





Best Web Hosting Provider In India 2024

ఈ సినిమా నన్నెంతో ఏడిపించింది, విద్యా వ్యవస్థ మారాలనిపించేలా చేసింది: ఓటీటీ తెలుగు మూవీపై హీరో అడివి శేష్ కామెంట్స్
ఓటీటీలో సక్సెస్‌ఫుల్‌గా స్ట్రీమింగ్ అవుతోన్న తెలుగు ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా సినిమా అనగనగాను థియేటర్లలో కూడా విడుదల చేయనున్నారు. అనగనగా విజయవంతం అయిన సందర్భంగా మే 24న సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు హాజరైన హీరో అడవి శేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ఓటీటీలోకి ఎన్నో సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చిన వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకుల మదిలో ముద్ర వేసుకుంటాయి. అలాగే, సాధారణంగా థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్కు వస్తాయి సినిమాలు. కానీ, కొన్నిసార్లు ఆడియెన్స్ రెస్పాన్స్‌ను బట్టి ముందు డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ తర్వాత కూడా థియేటర్లలో విడుదల అవుతుంటాయి.
హీరో సుమంత్ ప్రధాన పాత్రలో
అలాంటి తెలుగు మూవీనే అనగనగా. హీరో సుమంత్ ప్రధాన పాత్రలో నటించిన తెలుగు ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా చిత్రమే ఈ అనగనగా. సన్నీ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా అనగనగా పేరు తెచ్చుకుంది. కాజల్ చౌదరి హీరోయిన్గా, చైల్డ్ ఆర్టిస్ట్ విహర్ష్ కీలక పాత్ర చేసిన ఈ సినిమాను రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్రా మదిరెడ్డి నిర్మించారు.
మే 15న ఓటీటీ రిలీజ్
మే 15న ఈటీవీ విన్లో అనగనగా ఓటీటీ రిలీజ్ అయింది. ఈటీవీ విన్లో ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చిన అనగనగా మంచి రెస్పాన్స్ అందుకుంటూ మిలియన్ల కొద్ది వ్యూస్ దక్కించుకుంది. ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌తో అనగనగాను థియేటర్లలో కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్.
అనగనగా సక్సెస్ సెలబ్రేషన్స్
ఇక ఓటీటీ వేదిక ఈటీవీ విన్లో రిలీజ్ అయిన అనగనగా సినిమా అందరినీ ఆకట్టుకొని ఘన విజయాన్ని సాధించిన సందర్భంగా మేకర్స్ సక్సెస్ సెలబ్రేషన్‌ని నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో అడవి శేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ఫ్యామిలీ వేడుకలా
హీరో అడివి శేషు మాట్లాడుతూ.. “అందరికి నమస్కారం. ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక ఫ్యామిలీ వేడుకలా అనిపిస్తుంది. నా ఫస్ట్ సినిమాకి సుమంత్ గెస్ట్‌గా వచ్చారు. ఆయన అప్పటినుంచి నాకు ఫ్యామిలీనే. ఈ చిత్రంలో వ్యాస్ పాత్రను సుమంత్ అంత బాగా చేయడానికి కారణం ఆయన నిజ జీవితంలోనూ చాలా వరకూ అలా ఉండటమే” అని అన్నాడు.
థియేటర్లో కదా చూడాల్సింది
“సన్నీ సంజయ్ ఈ కథను అద్భుతంగా తెరకెక్కించారు. నాకు ఈ సినిమా చూస్తున్నంత సేపూ దీన్ని థియేటర్లో కదా చూడాల్సింది అని అనిపించింది. ఈ చిత్రంలో రామ్ పాత్ర నాతో కూడా కంటతడి పెట్టించింది. ఈ సినిమా నన్నెంత ఏడిపించిందో.. అంతే నవ్వించింది.. ప్రేమలో పడేసింది. విద్యా వ్యవస్థ మారాలని కోరుకునేలా చేయించింది” అని హీరో అడివి శేష్ తెలిపాడు.
సినిమా కాదు జీవితం
“ఇది ఏడుపుగొట్టు సినిమా కాదు. కానీ, కన్నీళ్లు వస్తాయి. ఇది సినిమా కాదు ఒక జీవితం. ఈ సినిమా (అనగనగా) చూసినప్పటి నుంచి అద్భుతమైన సక్సెస్ అవుతుందని నమ్మాను. ఈ సినిమాని మీ ఇంటిళ్లపాది చూడండి. కుదిరితే బిగ్ స్క్రీన్‌లో చూడండి. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా కంగ్రాచ్యులేషన్స్” అని హీరో అడివి శేష్ తన స్పీచ్ ముగించాడు.
సంబంధిత కథనం
టాపిక్