అతని రూపంలో కొత్త హీరో దొరికినట్లు అనిపిస్తుంది.. యుఫోరియా కొరియోగ్రాఫర్ ఈశ్వర్ కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

అతని రూపంలో కొత్త హీరో దొరికినట్లు అనిపిస్తుంది.. యుఫోరియా కొరియోగ్రాఫర్ ఈశ్వర్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ యుఫోరియా. గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మించిన ఈ సినిమాకు కొరియోగ్రాఫర్ ఈశ్వర్ డ్యాన్స్ కంపోజ్ చేశారు. రీసెంట్‌గా యుఫోరియా నుంచి ఫ్లై హై సాంగ్ రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్‌లో కొరియోగ్రాఫర్ ఈశ్వర్ కామెంట్స్ చేశారు.

అతని రూపంలో కొత్త హీరో దొరికినట్లు అనిపిస్తుంది.. యుఫోరియా కొరియోగ్రాఫర్ ఈశ్వర్ కామెంట్స్

గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద నీలిమ గుణ నిర్మాణంలో డైరెక్టర్ గుణ శేఖర్ తెరకెక్కించిన చిత్రం ‘యుఫోరియా’. నూతన నటీనటులతో గుణ శేఖర్ ఓ ట్రెండీ టాపిక్‌ మీద ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ముఖ్య పాత్రలు

యుఫోరియా సినిమాలో భూమిక చావ్లా, సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేశ్ గవిరెడ్డి, లిఖిత యలమంచలి, అడ్డాల పృధ్వీరాజ్, కల్ప లత, సాయి శ్రీనికా రెడ్డి, అశ్రిత వేముగంటి, మాథ్యూ వర్గీస్, ఆదర్శ్ బాలకృష్ణ, రవి ప్రకాష్, నవీనా రెడ్డి, లికిత్ నాయుడు వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు.

యుఫోరియా ఫ్లై హై సాంగ్ రిలీజ్

శనివారం నాడు (మే 24) యుఫోరియా నుంచి ‘ఫ్లై హై’ ఫస్ట్ సింగిల్‌ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఏఎంబీలోని శరత్ సిటీ మాల్‌లో ఫ్లై హై సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో నిర్మాత నీలిమ గుణ, సింగర్ కాళభైరవ, కొరియోగ్రాఫర్ ఈశ్వర్‌తో పాటు పలువురు ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు.

గుణ శేఖర్ లాంటి దర్శకుడితో

యుఫోరియా కొరియోగ్రాఫర్ ఈశ్వర్ మాట్లాడుతూ .. “చాలా తక్కువ టైంలోనే గుణశేఖర్ లాంటి దర్శకుడితో పని చేసే ఛాన్స్ వచ్చింది. ఈ చిత్రం ఎంత ట్రెండీగా ఉంటుందో, కొత్తగా ఉంటుందో త్వరలోనే తెలుస్తుంది. ఫ్లై హై సాంగ్ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. విఘ్నేశ్ గవిరెడ్డి రూపంలో మనకు కొత్త హీరో దొరికినట్టు అనిపిస్తుంది” అని అభిప్రాయం వ్యక్తం చేశారు.

మంచి పాటను ఇచ్చిన

నిర్మాత నీలిమ గుణ మాట్లాడుతూ .. “అందరికీ మా ఫస్ట్ సింగిల్ ‘ఫ్లై హై’ నచ్చిందని భావిస్తున్నాను. ఇంత మంచి పాటను ఇచ్చిన కాళ భైరవ గారికి థాంక్స్’ అని అన్నారు.

పాటలన్నీ నచ్చుతాయి

కాళ భైరవ మాట్లాడుతూ .. “ఫ్లై హై పాట అందరికీ నచ్చుతుందని నేను కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాను. ఇది అన్ని సినిమాల్లా నార్మల్‌గా ఉండదు. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అందుకే నేను కూడా చాలా డిఫరెంట్ మ్యూజిక్ ఇచ్చేందుకు ట్రై చేశాను. ఇందులోని పాటలన్నీ నచ్చుతాయి. సినిమా కూడా అందరికీ నచ్చుతుంది” అని తెలిపారు.

ఓ మంచి సినిమా చేశాం

“ఫ్లై హై సాంగ్ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాం. ముందు ముందు ఇంకా మరిన్ని అప్డేట్లతో వస్తాం. మేం అంతా కలిసి ఓ మంచి సినిమాను చేశాం. అందరి సహకారం మా సినిమాకి ఉండాలి” అని యుఫోరియా మూవీ హీరో విఘ్నేశ్ గవిరెడ్డి పేర్కొన్నాడు.

ప్రవీణ్ కె పోతన్ సినిమాటోగ్రఫీ

ఇదే ఈవెంట్‌లో పృథ్వీరాజ్ అడ్డాల మాట్లాడుతూ .. “కాళ భైరవ అద్భుతమైన పాట ఇచ్చారు. ఫ్లై హై పాట అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను” అని వెల్లడించారు. ఇక ఈ సినిమాకు నాగేంద్ర కాశి, కృష్ణ హరి సంభాషణలు అందించారు. ప్రవీణ్ కె పోతన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024