





Best Web Hosting Provider In India 2024

అడివి శేష్, మృణాల్ లవ్ స్టోరీ.. ఫస్ట్ గ్లింప్స్ కు ముందే రికార్డు.. హీరో కెరీర్ లోనే హైయ్యస్ట్
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందనడంలో సందేహం లేదు. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ తో వరుసగా హిట్లు అందుకుంటున్నాడు శేష్. దీంతో అతని లేటెస్ట్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే మూవీకి ముందుగానే రికార్డు బిజినెస్ జరుగుతోందని తెలిసింది.
అడివి శేష్ మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ఆడియన్స్ ను అలరించేందుకు వస్తున్నాడు. ఇన్ని రోజులు అతని కొత్త సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్లు రాలేదు. కానీ ఇప్పుడు ఆ ఫిల్మ్ ను పూర్తి చేసే పనిలో ఉన్న టీమ్ కాస్త జోరందుకుంది. ఇదంతా అడివి శేష్ కొత్త సినిమా ‘డెకాయిట్: ఏ లవ్ స్టోరీ’ సినిమా గురించే. తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది.
హిట్ తర్వాత
దాదాపు మూడేళ్ల తర్వాత అడివి శేష్ మరోసారి థియేటర్లకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. చివరగా 2022లో హిట్ 2 చేసిన శేష్.. అప్పటి నుంచి డెకాయిట్ సినిమా పైనే పని చేస్తున్నాడు. ఈ మూవీకి అతను రైటర్ కూడా. తెలుగుతో పాటు హిందీలోనూ ఏకకాలంలో ఈ మూవీ షూటింగ్ జరుపుకొంటోంది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయబోతున్నారు. నేడు (మే 26) గ్లింప్స్ రాబోతోంది. అయితే అంతకంటే ముందే ఈ మూవీ ఆడియో రైట్స్ గురించి ఓ క్రేజీ బజ్ వినిపిస్తోంది.
రికార్డు రేటు
చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ సినీ కెరీర్ స్టార్ట్ చేసిన అడివి శేష్ క్రమంగా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ హీరోగా ఎదిగిపోయాడు. వరుసగా క్షణం, గూడచారి, ఎవరు, మేజర్, హిట్ 2 సినిమాలతో సక్సెస్ అందుకున్నారు. అందుకే అడివి శేష్ కొత్త సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే డెకాయిట్ ప్రీ బిజినెస్ వేరే లెవల్ లో జరుగుతోందని తెలిసింది.
ఈ మూవీ ఆడియో రైట్స్ కోసం సోనీ మ్యూజిక్ రూ.8 కోట్లు చెల్లించందనే టాక్ హాట్ టాపిక్ గా మారింది. శేష్ కెరీర్ లోనే ఇది హైయ్యస్ట్ రేటు. ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ డైరెక్టర్. భీమ్స్ వరుసగా సూపర్ హిట్ సాంగ్స్ అందిస్తున్న సంగతి తెలిసిందే.
భారీ బడ్జెట్ తో
అడివి శేష్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో డెకాయిట్ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ మూవీలో శేష్ సరసన మృణాల్ ఠాకూర్ ఫీమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం రూ.70 కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నారని టాక్. చిన్న సినిమాలతో పెద్ద స్టార్ గా ఎదుగుతున్న అడివి శేష్ కెరీర్ లో ఇప్పటివరకూ ఇదే భారీ బడ్జెట్ మూవీ.
షానియల్ డియో డైరెక్షన్ లో రెడీ అవుతున్న డెకాయిట్ మూవీకి సుప్రియ యార్లగడ్డ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేసి ఈ మూవీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. గ్లింప్స్ తో పాటే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసే అవకాశముంది.
సంబంధిత కథనం