అతని యాక్టింగ్ చూస్తే జెలస్ కలుగుతోంది.. కమల్ ప్రశంసలు.. కన్నీళ్లు పెట్టుకున్న మలయాళ నటుడు.. ఆ మాటలు ఆస్కార్ తో సమానం

Best Web Hosting Provider In India 2024

అతని యాక్టింగ్ చూస్తే జెలస్ కలుగుతోంది.. కమల్ ప్రశంసలు.. కన్నీళ్లు పెట్టుకున్న మలయాళ నటుడు.. ఆ మాటలు ఆస్కార్ తో సమానం

థగ్ లైఫ్ తో ఆడియన్స్ ను మరోసారి మెస్మరైజ్ చేయడానికి వస్తున్నారు కమల్ హాసన్. ఈ మూవీ ఆడియో లాంఛ్ ఈవెంట్లో మలయాళ నటుడు జోజు జార్జ్ గురించి కమల్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. కమల్ మాటలకు జోజు కన్నీళ్లు పెట్టుకున్నారు.

కమల్ హాసన్, జోజు జార్జ్ (x/nammavar11)

ఎవరైనా యాక్టింగ్ ఇరగదీస్తుంటే హే.. కమల్ హాసన్ అని అంటారు. అంటే నటనలో కమల్ హాసన్ సెట్ చేసిన స్టాండర్డ్స్ అలాంటివి. అలాంటి లెజెండరీ యాక్టర్ ఓ నటుడు నటన చూస్తే జెలస్ గా ఉంటుందన్నారు. థగ్ లైఫ్ సినిమా ఆడియో లాంఛ్ ఈవెంట్లో కమల్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఆ నటుడే జోజు జార్జ్. ఈ మలయాళ యాక్టర్ నటన చూస్తే ఈర్ష్య కలుగుతోందని కమల్ అన్నారు.

ఆ సినిమాలో యాక్టింగ్

2023లో వచ్చిన మలయాళ సినిమా ‘ఇరాట్టా’లో జోజు జార్జ్ యాక్టింగ్ తో అదరగొట్టారు. ఇప్పుడు అదే సినిమాలో యాక్టింగ్ కు గానూ జోజుపై కమల్ హాసన్ ప్రశంసలు కురిపించారు. ఈ మూవీలో జోజు డ్యుయల్ రోల్ చేశారు. తన ఫిల్మ్ కెరీర్లో 30కి పైగా సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసిన కమల్.. ఇరాట్టాలో జోజు డ్యుయల్ రోల్ కు ఫిదా అయ్యారు.

పవర్ ఫుల్ యాక్టింగ్

‘‘రెండు క్యారెక్టర్ల మధ్య తేడాను స్పష్టంగా చూడొచ్చు. అది కేవలం తెలివైన ఎడిటింగ్ మాత్రమే కాదు పవర్ ఫుల్ ఎడిటింగ్. అతని యాక్టింగ్ చూసి జెలస్ కలిగింది’’ అని ఇరాట్టాలో జోజు జార్జ్ యాక్టింగ్ గురించి కమల్ పేర్కొన్నారు. మొదట్లో జోజు యాక్టింగ్ గురించి తనకు తెలియదని కమల్ అన్నారు. కానీ మలయాళ సినిమా ఇరాట్టా చూడాలని ఎవరో రికమండ్ చేశారని, అది చూశాక జోజు యాక్టింగ్ గురించి తెలిసిందని కమల్ చెప్పారు.

జోజు కన్నీళ్లు

కమల్ హాసన్ లాంటి దిగ్గజ నటుడు తనపై ప్రశంసలు కురిపించే సరికి జోజు జార్జ్ తట్టుకోలేకపోయాడు. ఫుల్ ఎమోషనల్ అయ్యాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఆ తర్వాత సోషల్ మీడియాలో కమల్ వ్యాఖ్యలపై స్పందించిన జోజు.. ఆ మాటలు తనకు ఆస్కారం గెలవడం లాంటిదని పేర్కొన్నారు.

థగ్ లైఫ్ లో

మణిరత్నం డైరెక్షన్ లో రిలీజ్ కు రెడీ అయిన థగ్ లైఫ్ లో జోజు జార్జ్ సపోర్టింగ్ రోల్ చేశారు. సుదీర్ఘ విరామం తర్వాత మణిరత్నం, కమల్ హాసన్ కలిసి చేసిన థగ్ లైఫ్ మూవీ జూన్ 5న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీలో సిలంబరసన్, త్రిష, అభిరామి తదితరులు నటించారు. ఇటీవల రిలీజైన థగ్ లైఫ్ ట్రైలర్ మూవీపై అంచనాలు పెంచేసింది. ఈ ట్రైలర్ లో 70 ఏళ్ల వయసులో కమల్ హాసన్.. త్రిష, అభిరామితో రొమాన్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024