





Best Web Hosting Provider In India 2024

ఓటీటీలో ఈవారం 5 అదిరిపోయే సినిమాలు.. హిట్ 3 స్ట్రీమింగ్.. మరో సూపర్ హిట్ యాక్షన్ మూవీ.. ఓ మిస్టరీ థ్రిల్లర్
ఈ వారంలో ఓటీటీల్లో సూపర్ చిత్రాలు వచ్చేస్తున్నాయి. హిట్ 3 ఇదే వారం ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఓ తమిళ యాక్షన్ మూవీ కూడా వచ్చేయనుంది. ఓ హాలీవుడ్ మూవీ రానుంది. టాప్-5 చిత్రాలు ఇవే.
ఈ మే చివరి వారంలో ఓటీటీల్లోకి అదిరిపోయే సినిమాలు ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాయి. ముఖ్యంగా 5 చిత్రాలపై ఫోకస్ ఎక్కువగా ఉంది. నాని సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘హిట్ 3’ స్ట్రీమింగ్‍కు రెడీ అయింది. సూర్య హీరోగా నటించిన యాక్షన్ చిత్రం కూడా అడుగుపెట్టనుంది. ఓ కన్నడ చిత్రం, ఓ హాలీవుడ్ క్రేజీ మూవీ కూడా రానున్నాయి. ఇలా ఈ వారం ఓటీటీల్లోకి రానున్న 5 టాప్ సినిమాల గురించి ఇక్కడ చూడండి.
హిట్ 3
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘హిట్ 3’ సినిమా మే 29వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి రానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో ఎంట్రీ ఇవ్వనుంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం మే 1వ తేదీన థియేటర్లలో విడుదలైంది. రూ.100కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లతో బ్లాక్‍బస్టర్ అయింది. ఈ చిత్రంలో నాని సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‍గా నటించారు. హిట్ 3 మూవీని ఈ గురువారం మే 29 నుంచి నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో చూసేయవచ్చు.
అజ్ఞాతవాసి
కన్నడ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ‘అజ్ఞాతవాసి’ చిత్రం మే 28వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఈ మూవీలో రంగనాయన రఘు, పావన గౌడ లీడ్ రోల్స్ చేశారు. డైరెక్టర్ జనార్దన చిక్కన్న తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. మే 28న జీ5లో ఈ అజ్ఞాతవాసి చిత్రం రానుంది.
రెట్రో
తమిళ స్టార్ హీరో సూర్య, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటించిన రెట్రో సినిమా మే 31వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ రొమాంటిక్ యాక్షన్ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. మే 1న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినా సూపర్ హిట్ అయింది. గ్యాంగ్‍ల మధ్య గొడవలు, లవ్ స్టోరీతో ఈ చిత్రం రూపొందింది. రెట్రో చిత్రం మే 31న తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నెట్‍ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది.
కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూవరల్డ్
హలీవుడ్ సూపర్ హిట్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూవరల్డ్’ మే 28వ తేదీన జియోహాట్‍స్టార్ ఓటీటీలోకి రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు రానుంది. ఇప్పటికే కొన్ని ఓటీటీల్లో రెంటల్ విధానంలో ఉన్న ఈ చిత్రం ఇప్పుడు హాట్‍స్టార్ ఓటీటీలో సాధారణ స్ట్రీమింగ్‍కు అడుగుపెడుతోంది. ఆంటోనీ మాకీ, డానీ రెమీరెజ్, షిహా హాస్ లీడ్ రోల్స్ చేసిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైంది. జూలియస్ ఓనాహ్ దర్శకత్వం వహించిన కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూవరల్డ్ మంచి హిట్ సాధించింది.
ఏ విడోస్ గేమ్
స్పానిష్ క్రైమ్ డ్రామా సినిమా ‘ఓ విడోస్ గేమ్’ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో మే 30వ తేదీన డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ మూవీలో ఇవానా బకెరో, ట్రిస్టన్ ఉలావీ ప్రధాన పాత్రలు పోషించారు. ఇటీవల వచ్చిన ఈ చిత్రం ట్రైలర్ ఆసక్తి కలిగించింది. ది విడోస్ గేమ్ చిత్రానికి కార్లోస్ సెడెస్ దర్శకత్వం వహించారు.
సంబంధిత కథనం