అమానవీయం! గిరిజన మహిళను గ్యాంగ్​ రేప్​ చేసి, చిత్రహింసలు పెట్టి చంపేశారు..

Best Web Hosting Provider In India 2024


అమానవీయం! గిరిజన మహిళను గ్యాంగ్​ రేప్​ చేసి, చిత్రహింసలు పెట్టి చంపేశారు..

Sharath Chitturi HT Telugu

మధ్యప్రదేశ్​లో ఓ గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. నిందితులు ఆమెను చిత్రహింసలు పెట్టారు. ఫలితంగా ఆ మహిళ ప్రాణాలు విడిచింది.

గిరిజన మహిళపై అత్యాచారం..

మధ్యప్రదేశ్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు వ్యక్తులు ఓ గిరిజన మహిళపై అత్యంత కృరంగా ప్రవర్తించారు. ఆమెను గ్యాంగ్​ రేప్​ చేసి, చిత్రహింసలకు గురిచేశారు. తీవ్ర గాయాలతో ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది.

అసలేం జరిగింది?

మధ్యప్రదేశ్​ ఖాండ్వా జిల్లాలో జరిగింది ఈ ఘటన. 20 ఏళ్ల వయసున్న ఇద్దరు.. 45ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులను హరి రామ్ కోర్కు (27), సునీల్ కోర్కు (26)గా గుర్తించినట్టు డిప్యూటీ ఇన్​స్పెక్టర్​ జనరల్ సిద్ధార్థ్ బహుగుణ తెలిపారు. మహిళ ప్రైవేట్ పార్ట్స్, గర్భాశయానికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు.

గాయాల తీవ్రత, అవి ఎలా సంభవించాయో తెలుసుకోవడానికి అధికారులు పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు.

శుక్రవారం రాత్రి ఓ వివాహానికి హాజరైన తర్వాత హరి రామ్ కోర్కు ఇంట్లో ఆమెపై అత్యాచారం జరిగిందని అదనపు పోలీసు సూపరింటెండెంట్ రాజేష్ రఘువంశీ తెలిపారు. సామూహిక అత్యాచారం, చిత్రహింసలకు గురవ్వడం వల్ల ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడంతో అపస్మారక స్థితిలోకి జారుకుంది.

కొన్ని గంటల తర్వాత ఆమెను స్థానిక కమ్యూనిటీ హెల్త్​ సెంటర్​లో చేర్చారు. హరి రామ్ కొర్కు, సునీల్ రామ్ కొర్కు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని వైద్యులు, ఆమె కుటుంబ సభ్యులకు చెప్పి, బాధితురాలు ప్రాణాలు విడిచింది.

మహిళ ప్రైవేట్ భాగాలకు తీవ్రమైన గాయాలు, గర్భాశయం తీవ్రంగా దెబ్బతిన్నట్లు ప్రాథమిక వైద్య నివేదికలు నిర్ధారించాయని రఘువంశీ చెప్పారు. ఇద్దరు నిందితులపై గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

రాష్ట్రంలో మహిళలు, గిరిజనులపై పెరుగుతున్న అఘాయిత్యాలపై ప్రతిపక్ష కాంగ్రెస్ నేత అరుణ్ యాదవ్ అధికార భారతీయ జనతా పార్టీపై విరుచుకుపడ్డారు. శాంతిభద్రతల ఇన్​చార్జిగా ఉన్న ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఇలాంటి దారుణమైన నేరాల నియంత్రణకు ప్రణాళికలేవని ప్రశ్నించారు.

బాలికపై నెలల పాటు అత్యాచారం..

మహిళలు, బాలికలపై అత్యాచార ఘటనలు ఇటీవలి కాలంలో ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ఓ వ్యక్తి, ఓ బాలికను రెండు నెలల పాటు బంధించి, రేప్​ చేసి, అబార్షన చేయించి, వ్యభిచారంలోకి దింపిన ఘటన మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది.

ఈ వ్యవహారం కొంతమంది కార్మికులకు తెలియడంతో బాలిక కష్టాలు వెలుగులోకి వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఒక మహిళతో సహా నలుగురిని అరెస్టు చేశామని, అయితే ప్రధాన నిందితుడు ఇంకా పరారీలో ఉన్నాడని వివరించారు.

విషయం తెలుసుకున్న తిలక్ నగర్ పోలీసులు డోంబివిలిలోని గ్రామీణ ప్రాంతంలోని ఓ ఇంటిపై దాడి చేసి బాలికను రక్షించారు. బాధితురాలు పదో తరగతి పరీక్షల అనంతరం తల్లితో గొడవపడి ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు ప్రధాన నిందితుడు బాలికను తనతో రమ్మని బలవంతం చేశాడు.

ఆ తర్వాత బాలికను రెండు నెలల పాటు నిర్బంధించి లైంగిక దాడికి పాల్పడ్డాడని, ఆ తర్వాత ఆమె గర్భం దాల్చిందని పోలీసులు తెలిపారు.

ఆ తర్వాత అబార్షన్ కోసం మరో వ్యక్తి వద్దకు తీసుకెళ్లాడు. బాలికను ఓ జంట ఇంట్లో ఉంచి బలవంతంగా వ్యభిచారంలోకి దింపారు. కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలిస్తుండగా, ప్రధాన నిందితుడు బాలికను నగరంలో చూశానని, అయితే ఆమె కోపంగా ఉందని, తిరిగి రాదని చెప్పి వారిని తప్పుదోవ పట్టించాడు.

ఆమె బంధువులు రెండు నెలల తర్వాతే పోలీసులను ఆశ్రయించారని, బాధితురాలు పోలీసుల ముందు చేసిన ఆరోపణల ఆధారంగా ఒక మహిళ, ఆమె భర్తతో సహా నలుగురిని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. అయితే ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని, భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 137(2) (కిడ్నాప్), 65(1) (కొన్ని కేసుల్లో అత్యాచారం), 88 (గర్భస్రావం), 143 (వ్యక్తి అక్రమ రవాణా), 144 (అక్రమ రవాణా చేసిన వ్యక్తిని వేధించడం), లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం, అనైతిక ట్రాఫిక్ (నివారణ) చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు వివరించారు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link