





Best Web Hosting Provider In India 2024

నేనెప్పుడు ఒకే జోనర్ సినిమా చేయను.. చిరంజీవి, ఎన్టీఆర్, మహేశ్ బాబు మూవీస్‌పై డైరెక్టర్ గుణశేఖర్ కామెంట్స్
టాలీవుడ్‌లో క్రేజీ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న గుణశేఖర్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ యుఫోరియా. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కించిన యుఫోరియా నుంచి ఫ్లై హై సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఫ్లై హై సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో చిరంజీవి, ఎన్టీఆర్, మహేశ్ బాబు సినిమాలపై గుణశేఖర్ కామెంట్స్ చేశారు.
తెలుగులో మోస్ట్ క్రేజీ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు గుణశేఖర్. ఇప్పుడు లేటెస్ట్‌గా గుణశేఖర్ దర్శకత్వం వహించిన సినిమా యుఫోరియా. గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద నీలిమ గుణ నిర్మాణంలో నూతన నటీనటులతో గుణ శేఖర్ ఈ సినిమాను తెరకెక్కించారు.
యుఫోరియా నటీనటులు
ఓ ట్రెండీ టాపిక్ మీద తెరకెక్కిన యుఫోరియా మూవీలో సీనియర్ హీరోయిన్ భూమిక చావ్లా, సారా అర్జున్, నాసర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత యలమంచలి, అడ్డాల పృథ్వీరాజ్, కల్ప లత, సాయి శ్రీనికా రెడ్డి, అశ్రిత వేముగంటి, మాథ్యూ వర్గీస్, ఆదర్శ్ బాలకృష్ణ, రవి ప్రకాష్, నవీనా రెడ్డి, లికిత్ నాయుడు ముఖ్య పాత్రలు పోషించారు.
ఫ్లై హై సాంగ్ రిలీజ్
శనివారం నాడు (మే 24) యుఫోరియా మూవీ నుంచి ఫ్లై హై అనే ఫస్ట్ సింగిల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా ఏఎంబీలోని శరత్ సిటీ మాల్‌లో యుఫోరియా ఫ్లై హై సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో చిరంజీవి, ఎన్టీఆర్, మహేశ్ బాబు సినిమాలపై డైరెక్టర్ గుణ శేఖర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఇంకో మూడు పాటలు కూడా
దర్శకుడు గుణ శేఖర్ మాట్లాడుతూ .. “ఆడియెన్స్ చూపించే ఎనర్జీయే యుఫోరియా. ఇదే ఎనర్జీ సినిమాలోనూ ఉంటుంది. ఈ ‘ఫ్లై హై’లానే ఇంకో మూడు పాటలు ఉంటాయి. అన్నీ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. కాళ భైరవ అద్భుతమైన పాటలు ఇచ్చారు” అని అన్నారు.
హీరో, విలన్‌ను ఆశీర్వదించాలి
“కంప్లీట్ యూత్‌ఫుల్ బ్యాక్ డ్రాప్‌తో ఈ మూవీని తీస్తున్నాను. మా హీరో విఘ్నేశ్, మా విలన్ పృథ్వీని అందరూ ఆశీర్వదించాలి. నా ఫ్యామిలీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. మా పాటల్ని ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేస్తున్నాం. ఆడియెన్స్‌ను ఏ మాత్రం ఈ సినిమా నిరాశపరచదని భావిస్తున్నాను. అందరికీ మా సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను” అని దర్శకుడు గుణశేఖర్ తెలిపారు.
ఒకే బ్యాక్‌డ్రాప్‌లో ఉండవు
“నేను ఎప్పుడు ఏ సినిమా చేసినా ఒకే జోనర్, ఒకే బ్యాక్ డ్రాప్‌లో ఉండవు. నాకు నచ్చిన కథల్ని ఎప్పుడూ కొత్తగా ప్రయత్నిస్తూనే వచ్చాను. అలా చిరంజీవి గారితో ‘చూడాలని వుంది’ అని చేసినా, జూనియర్ ఎన్టీఆర్‌తో ‘రామాయణం’ చేసినా, మహేశ్ బాబుతో ‘ఒక్కడు’ చేసినా నన్ను ఆశీర్వదిస్తూ వచ్చారు” అని గుణశేఖర్ పేర్కొన్నారు.
నా ఫ్యామిలీ చాలా నమ్మింది
“ఈ ‘యుఫోరియా’ కథను నేను, నా ఫ్యామిలీ చాలా నమ్మింది. అందుకే నేను ఈ మూవీని తీశాను. మా చిత్రం అందరికీ నచ్చుతుందని, ఆడియెన్స్‌ను మెప్పిస్తుందని చెబుతున్నా” అని యుఫోరియా డైరెక్టర్ గుణశేఖర్ చెప్పుకొచ్చారు.
సంబంధిత కథనం