ఆ రెండు సినిమాల తర్వాత ఇంకేది చేయకూడదనుకున్నా.. పూరి జగన్నాథ్ మూవీపై హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క్లారిటీ

Best Web Hosting Provider In India 2024

ఆ రెండు సినిమాల తర్వాత ఇంకేది చేయకూడదనుకున్నా.. పూరి జగన్నాథ్ మూవీపై హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క్లారిటీ

Sanjiv Kumar HT Telugu

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన లేటెస్ట్ మూవీ భైరవం. ఈ సినిమాలో మంచు మనోజ్, నారా రోహిత్ మరో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మే 30న భైరవం రిలీజ్ కానున్న సందర్భంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్‌తో మూవీపై హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చాడు.

ఆ రెండు సినిమాల తర్వాత ఇంకేది చేయకూడదనుకున్నా.. పూరి జగన్నాథ్ మూవీపై హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క్లారిటీ

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన లేటెస్ట్ సినిమా భైరవం. మంచు మనోజ్, నారా రోహిత్ మరో ఇద్దరు హీరోలుగా చేస్తున్నారు. డైరెక్టర్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గాడా సమర్పించారు.

బిగ్గెస్ట్ రిలీజ్‌కి

భైరవం సినిమా మే 30న ఈ సీజన్‌లో బిగ్గెస్ట్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. అలాగే, పూరీ జగన్నాథ్‌తో మూవీపై బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చాడు.

దాదాపు నాలుగు ఏళ్ల గ్యాప్ వచ్చింది కదా. ఈ గ్యాప్‌లో ఎలాంటి కథల మీద వర్క్ చేశారు?

-హైందవ స్క్రిప్ట్ ఓకే చేసి దాదాపు మూడేళ్లు అవుతుంది. అది నాకు చాలా పాషనేట్ ప్రాజెక్టు. హైందవ, టైసన్ నాయుడు తర్వాత ఇంకేది చేయకూడదు అనుకున్నాను. ఈ ప్రాసెస్‌లో ఉన్నప్పుడు అనుకోకుండా భైరవం, కిస్కిందపురి వచ్చాయి. ఈ రెండు ప్రాజెక్టులు కూడా నన్ను చాలా ఎగ్జైట్ చేశాయి. కిష్కిందపురి చాలా కొత్త జోనర్ సినిమా. ఆడియన్స్‌కి చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది.

ఇప్పటివరకు మీరు చేసిన సినిమాల్లో మీకు ఇష్టమైన జానర్ ఏంటి?

-ప్రతి సినిమాని కూడా ఎంజాయ్ చేస్తూనే చేస్తాను. ప్రతి సినిమాకి నా అటాచ్‌మెంట్ ఒకేలానే ఉంటుంది.

భైరవం టైటిల్ గురించి?

-ఈ సినిమాలో హీరో కొలిచేది కాలభైరవుడ్ని. కథలో నుంచే ఆ టైటిల్ వచ్చింది. ఈ సినిమా కోసం మ్యాసీవ్ టెంపుల్ సెట్ వేసాం. అది చాలా రియల్‌గా వచ్చింది. హ్యాట్సాఫ్ టు ఆర్ డైరెక్టర్ బ్రహ్మ కడలి గారు.

నిర్మాత రాధా మోహన్ గారి గురించి?

-నాకు చాలా ఇష్టమైన ప్రొడ్యూసర్. నన్ను ఫస్ట్ నమ్మిన వ్యక్తి. ఆయనతో రెండు మూడు ప్రాజెక్టులు చేయాలనుకున్నాను. కానీ, కుదరలేదు. ఈ సినిమాతో అన్ని సెట్ అయ్యాయి. చాలా పాషన్‌తో సినిమా నిర్మించే ప్రొడ్యూసర్.

పూరి జగన్నాథ్ గారితో మీరు సినిమా చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి ?

-ఒకటి రెండుసార్లు పూరి జగన్నాథ్ గారు, నేను కలిసాము. కచ్చితంగా ప్లాన్ చేస్తాము. డిఫరెంట్ సినిమాలు చేయాలనే ఆలోచన ఉంది. అందుకే భైరవం, టైసన్ నాయుడు, హైందవం కిష్కిందపురి.. దేనికి అవే ప్రత్యేకమైనటువంటి సినిమాలు. ఈ నాలుగు కూడా ఆడియన్స్‌కి కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని ఇవ్వబోతున్నాయి.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024