ముగిసిన ఏపీ లాసెట్‌ 2025 దరఖాస్తు గడువు.. దరఖాస్తుల సవరణకు నేడు, రేపు ఛాన్స్‌

Best Web Hosting Provider In India 2024

ముగిసిన ఏపీ లాసెట్‌ 2025 దరఖాస్తు గడువు.. దరఖాస్తుల సవరణకు నేడు, రేపు ఛాన్స్‌

Sarath Chandra.B HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Sarath Chandra.B HT Telugu

ఆంధ్రప్రదేశ్‌లో మూడేళ్లు, ఐదేళ్ళ లా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే లాసెట్‌ 2025 దరఖాస్తు గడువు ముగిసింది. జూన్ 5న లాసెట్ పరీక్ష నిర్వహిస్తారు. జూన్ 22వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు. దరఖాస్తులను ఎడిట్‌ చేసుకోడానికి నేడు, రేపు అవకాశం ఉంటుంది.

నేడు, రేపు లాసెట్‌ 2025 దరఖాస్తుల ఎడిట్‌ ఆప్షన్‌ అందుబాటులో…

ఆంధ్రప్రదేశ్‌ లా సెట్‌ 2025కు దరఖాస్తు గడువు ముగిసింది. రూ.10వేల రుపాయల ఆలస్య రుసుముతో లా సెట్‌ 2025 ఎంట్రన్స్‌కు దరఖాస్తు చేసుకోడానికి ఆదివారంతో గడువు ముగిసింది. ఏప్రిల్ 27వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏపీ లాసెట్‌ 2025 దరఖాస్తులు స్వీకరించారు.

ఏపీ లాసెట్ – 2025 దరఖాస్తుల ప్రక్రియ గడువు ముగిసింది. ఆన్‌లైన్‌ ద్వారా లాసెట్‌ దరఖాస్తులను స్వీకరించారు. జూన్ 5న లాసెట్ పరీక్ష నిర్వహిస్తారు. జూన్ 22వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు.

ఏపీ లాసెట్ 2025

ఆంధ్రప్రదేశ్‌ లా సెట్ 2025 నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మూడేళ్లు, ఐదేళ్లతో పాటు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.ఏప్రిల్ 27 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించారు.

ఏపీ లాసెట్ – 2025 కు ఏప్రిల్ 28 నుంచి మే 4 వరకు రూ.1000 జరిమానా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు. మే 5 నుంచి మే 11 వరకు రూ. 2 వేలు చెల్లించి అప్లికేషన్ చేసుకోవాలి. మే 12 నుంచి మే 18 వరుక రూ. 4 వేలు, మే 19 నుంచి మే 25 వరకు రూ. 10 వేలు చెల్లించి దరఖాస్తు చేసుకునే వీలు ఉంటుంది. ఆదివారంతో ఆలస్య రుసుముతో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది.

నేడు రేపు ఎడిట్ ఆప్షన్

మే 26 నుంచి మే 27 వరకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. దరఖాస్తుల్లో మార్పులు, చేర్పులు సవరణలు చేసుకోవచ్చు. మే 30వ తేదీ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 5న లాసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. జూన్ 22వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు. 45 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉండాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. పీజీ కోర్సుల్లోప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునే వారు లా డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. ఎలాంటి వయో పరిమితి ఉండదు.

ఏపీ లాసెట్ ముఖ్య తేదీలు:

లాసెట్ 2025 ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 27- 04- 2025.

రూ. 1000 ఫైన్ తో దరఖాస్తులకు చివరి తేదీ : 28-04-2025 నుంచి 04-05-2025.

రూ. 2000 ఫైన్ తో దరఖాస్తులకు చివరి తేదీ : 05-05-2025 నుంచి 11-05-2025.

రూ. 4000 ఫైన్ తో : 12-05-2025 నుంచి 18-05-2025.

రూ.10,000 ఫైన్ తో దరఖాస్తులకు చివరి తేదీ : 19-05-2025 నుంచి 25-05-2025.

దరఖాస్తుల ఎడిట్ ఆప్షన్ : 26-05-2025 నుంచి 27-05-2025 వరకు.

హాల్ టికెట్ల డౌన్లోడ్ : 30-05-2025 నుంచి అందుబాటులోకి వస్తాయి

పరీక్ష తేదీ – 05-06-2025 (ఉదయం 9.00 AM నుంచి 10.30 గంటల వరకు)

ప్రిలిమినరీ కీ విడుదల – 06-06-2025.

ఏపీ లాసెట్ 2025 ఫలితాలు – 22-06-2025.

పరీక్ష విధానం ఇలా…

ఏపీ లాసెట్ పరీక్షలను మొత్తం 120 మార్కులకు నిర్వహిస్తారు. సీబీటీ విధానంలో ఉంటుంది. మొత్తం మూడు సెక్షన్ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పార్ట్ ఏ లో జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. వీటికి 30 మార్కులు కేటాయిస్తారు. ఇక పార్ట్ బీలో కరెంట్ ఎఫైర్స్ నుంచి 30 ప్రశ్నలు అడుగుతారు. మిగతా 60 మార్కులు భారత రాజ్యాంగం, లీగల్ అప్టిట్యూడ్ నుంచి అడుగుతారు.

ఎల్ఎల్ఎం ఎంట్రెన్స్ చూస్తే… రెండు సెక్షన్లు ఉంటాయి. లేబర్ లా, క్రైమ్స్ అండ్ టార్ట్, పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇంటర్నేషన్ లా, బిజిెన్స్ అండ్ కార్పొరేట్ లా, JURISPRUDENCE, భారత రాజ్యాంగం నుంచి ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 120 మార్కులకు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకులను కేటాయిస్తారు. ఈ ఫలితాలను ఏపీ లాసెట్ 2025 వెబ్ సైట్ లో చూడొచ్చు. మరిన్ని వివరాలకు ఈ లింకును అనుసరించండి.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం

టాపిక్

Ap LawcetEntrance TestsTeluguTelugu NewsExams
Source / Credits

Best Web Hosting Provider In India 2024