలోకి తెలుగు సినిమా

సాధారణంగా థియేటర్లలో రిలీజయ్యాక సినిమాలు.. ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వస్తుంటాయి. అయితే, అక్కినేని హీరో సుమంత్ ప్రధాన పాత్ర పోషించిన ‘అనగనగా’ సినిమా డిఫరెంట్ రూట్ పట్టింది. ఓటీటీలో ఈ చిత్రానికి భారీగా సక్సెస్ దక్కింది. అంచనాలకు మించి వ్యూస్ వచ్చాయి. ఈ తరుణంలో అనగనగా సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తోంది మూవీ టీమ్.

ఓటీటీలో సూపర్ సక్సెస్

అనగనగా సినిమా మే 15వ తేదీన ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ సినిమా ముందు నుంచి భారీ వ్యూస్ సాధిస్తోంది. ఇప్పటికే 200 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాల మైల్‍స్టోన్ కూడా దాటేసింది. అంచనాలకు మించి సక్సెస్ దక్కించుకుంది. ఇంకా ఓటీటీలో జోరు చూపిస్తోంది. ఈ తరుణంలో థియేటర్లలోకి వచ్చేస్తోంది.

నేడే థియేటర్లలో..

విజయవాడ, వైజాగ్‍ల్లో నేటి (మే 24) సాయంత్రం అనగనగా సినిమాకు కొన్ని షోలు ఉన్నాయి. థియేటర్లలోకి ఈ సినిమా అడుగుపెట్టనుంది. ఈ పెయిడ్ ప్రీమియర్లకు వచ్చే రెస్పాన్స్ చూసి.. మరిన్ని చోట్ల రిలీజ్ చేసే ఆలోచన చేయాలని మూవీ టీమ్ అనుకుంటోంది.

ఫ్రీ టికెట్స్.. కానీ..

అనగనగా సినిమాకు వైజాగ్‍లో నేటి షోకు 300 టికెట్లను ఫ్రీగా ఇవ్వనున్నట్టు ఈటీవీ విన్ ప్రకటించింది. ఇందుకు ఓ గూగుల్ ఫామ్ కూడా ట్విట్టర్ అకౌంట్‍లో పోస్ట్ చేసింది. కానీ 300 టికెట్లే ఉచితంగా పెట్టడంతో అవి త్వరగా ఫిల్ అయ్యే ఛాన్స్ ఉంది.

విద్యావ్యవస్థలోని లోపాలపై..

కార్పొరేట్ విద్యావ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ అనగనగా సినిమా సాగుతుంది. మార్కులే లక్ష్యంగా, పోటాపోటీగా ఎలా విద్యాబోధన సాగుతోందనే అంశం ఈ మూవీలో ఉంటుంది. పిల్లలకు ఇష్టమైన, అర్థమయ్యే రీతిలో సరైన విద్య నేర్పించాలని ప్రయత్నించే ఉపాధ్యాయుడిగా ఈ చిత్రంలో నటించారు సుమంత్. తండ్రీకొడుకుల సెంటిమెంట్ కూడా ఈ మూవీలో బలంగా ఉంటుంది. ఈటీవీ విన్‍లో వచ్చిన ఈ మూవీ భారీగా ప్రశంసలు దక్కించుకుంటోంది.

అనగనగా సినిమాకు సన్నీ సంజయ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సుమంత్‍తో పాటు కాజల్ చౌదరి, మాస్టర్ విహర్ష్, శ్రీనివాస్ అవసరాల, అనుహాసన్, రాకేశ్ రాచకొండ కౌముది నేమని కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి చందు రవి సంగీతం అందించారు.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024