





Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి ముందుగానే వచ్చేస్తున్న రూ.235కోట్ల కలెక్షన్ల సూర్య యాక్షన్ సినిమా.. అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ ఇదే
రెట్రో సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. అంచనాల కంటే ముందే స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. స్ట్రీమింగ్ డేట్‍పై అధికారికంగా కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. ఐదు భాషల్లో అందుబాటులోకి రానుంది.
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన రెట్రో చిత్రం భారీ అంచనాలతో విడుదలైంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ పీరియడ్ రొమాంటిక్ యాక్షన్ సినిమా మే 1వ తేదీన థియేటర్లలో విడుదలైంది. అయితే, ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మాత్రం హిట్ సాధించింది. సూర్య స్టార్‌డమ్‍ను ప్రూవ్ చేసింది. ఈ రెట్రో సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. డేట్ ఖరారైంది.
స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఐదు భాషల్లో..
రెట్రో సినిమా ఈవారంలోనే మే 31వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ సినిమాను ప్లాట్‍ఫామ్‍లో నెట్‍ఫ్లిక్స్ లిస్ట్ చేయడంతో అధికారికంగా కన్ఫర్మ్ అయింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలో ఈ చిత్రం మే 31న ఎంట్రీ ఇస్తుంది. థియేటర్లలో రిలీజైన నెలలోగానే ఓటీటీలోకి రెట్రో అడుగుపెట్టేస్తోంది.
అంచనాల కంటే ముందుగానే..
రెట్రో చిత్రం జూన్ తొలి వారంలో స్ట్రీమింగ్‍కు వస్తుందనే అంచనాలు బలంగా వినిపించాయి. హిట్ 3 మూవీని జూన్ 29న నెట్‍ఫ్లిక్స్ తీసుకొస్తుండటంతో.. రెట్రో వారం లేటుగా వస్తుందనే వాదనలు వినిపించాయి. అయితే, నెట్‍ఫ్లిక్స్ సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చేసింది. అంచనాల కంటే ముందుగానే రెట్రో చిత్రాన్ని స్ట్రీమింగ్‍కు తెస్తోంది. మే 31వ తేదీనే స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి తేనుంది.
రూ.235కోట్ల కలెక్షన్లు.. కానీ!
రెట్రో సినిమా రూ.235 కోట్ల కలెక్షన్లు దాటేసిందని మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది. సుమారు రూ.70కోట్లతో ఈ చిత్రం రూపొందింది. కలెక్షన్లను బట్టి చూస్తే ఈ చిత్రం భారీ బ్లాక్‍బస్టర్ అయింది. కానీ కలెక్షన్లను మూవీ టీమ్ బాగా పెంచేసి ప్రకటించిందనే సోషల్ మీడియాలో కాస్త రచ్చ నడిచింది. అయితే, మొత్తంగా మిక్స్డ్ టాక్ వచ్చినా హిట్‍గా నిలిచింది రెట్రో. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చాక ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
హైవోల్టేజ్ యాక్షన్, లవ్ స్టోరీ
రెట్రో మూవీని రొమాంటిక్ యాక్షన్ చిత్రంగా డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించారు. సూర్యకు జోడీగా పూజా హెగ్డే నటించారు. ఈ మూవీలో యాక్షన్‍తో పాటు లవ్‍స్టోరీ కూడా ప్రధానంగా ఉంటుంది. 1990ల బ్యాక్‍డ్రాప్‍లో స్టోరీ సాగుతుంది. ఈ మూవీ డోగ్లామరస్ లుక్‍తో పూజా కనిపించారు. పారివేల్ కన్నన్ అనే గ్యాంగ్‍స్టర్ పాత్రలో సూర్య యాక్షన్, యాక్టింగ్ అదరగొట్టేశారు.
రెట్రో సినిమాలో సూర్య, పూజతో పాటు జోజూ జార్జ్, నాజర్, ప్రకాశ్ రాజ్, జయరాం, కరుణాకరన్, అవినాశ్ రఘుదేవన్, రాకేశ్, కుమార్ నటరాజన్ కీరోల్స్ చేశారు. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. 2డీ ఎంటర్‌టైన్‍మెంట్స్, స్టోన్‍బీచ్ ఫిల్మ్స్ పతాకాలపై హీరో సూర్య, జ్యోతిక, కార్తికేయన్ సంతానం, రాజశేఖర్ పాండియన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
సంబంధిత కథనం