ఆ పోస్టర్‌లో మంచు మనోజ్‌ను చూసి సెలెక్ట్ చేశాం.. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కామెంట్స్.. బ్రేక్ ఇచ్చినవాళ్లమే అంటూ!

Best Web Hosting Provider In India 2024

ఆ పోస్టర్‌లో మంచు మనోజ్‌ను చూసి సెలెక్ట్ చేశాం.. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కామెంట్స్.. బ్రేక్ ఇచ్చినవాళ్లమే అంటూ!

Sanjiv Kumar HT Telugu

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ముగ్గురు కలిసి నటించిన తొలి సినిమా భైరవం. డైరెక్టర్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 30న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ఆ పోస్టర్‌లో మంచు మనోజ్‌ను చూసి సెలెక్ట్ చేశాం.. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కామెంట్స్.. బ్రేక్ ఇచ్చినవాళ్లమే అంటూ!

టాలీవుడ్ హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ తొలిసారిగా కలిసి నటించిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ త్రిల్లర్ మూవీ భైరవం. ఈ సినిమా టీజర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్‌ అద్భుత స్పందనతో, పాజిటివ్ బజ్‌తో ముందుకు దూసుకెళ్తోంది.

నాంది, ఉగ్రం సినిమాల డైరెక్టర్

నాంది, ఉగ్రం వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన విజయ్ కనకమేడల భైరవం మూవీకి దర్శకత్వం వహించారు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ ఈ సినిమాను భారీగా నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గాడా సమర్పించారు.

భైరవం రిలీజ్ డేట్

భైరవం మూవీ మే 30న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో సినీ విశేషాలు పంచుకున్నాడు. మంచు మనోజ్, నారా రోహిత్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ఈ సినిమాకి దర్శకుడిగా విజయ్ గారిని ఎంచుకోవడానికి కారణం?

-నాకు కమర్షియల్ హీరోగా మంచి పేరు వచ్చింది. తర్వాత కొన్ని స్టైలిష్ సినిమాలు చేయడం జరిగింది. అప్పుడు మాస్ కనెక్ట్ అవుతున్నారా లేదా అనే ఆలోచన ఉండేది. అందరూ రిలేట్ చేసుకునే ఒక రూరల్ స్టోరీ చేయాలని ఉండేది. అలాంటి సినిమా కోసం చూస్తున్నప్పుడు ఈ కథ దొరికింది. ఈ కథని మన సెన్సిబిలిటీస్‌కి తగ్గట్టు ప్రజెంట్ చేసే గల దర్శకుడు విజయ్ గారు అనిపించింది.

-నేను కూడా కొన్ని రీమిక్స్ చేశాను. వాటి నుంచి నేర్చుకున్నాను. రాక్షసుడు నాకు మంచి సక్సెస్ ఇచ్చిన సినిమా. భైరవం రీమేక్‌లా కాకుండా స్ట్రైట్ సినిమా గానే చూడాలి. తెలుగు ఆడియన్స్‌కి తగ్గట్టు అన్ని మార్పులు చేసి చాలా అద్భుతంగా సినిమాని డైరెక్టర్ తీర్చిదిద్దారు. ఇది అందరూ రిలేట్ అయ్యే ఎమోషన్స్‌తో ఉంటుంది.

రోహిత్, మంచు మనోజ్ క్యారెక్టర్స్ గురించి?

-నారా రోహిత్ గారు, మంచు మనోజ్ గారు ఇద్దరు కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. ముందు రోహిత్ గారిని కలిసి ఈ క్యారెక్టర్ గురించి ఆయనకు చెప్పిన వెంటనే అంగీకరించారు. తర్వాత మిరాయ్ పోస్టర్‌లో మనోజ్ గారిని చూసి ఆ క్యారెక్టర్‌కి మనోజ్ గారు అయితే బాగుంటుందని ఆయనని సంప్రదించాం. ఆయనకు కూడా కథ నచ్చింది. ఈ కథకి వారిద్దరూ పర్‌ఫెక్ట్‌గా మ్యాచ్ అయ్యారు. ఈ కథకి ఇద్దరు కూడా చాలా ఎగ్జైట్ అయ్యారు.

-ఈ సినిమాకి అందరూ కూడా చాలా ఫ్రెష్ కాస్టింగ్ కుదిరింది. నేను మనోజ్ గారు, నారా రోహిత్ గారు సినిమాలకి కొంతకాలంగా బ్రేక్ ఇచ్చిన వాళ్లమే. నా సినిమా వచ్చి దాదాపు నాలుగు ఏళ్లు అవుతుంది. అలాగే రోహిత్ గారు, మనోజ్ గారు కూడా బ్రేక్‌లో ఉన్నారు. ఇందులో క్యారెక్టర్స్‌ని చూస్తున్నప్పుడు తప్పకుండా అందరూ చాలా ఫ్రెష్‌గా ఫీల్ అవుతారు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024