రవితేజ కృష్ణ మూవీ విలన్ ముకుల్ దేవ్ కన్నుమూత.. ప్రభాస్, నాగార్జునతోపాటు తెలుగులో నటించిన సినిమాలు ఇవే!

Best Web Hosting Provider In India 2024

రవితేజ కృష్ణ మూవీ విలన్ ముకుల్ దేవ్ కన్నుమూత.. ప్రభాస్, నాగార్జునతోపాటు తెలుగులో నటించిన సినిమాలు ఇవే!

Sanjiv Kumar HT Telugu

మాస్ మహారాజా రవితేజ, త్రిష నటించిన కృష్ణ మూవీ విలన్ ముకుల్ దేవ్ కన్నుమూశారు. హిందీ, పంజాబీ, టాలీవుడ్ సినిమాలతోపాటు బుల్లితెరపై అలరించిన ముకుల్ దేవ్ మాజీ మోడల్. 54 ఏళ్ల వయసులో కన్నుమూసిన ముకుల్ దేవ్ మరణానికి కారణాలు తెలియరాలేదు.

రవితేజ కృష్ణ మూవీ విలన్ ముకుల్ దేవ్ కన్నుమూత.. ప్రభాస్, నాగార్జునతోపాటు తెలుగులో నటించిన సినిమాలు ఇవే!

మాస్ మహారాజా రవితేజ, హీరోయిన్ త్రిష జంటగా నటించిన యాక్షన్ కామెడీ సినిమా కృష్ణ. ఈ సినిమాలో జక్కా అనే విలన్ పాత్రలో తెలుగు ప్రేక్షకుల్లో గుర్తుండిపోయారు ముకుల్ దేవ్. 54 ఏళ్ల వయసులో ముకుల్ దేవ్ కన్నుమూశారు. దీంతో బాలీవుడ్‌తోపాటు పలు సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది.

బుల్లితెరపై కూడా

హిందీతోపాటు, పంజాబీ, తెలుగు వంటి పలు దక్షిణాది చిత్రాల్లో మంచి పాత్రలతో అలరించారు ముకుల్ దేవ్. అలాగే, బుల్లితెరపై కూడా పలు విభిన్న రోల్స్ చేసి ఆకట్టుకున్నారు. అయితే, 54 ఏళ్ల వయసులో చనిపోయిన ముకుల్ దేవ్ మరణానికి కారణాలు ఇంకా తెలియరాలేదు.

నీతో గడిపిన క్షణాలు

ముకుల్ దేవ్ మరణాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఆయన సోదరుడు విందూ దారా సింగ్ ట్వీట్ చేశారు. “నా సోదరుడి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. నీతో గడిపిన క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. సన్ ఆఫ్ సర్దార్ 2తో ఆడియెన్స్‌కు వినోదాన్ని పంచి, వారిని నవ్వించిన సినిమా” అని ముకుల్ దేవ్ సోదరుడు రాసుకొచ్చారు.

చాలా అద్భుతమైన వ్యక్తి

ముకుల్ దేవ్ మరణాన్ని ధృవీకరిస్తూ ఇండియా టుడేతో మాట్లాడారు ఆయన సోదరుడు విందూ దారా సింగ్. “తన తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ముకుల్ నా వద్దే ఉంటున్నాడు. అప్పుడప్పుడు ఎవరినైనా కలిసేవాడు. గత కొన్ని రోజులుగా ముకుల్ ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. నా సోదరుడిని ప్రేమించిన ప్రతి ఒక్కరికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ముకుల్ చాలా అద్భుతమైన వ్యక్తి. మేమంతా కచ్చితంగా ముకుల్‌ని మిస్ అవుతాం” అని విందూ సింగ్ చెప్పారు.

టీవీ సీరియల్‌తో కెరీర్ ప్రారంభం

ఇదిలా ఉంటే, ముకుల్ దేవ్ 17 సెప్టెంబరు 1970 న్యూఢిల్లీలో జన్మించారు. హిందీ, పంజాబీ, తెలుగు, తమిళం, కన్నడ, బెంగాలీ, మలయాళ చిత్రాలతో పాటు టెలివిజన్ సీరియల్స్‌లో ముకుల్ దేవ్ నటించారు. 1996లో ముంకిన్ అనే టీవీ సీరియల్‌తో ముకుల్ దేవ్ తన కెరీర్‌ను ప్రారంభించారు.

ముకుల్ దేవ్ హిందీ సినిమాలు

అదే సంవత్సరం దస్తక్‌లో సుస్మితా సేన్‌తో కలిసి యాక్ట్ చేశారు ముకుల్ దేవ్. హిందీలో యమ్లా పగ్లా దీవానా, సన్ ఆఫ్ సర్దార్, ఆర్.. రాజ్ కుమార్, జై హో వంటి సినిమాల్లో నటించారు.

ముకుల్ దేవ్ తెలుగు మూవీస్

ముకుల్ దేవ్ రవితేజ కృష్ణ సినిమాతోపాటు నిప్పు, ప్రభాస్ ఏక్ నిరంజన్, జగపతి బాబు సిద్ధం, నేనే కేడీ నెం 1, జేడీ చక్రవర్తి మనీ మనీ మోర్ మనీ, నాగార్జున భాయ్, తనీష్ దేశదిమ్మరి వంటి మూవీస్‌లో నటించారు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024