





Best Web Hosting Provider In India 2024

రోళ్లు పగలని రోహిణి కార్తె, అకాల వర్షాలతో భిన్న వాతావరణం
నేటి నుంచి రోహిణి కార్తె ప్రారంభం అయింది. రోహిణి కార్తె అంటే రోళ్లు పగిలే ఎండలు ఉంటాయని నానుడి. కానీ ఈ ఏడాది భిన్న వాతావరణం నెలకొంది. రోహిణి కార్తెలో అకాల వర్షాలు కురుస్తున్నాయి.
నేటి నుంచి రోహిణి కార్తె ప్రారంభం అయింది. రోహిణి కార్తె అంటే రోళ్లు పగిలే ఎండలు ఉంటాయి. కానీ ఈ ఏడాది అందుకు భిన్నంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈసారి వేసవికాలం ఎండలు తక్కువ వర్షాలు ఎక్కువగా మారింది. ఎండకాలం ప్రారంభం నుంచి క్రమం తప్పకుండా కురుస్తున్న వర్షాలే ఇందుకు నిదర్శనం.
రోళ్లు పగలని రోహిణి కార్తె
రోహిణి కార్తెలో రోళ్లు పగిలేలా ఎండలు ఉంటాయని నానుడి. కానీ ఈ ఏడాది చాలా ముందుగా నైరుతి రుతుపవనాలు కేరళను తాకడంతో వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. ముందస్తుగానే వర్షాలు మొదలవ్వడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆ తర్వాత వర్షాలు పడతాయో లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ ఏడాది వర్షాలు అధికంగా కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
రోహిణి కార్తెలో అకాల వర్షాలు
రోహిణికార్తె అంటే సూర్యభగవానుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించాడని చెబుతారు. ఈ సమయంలో వేడి తీవ్రత అధికంగా ఉంటుంది. ఎండల తీవ్రతకు రోళ్లు, రోకళ్లు పగులుతాయని పెద్దల నానుడి. ఈ ఏడాది రోహిణి కార్తె మే 25న ప్రారంభం అయింది. ఈ ఏడాది రోహిణి కార్తెకు అకాల వర్షాలు, అల్పపీడనం కారణంగా వేసవి కాలం కాస్త వానాకాలంగా మారింది.
మారిపోతున్న కాలాలు
ఇటీవల కాలంలో…వాతావరణ పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉంటున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఎండాకాలంలో వర్షాలు, వర్షాలు కాలంలో ఎండలు…భిన్న వాతావరణం కనిపిస్తుందని చెబుతున్నారు. ఇందుకు గ్లోబల్ వార్మింగ్, వాతావరణ కాలుష్యం కారణమని వాతావరణ విశ్లేషకులు అంటున్నారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం
మంగళవారం నాటికి పశ్చిమ మధ్య, ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో రానున్న మూడు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
తీరం వెంబడి గంటకు 40-50కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటి నుంచే ఉద్యానవన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెప్పింది.
సంబంధిత కథనం
టాపిక్