





Best Web Hosting Provider In India 2024

కన్నప్ప సినిమాలో ప్రభాస్ స్క్రీన్‍టైమ్ ఎంతో చెప్పిన మంచు విష్ణు.. టోటల్ రన్‍టైమ్ కూడా రివీల్
కన్నప్ప సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు మంచు విష్ణు. ప్రభాస్, మోహన్‍లాల్ ఈ చిత్రంలో ఎంతసేపు కనిపిస్తారో చెప్పారు. ఫుల్ రన్‍టైమ్ గురించి కూడా తెలిపారు.
హీరో మంచు విష్ణు ప్రధాన పాత్ర పోషించిన కన్నప్ప చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమా జూన్ 27వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. శివుడి పరమ భక్తుడు కన్నప్ప పాత్రలో ఈ చిత్రంలో నటించారు విష్ణు. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, మలయాళ స్టార్ మోహన్‌లాల్, అక్షయ్ కుమార్ కూడా ఈ చిత్రంలో నటించారు. అయితే, ఈ సినిమాలో వారి స్క్రీన్‍టైమ్ ఎంత ఉంటుందనేది చాలా మందిలో ఉత్కంఠగా మారింది. ఆ వివరాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో విష్ణు వెల్లడించారు.
ప్రభాస్.. 30 నిమిషాలు
కన్నప్ప సినిమాలో ప్రభాస్ స్క్రీన్‍టైమ్ సుమారు 30 నిమిషాలు ఉంటుందని మంచు విష్ణు తెలిపారు. ప్రభాస్‍ది చాలా ముఖ్యమైన పాత్ర అని చెప్పారు. ట్రిమ్ చేసిన తర్వాత కూడా ప్రభాస్ స్క్రీన్‍టైమ్ సుమారు అరగంట ఉందని క్లారిటీ ఇచ్చారు విష్ణు. ఈ చిత్రంలో మోహన్‍లాల్ సుమారు 15 నిమిషాలు కనిపిస్తారని, ఆయనది కూడా కీలకమైన రోల్ అని చెప్పారు.
12 నిమిషాల వార్ సీన్.. ఫుల్ రన్‍టైమ్ ఇదే
కన్నప్ప సినిమా రన్‍టైమ్ రోలింగ్ టైటిళ్లతో కలిపి 3 గంటల 10 నిమిషాలు ఉంటుందని మంచు విష్ణు తెలిపారు. ఈ సినిమాను కుదించలేమని తెలిపారు. ఈ చిత్రంలో దాదాపు 12 నిమిషాల వార్ ఎపిసోడ్ ఉంటుందని విష్ణు వెల్లడించారు. సినిమా బాగుంటే రన్‍టైమ్ ఎక్కువగా ఉండడం ఇబ్బంది కాదని, తమకు అదే అనిపించిందని విష్ణు తెలిపారు.
కన్నప్ప చిత్రంలో రుద్ర అనే సాధువు పాత్ర పోషించారు ప్రభాస్. కిరాటా అనే రోల్ చేశారు మోహన్‍లాల్. ఈ చిత్రం మహాశివుడిగా అక్షయ్ కుమార్, పార్వతిదేవిగా కాజల్ అగర్వాల్ నటించారు. ఇక ఈ సినిమాలో మంచు మోహన్‍బాబు, శరత్ కుమార్, మధూ, ముకేశ్ రుషి, బ్రహ్మాజీ, బ్రహ్మానందం, రఘుబాబు కీలకపాత్రలు పోషించారు.
సుమారు రూ.100కోట్లకు పైగా బడ్జెట్‍తో కన్నప్ప సినిమా గ్రాండ్ స్కేల్‍తో రూపొందింది. ఈ చిత్రానికి ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. జూన్ 27న తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో ఈ మూవీ విడుదల కానుంది. ఈ సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకాలపై మంచు మోహన్‍బాబు నిర్మించారు.
సంబంధిత కథనం