రెండేళ్ల క్రితం టీజర్ రిలీజ్.. ఇప్పుడు థియేటర్లలోకి.. ఎట్టకేలకు విడుదలకు నోచుకున్న అనసూయ మైథలాజికల్ థ్రిల్లర్ అరి!

Best Web Hosting Provider In India 2024

రెండేళ్ల క్రితం టీజర్ రిలీజ్.. ఇప్పుడు థియేటర్లలోకి.. ఎట్టకేలకు విడుదలకు నోచుకున్న అనసూయ మైథలాజికల్ థ్రిల్లర్ అరి!

Sanjiv Kumar HT Telugu

అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శుభలేఖ సుధాకర్ వంటి యాక్టర్స్ నటించిన మైథలాజికల్ థ్రిల్లర్ సినిమా అరి. రెండేళ్ల క్రితం అంటే 2023లో అరి మూవీ టీజర్ రిలీజ్ అయింది. అప్పటి నుంచి అరి థియేట్రికల్ రిలీజ్ కోసం కష్టాలు పడుతుంది. తాజాగా మాత్రం అరి రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.

రెండేళ్ల క్రితం టీజర్ రిలీజ్.. ఇప్పుడు థియేటర్లలోకి.. ఎట్టకేలకు విడుదలకు నోచుకున్న అనసూయ మైథలాజికల్ థ్రిల్లర్ అరి!

యాంకర్‌గా మంచి పాపులారిటీ తెచ్చుకున్న అనసూయ వరుస సినిమాలతో సత్తా చాటుతోంది. పుష్ప 2, రజాకార్ వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన ఈ మాజీ యాంకర్ నటించిన లేటెస్ట్ మూవీనే అరి. సైకో మైథలాజికల్ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో అనసూయతోపాటు సాయి కుమార్, శుభలేఖ సుధాకర్ వంటి ప్రముఖులు నటించారు.

రెండేళ్లకు పైగా

పేపర్ బాయ్ మూవీతో పేరు తెచ్చుకున్న డైరెక్టర్ జయ శంకర్ అరి సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే, అరి సినిమా మొదలుపెట్టి రెండేళ్లకుపైగా అవుతోంది. రెండేళ్ల క్రితం అంటే 2023 మార్చిలో అరి టీజర్‌ను రిలీజ్ చేశారు. అరి టీజర్ చాలా బాగా ఆకట్టుకుంది. ఒక్కో పాత్ర ఒక్కో దురాశ గురించి చెబుతూ ఇంటెన్సివ్‌గా కనిపించింది.

ఎన్నో అవంతరాలు దాటి

దాంతో అరి మూవీ రిలీజ్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. కానీ, అప్పటి నుంచి ఇప్పటివరకు అరి థియేట్రికల్ రిలీజ్‌కు నోచుకోలేదు. ఎన్నో అవంతరాలు దాటి ఇప్పుడు థియేటర్లలోకి అడుగుపెట్టబోతుంది అరి మూవీ. గతేడాదే థియేటర్లలో రిలీజ్ కావాల్సిన అరి వాయిదా పడింది. అంతేకాకుండా ఈ సంవత్సరం కూడా ఇదే మే నెలలో ఒకసారి పోస్ట్‌పోన్ అయింది ఈ సినిమా.

నాగ్ అశ్విన్‌తో ప్రమోషన్స్

మొదటగా మే 9న అరి మూవీ రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ, కాలేదు. దాంతో కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో అరి మూవీని ప్రమోట్ చేయించారు. ఇక ఇప్పుడు అరి మూవీ రిలీజ్ డేట్ అంటూ మరో తేదిని మేకర్స్ అనౌన్స్ చేశారు. మే 30న అరి థియేట్రికల్ రిలీజ్‌కు రెడీగా ఉందంటూ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్.

మే 30న అరి రిలీజ్

ఎలాంటి అవంతరాలు లేకుండా మే 30న థియేటర్లలో అరి ప్రదర్శించనున్నట్లు మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. ఇదిలా ఉంటే, ఈ చిత్రంలో అనసూయ, సాయి కుమార్, శుభలేఖ సుధాకర్‌తోపాటు వినోద్‌ వర్మ, సూర్య పురిమెట్ల, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ ఇతర కీలక పాత్రలు పోషించారు.

అరిపై ప్రశంసలు

అర్వీ రెడ్డి సమర్పణలో శ్రీనివాస్‌ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి అరి సినిమాను నిర్మించారు. రీసెంట్‌గా ప్రమోషన్స్‌లో భాగంగా అరి మూవీని ప్రదర్శించారు. అరి వీక్షించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మఠాధిపతులు, స్వామిజీలు ప్రశంసలు కురిపించారు.

నేటి తరానికి చాలా ముఖ్యం

భగవద్గీతలోని సారాన్ని అరి చిత్రంలో అద్భుతంగా చూపించారని చెప్పారు. అరిషడ్వర్గాల మీద తీసిన అరి మూవీ ఇప్పటి తరానికి చాలా ముఖ్యమని, సినిమా అద్భుతంగా ఉందని స్పెషల్ షోని చూసిన వారంతా పొగిడారు. మరి మే 30న థియేట్రికల్ రిలీజ్ తర్వాత అరి ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024