




Best Web Hosting Provider In India 2024

ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం.. విజయసాయి రెడ్డి టీడీపీ కీలక నేతతో నిజంగానే భేటీ అయ్యారా?
రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ వ్యవహారంపై వేగంగా దర్యాప్తు జరుగుతోంది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారిని అధికారులు ప్రశ్నించారు. వారిలో విజయసాయి రెడ్డి కూడా ఉన్నారు. అయితే.. ఆయన విచారణకు హాజరయ్యే ముందు టీడీపీ కీలక నేతతో భేటీ అయ్యారనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది.
లిక్కర్ స్కామ్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందం దూకుడుగా వెళ్తోంది. ఇప్పటికే గత ప్రభుత్వంలో కీలక వ్యవహరించిన నాయకులు, అధికారులను ప్రశ్నించింది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సహా మరికొందరిని అరెస్టు చేసింది. అంతకుముందు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. తాజాగా విజయసాయికి సంబంధించి సంచలన విషయం టాక్ ఆఫ్ ది ఏపీగా మారింది.
టీడీ జనార్ధన్‌తో భేటీ..
లిక్కర్ స్కామ్ కేసులో సిట్ విచారణకు హాజరు కాబోయే ముందు రోజు సాయంత్రం.. విజయసాయి రెడ్డి తెలుగుదేశం పార్టీ కీలక నేత టీడీ జనార్ధన్‌ను కలిసినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. టీడీ జనార్ధన్, విజయసాయి రెడ్డి ఒకరి వెంట ఒకరు.. ఒక ఇంట్లోకి వెళ్లడం, ఆ తర్వాత ఎవరికి వారుగా బయటకు వచ్చి వేర్వేరు కార్లలో వెళ్లడానికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
45 నిమిషాల పాటు సమావేశం..
మార్చి 11 సాయంత్రం 5:49 గంటలకు విజయసాయి రెడ్డి.. తాడేపల్లిలోని పార్క్ విల్లేలో.. విల్లా నెం. 27లోకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ విల్లా ప్రముఖ నిర్మాత ఆది శేషగిరిరావుదని సమాచారం. విజయసాయి రెడ్డి లోపలికి వెళ్లిన కొద్ది సేపటికి.. టీడీ జనార్ధన్ అదే విల్లాలోకి వెళ్లారు. సుమారు 45 నిమిషాల పాటు వారిద్దరూ ఆ ఇంట్లోనే భేటీ అయినట్టు ప్రచారం జరుగుతోంది. సాయంత్రం 6:50 గంటలకు విజయసాయి రెడ్డి బయటకు రాగా.. ఆ వెంటనే జనార్ధన్ కూడా విల్లా నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించి సీసీ టీవీ ఫుటేజీ అంటూ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
భేటీపై అనుమానాలు..
లిక్కర్ స్కామ్ కేసు విచారణకు హారజరు కావడానికి కొన్ని గంటలు ముందు ఈ భేటీ జరగడం పలు అనుమానాలకు దారితీస్తోందని.. వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ భేటీ జరిగిన కొన్ని గంటలు తరువాత.. విజయసాయి రెడ్డి సీఐడీ విచారణకు హాజరైనట్టు తెలుస్తోంది. విచారణ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు.
సంబంధిత కథనం
టాపిక్