





Best Web Hosting Provider In India 2024

మనుషులను బతికున్న శవాలుగా మార్చే ఫంగస్.. ఇప్పుడు ఇదే పెద్ద ప్రమాదం అంటున్న శాస్త్రవేత్తలు
ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలను తీస్తున్న ప్రమాదకరమైన ఫంగస్ గురించి శాస్త్రవేత్తలు ఇప్పుడు భయపడుతున్నారు. వాతావరణ మార్పుల వల్ల ఈ ఫంగస్ కొత్త దేశాలకు చేరే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ప్రమాదకరమైన ఒక ఫంగస్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలను బలిగొంది. ఇది ఎంత ప్రమాదకరమైనదంటే వాతావరణ మార్పుల కారణంగా ఇది అత్యంత వేగంగా వ్యాపిస్తున్నట్టు గుర్తించారు. జాగ్రత్తగా లేకపోతే మానవాళి సంఖ్య ఈ ఫంగస్ కారణంగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఈ ఫంగస్ గురించి ఇప్పుడు ప్రపంచ శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. దీని పేరు ఆస్పర్గిల్లాస్.
ప్రతిచోటా శిలీంద్రాలు, నల్ల బూజు, పుట్టగొడుగులు… వంటివి ఎన్నో రకాలు కనిపిస్తాయి. చివరికి మన శ్వాసలో కూడా ఎన్నో రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవన్నీ కూడా పర్యావరణ వ్యవస్థలో ఒక భాగంగానే ఉన్నాయి. వీటిలో చాలా సూక్ష్మజీవులు పర్యావరణ వ్యవస్థలో ప్రధానమైన పాత్రను పోషిస్తున్నాయి. అయితే వీటిలో కొన్ని మానవ ప్రాణానికి హాని కూడా చేయవచ్చు. మనుషులకు ప్రాణాంతకంగా మారవచ్చు.
కంటికి కనిపించని ఒక ఫంగస్. కారణంగా ప్రతి ఏడాది పాతిక లక్షల మంది మరణిస్తున్నట్టు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. కానీ ఈ ఫంగస్ గురించి సాధారణ ప్రజలకు తెలియదు. ఒక కొత్త అధ్యయనంలో ఈ ఫంగస్ ఎంతగా మానవాళికి ప్రాణాంతకంగా పరిణమించిందో గుర్తించారు.
యూకేలోని మాంచెస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు వాతావరణ మార్పుల వల్ల ఎలాంటి సూక్ష్మజీవులు ఉత్పన్నమవుతున్నాయో లేక అవి ఎలా జీవనం సాగిస్తున్నాయో తెలుసుకొనేందుకు అధ్యయనాన్ని నిర్వహించారు. అయితే ఆ అధ్యయనంలో ఆస్పర్‌గిల్లస్ అనే ఫంగస్ అత్యంత వేగంగా కొత్త ప్రాంతాలకు వ్యాపిస్తున్నట్టు గుర్తించారు. ఈ ఫంగస్ కారణంగా మనుషులు తమకు తెలియకుండానే ఆస్పెరోగిలోసిస్ అనే ప్రాణాంతక వ్యాధి బారిన పడుతున్నారు. ఇది ఊపిరితిత్తులను తీవ్రంగా ప్రభావితం చేసే ఈ వ్యాధి బారిన పడినవారు కనీసం ఆ వ్యాధి నిర్ధారణ కాకముందే మరణిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ ఫంగస్ ఇంతలా ఎందుకు ప్రమాదకరంగా పెరుగుతుందో అధ్యయనంలో తేలింది. భూమి ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ అనేక రకాల కొత్త ప్రదేశాలకి ఈ ఫంగస్ త్వరగా చేరుతున్నట్టు గుర్తించారు. ముఖ్యంగా చైనా, రష్యా, యూరోపియన్, ఉత్తర అమెరికాలో దీని ప్రభావం అధికంగా ఉంది. భవిష్యత్తులో ఇలాంటి వాటి వల్ల ప్రపంచమే నాశనమయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఇది మనుషులకు సోకితే ప్రాణం ఉన్న శవాలుగా మారిపోతారు. వారు విపరీతమైన నీరసంతో ఏ పనీ చేయలేరు. కొన్నాళ్లకు వారి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి.
ఈ ఫంగస్ ఎలా శరీరంలో చేరుతుంది?
ఆస్పర్‌గిల్లస్ అనే ఫంగస్ కంటికి కనిపించనంత సూక్ష్మమైనది. ఇది గాలిలోనే ప్రయాణిస్తుంది. గాలిలోనే చేరి శ్వాస ద్వారా లేదా నోటి ద్వారా మన శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఇది నేరుగా రోగనిరోధక శక్తి పై దాడి చేస్తుంది అలాగే ఊపిరితిత్తుల్లో చేరి విపరీతమైన ఇబ్బందులకు గురిచేస్తుంది. ముఖ్యంగా ఉబ్బసం, క్యాన్సర్ మూత్రపిండ సమస్యలు, కోవిడ్ బారిన పడినవారు సిఓపిడి వంటి వ్యాధులతో పోరాడుతున్న వారికి ఈ ఫంగస్ ప్రాణాంతకంగా మారొచ్చు. ఎందుకంటే వారి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ ఈ ఫంగస్ తో పోరాడలేదు. దాంతో ఫంగస్ శరీరాన్ని తినడం ప్రారంభిస్తుంది.
ఈ ఫంగస్ ఊపిరితిత్తులలో చేరితే ఊపిరితిత్తుల్లో వాపు కలగడం, అధికంగా జ్వరం రావడం, తీవ్రమైన దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ ఫంగస్ చేరిన వారిలో మరణాల రేటు 20 శాతంనుండి 40 శాతం వరకు ఉంటుంది. దీనికి చికిత్స చేయడం కూడా చాలా కష్టం.
ఈ ఫంగస్ వేడిగా, ఉష్ణ మండల వాతావరణంలోనే అధికంగా ఉంటుంది. దీని నుంచి బయటపడడం కష్టమే. కానీ ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా పరిశుభ్రతగా ఉండడం ద్వారా కొంతవరకు నివారించవచ్చు. ఇలాంటి శిలీంధ్రాల వ్యాధులపై ఇంకా తీవ్రమైన పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది. అలాగే వీటి వల్ల కలిగే వ్యాధులకు ఔషధాలను కనిపెట్టాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది.
టాపిక్